అన్వేషించండి

Iran missile strikes 2026: గల్ఫ్‌ అగ్ని గుండం- ఇంధన వనరులపై ఇరాన్ దాడులు- బహ్రెయిన్‌ రిఫైనరీలో భారీ మంటలు !

శనివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో గల్ఫ్‌ దేశాలంతటా ప్రమాద హెచ్చరిక సైరన్లు మారుమోగాయి. ఇరాన‌ నుంచి దూసుకు వస్తున్నట్టు క్షిపణులను అడ్డుకునే క్రమంలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో గల్ఫ్ దేశాలపై ప్రతీకార దాడులు.
  • బహ్రెయిన్ చమురు రిఫైనరీ ధ్వంసం, బాప్కో కార్యకలాపాలు నిలిపివేత.
  • సౌదీ, యూఏఈ చమురు కేంద్రాలపై డ్రోన్ల దాడి, పలువురికి గాయాలు.
  • ప్రతీకార దాడులు, ప్రపంచ ఇంధన మార్కెట్లో తీవ్ర ఆందోళన.

Iran Missile Strikes 2026: మధ్య ప్రాచ్యంలో యుద్ధం ఇప్పుడు భయానక స్థితికి చేరింది. గత కొన్ని రోజులుగా ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు ప్రతీకారంగా, ఇరాన్‌ ఇప్పుడు గల్ఫ్‌ దేశాలపై క్షిపణులు, డ్రోన్‌లతో విరుచుకుపడుతోంది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత మొదలైన ఈ దాడులు గల్ఫ్‌ దేశాల ఆర్థిక మూలాలపై చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. బహ్రెయిన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో పేలుళ్ల శబ్దాలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. 

బహ్రెయిన్‌లో బాప్కో రిఫైనరీ ధ్వంసం

ఈ దాడుల్లో అత్యంత తీవ్రమైన నష్టం బహ్రెయిన్‌కు వాటిల్లింది. బహ్రెయిన్ ప్రభుత్వ చమురు సంస్థ బాప్కోకు చెందిన రిఫైనరీ కాంప్లెక్స్‌పై ఇరాన్‌ క్షిపణులు దాడి చేయడంతో అక్కడ భారీ ఎత్తున ంటలు చెలరేగాయి. పరిస్థితి చేయి దాటిపోవడంతో బాప్కో తన కార్యకలాపాలకు సంబంధించి ఫోర్స్‌ మెజ్యూర్‌ ప్రకటించింది. అంటే యుద్ధం వంటి అనివార్య కారణాల వల్ల తాము చమురు సరఫరా ఒప్పందాలను ప్రస్తుతానికి నెరవేర్చలేమని ప్రపంచ దేశాలకు స్పష్టం చేసింది. 

కేవలం చమురు కేంద్రాలే కాకుండా, మనామాకు దక్షిణాన ఉన్న సిత్రా నివాస ప్రాంతంలో ఇరాన్‌ డ్రోన్ పడటంతో చిన్న పిల్లలతో సహా సుమారు 32 మంది గాయపడ్డారు. ఇది గల్ఫ్‌ దేశాల్లోని సామాన్య పౌరుల్లో ప్రాణభయాన్ని పెంచుతోంది. 

సౌదీ యూఏఈపై డ్రోన్ల దాడి

సౌదీ అరేబియాలోని అత్యంత కీలకమైన షైబా ఆయిల్‌ ఫీల్డ్ లక్ష్యంగా దూసుకొచ్చిన నాలుగు డ్రోన్‌లను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్టు సౌదీ అధికారులు వెల్లడించారు. అితే, అల్‌- ఖర్చ్‌ గవర్నరేట్‌లోని ఒక నివాస ప్రాంతంలో క్షిపణి పటడంతో ఇద్దు వ్యక్తులు మరణించగా, 12 మంది గాయపడ్డారు. 

యూనైటెడ్‌ అరబ్ ఎమిరేట్స్‌లోని ఫుజైరా ఆయిల్‌ ఇండస్ట్రీ జోన్‌లో కూడా పేలుళ్లు జరిగాయి. కూల్చివేసిన డ్రోన్ల శకలాలు పడటం వల్ల అక్కడ భారీగా మంటలు చెలేగాయి. అటు కతార్, కువైట్‌ దేశాలు కూడా తమ గగనతలంపై డ్రోన్లు ముప్పు పొంచి ఉందని ధ్రువీకరించాయి. 

ఆకాశంలో సైరన్లు మోత 

శనివారం తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో గల్ఫ్‌ దేశాలంతటా ప్రమాద హెచ్చరిక సైరన్లు మారుమోగాయి. ఇరాన‌ నుంచి దూసుకు వస్తున్నట్టు క్షిపణులను అడ్డుకునే క్రమంలో సుమారు 12 నుంచి 13 భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అల్‌ జజీరా వార్తా సంస్థ వెల్లడించింది. భద్రతా కారణాల దృష్ట్యా గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దీని వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. 

ఎందుకీ దాడులు

ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన దాడులకు స్పందనగానే ఈ దాడులు చేస్తున్నట్టు టెహ్రాన్ ప్రకటించింది. గల్ఫ్‌దేశాల్లో ఉన్న అమెరికా ఆస్తులను వారి మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా తమ శక్తిని నిరూపించుకోవాలని ఇరాన్ భావిస్తోంది.  హార్ముజ్‌ జలసంధి, గల్ఫ్‌ ప్రాంతంలో చమురు ఉత్పత్తికి ఆటంకం కలగడం వల్ల ప్రపంచ ఇంధన మార్కెట్‌ ఆందోళనలో ఉంది. బాప్కో వంటి సంస్థలు ఉత్పత్తిని నిలిపివేయడం వల్ల రాబోయే రోజుల్లో భారత్‌ వంటి దేశాలకు  చమురు దిగుమతులు కష్టతరం కావచ్చు. 

Frequently Asked Questions

గల్ఫ్ దేశాలపై ఇరాన్ ఎందుకు దాడులు చేస్తోంది?

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడులకు ప్రతీకారంగా, గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా ఆస్తులను, వారి మిత్రదేశాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇరాన్ ఈ దాడులు చేస్తోంది.

ఈ దాడుల వల్ల ఏ దేశాలకు అత్యంత నష్టం వాటిల్లింది?

బహ్రెయిన్‌లో బాప్కో రిఫైనరీ ధ్వంసం కావడం వల్ల ఆ దేశానికి తీవ్ర నష్టం వాటిల్లింది. సౌదీ అరేబియా, యూఏఈలలో కూడా దాడులు జరిగాయి.

దాడుల వల్ల సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి?

బహ్రెయిన్‌లో నివాస ప్రాంతంలో డ్రోన్ పడటంతో చిన్న పిల్లలతో సహా 32 మంది గాయపడ్డారు. దీంతో గల్ఫ్‌ దేశాల్లోని సామాన్య పౌరుల్లో ప్రాణభయం పెరిగింది.

ఈ దాడుల వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఎలాంటి ప్రభావం పడింది?

భద్రతా కారణాల దృష్ట్యా గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలు తమ గగనతలాన్ని తాత్కాలికంగా మూసివేశాయి. దీని వల్ల అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి.

టాప్ హెడ్ లైన్స్

US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Embed widget