By: ABP Desam | Updated at : 18 Jul 2022 12:44 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: Twitter/@Reuters)
China Floods: చైనాలో భారీ వర్షాల కారణంగా వరదలు ముంచెత్తాయి. వరదల ధాటికి ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. వేలాది ఇళ్లు నీట మునగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.
Flash floods in southwest and northwest China have left at least a dozen dead and put thousands of others in harm’s way. Some 4,300 people have been evacuated, according to state media. https://t.co/2ADUs0EUvo
— The Associated Press (@AP) July 17, 2022
నీటిలో నగరాలు
చైనాలోని గన్సు రాష్ట్రం కింగ్‌యాంగ్‌లోని నది వెంబడి వరద నీటిలో వంతెన కొట్టుకుపోయింది. నైరుతి, వాయువ్య చైనాలో ఆకస్మిక వరదల సంభవించాయి. సిచువాన్‌లో కుండపోత వర్షం కురుస్తోంది. 12 మంది గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు.
గన్సు వాయువ్య ప్రావిన్స్‌లోని లాంగ్నాన్ నగరంలో 3వేల మందిని తరలించినట్లు అధికారులు తెలిపారు. రెండు రోజుల్లోనే 98.9 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. వాతావరణ మార్పుల కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
చర్చలు
మరోవైపు భారత్- చైనా మధ్య 16వ రౌండ్ సైనిక చర్చలు ముగిశాయి. ఎల్ఏసీ వద్ద ఉద్రిక్తతను తగ్గించేందుకు, బలగాల ఉపసంహరణకు ఇరువర్గాలు అంగీకరించినట్టు సమాచారం. హాట్‌స్ప్రింగ్స్ వద్ద ఇరు దేశాల సైనికులు వెనక్కి వెళ్లిపోవాలని, కమాండర్ స్థాయిలో జరిగిన ఈ సమావేశంలో నిర్ణయించారని తెలుస్తోంది. భారత్ వైపు ఉన్న చుషులు-మోల్డో సరిహద్దు వద్ద ఈ చర్చలు జరిగాయి. 14 కార్ప్స్ కమాండర్, లెఫ్టినెంట్ జనరల్ ఏ సేన్‌గుప్తా భారత్ తరపున చర్చలో పాల్గొన్నారు. చాన్నాళ్ల క్రితమే ఈ చర్చలు ఆగిపోయాయి.
అయితే ఈ వివాదం ఇంకా ముదరకముందే ఇలాంటి సంప్రదింపులు కొనసాగించటం అవసరం అని భావించిన విదేశాంగ మంత్రి జైశంకర్, చర్చలు తిరిగి ప్రారంభమయ్యేలా చొరవ చూపించారు. గత నెల చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీతో భేటీ అయ్యారు జైశంకర్. జీ-20 సదస్సులో పాల్గొన్న సందర్భంలోనే ఎల్‌ఏసీ వివాదంపై చర్చించారు.
Also Read: Jammu Kashmir Poonch: ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు ఆర్మీ అధికారులు మృతి
Also Read: Madhya Pradesh Bus Accident: నర్మదా నదిలో పడిన బస్సు- 12 మంది మృతి!
Ethiopian Airlines: గాఢ నిద్రలో పైలట్లు, ల్యాండ్ కాకుండా గాల్లోనే చక్కర్లు కొట్టిన విమానం, చివరికి..
Kabul Explosion: అఫ్గాన్‌లోని మసీదులో బాంబు పేలుడు, 20 మంది మృతి
సమాధుల్ని తవ్వి మృతదేహాలతో సెల్ఫీ- ఇండోనేషియాలో వింత ఆచారం
తుపాకుల పాలనకు ఏడాది- ‘డెత్ టు అమెరికా’అంటూ నినాదాలు
UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్‌లో లిజ్ ట్రస్, రిషి సునక్‌పై వ్యతిరేకత ఉందా?
High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
Tees Maar Khan Movie Review - తీస్ మార్ ఖాన్ రివ్యూ : రేసుగుర్రంలా దూసుకు వెళ్ళాలనుకున్న ఆది సాయి కుమార్, సినిమా ఎలా ఉందంటే?
Ram Charan: రామ్ చరణ్ బ్లెస్సింగ్స్ తీసుకుంటున్న ఉపాసన - ఫొటో వైరల్
Anasuya: 'నా మాటలను రాజకీయం చేయొద్దు' - నెటిజన్లకు అనసూయ రిక్వెస్ట్!