British Soldiers Faint: పరేడ్ చేస్తూనే కళ్లు తిరిగి పడిపోయిన బ్రిటీష్ సైనికులు, ఎండల ఎఫెక్ట్
British Soldiers Faint: బ్రిటీష్ సైనికులు ప్రిన్స్ విలియమ్స్ ముందు పరేడ్ చేస్తుండగా ముగ్గురు సైనికులు కళ్లు తిరిగి కింద పడిపోయారు.
British Soldiers Faint:
ముగ్గురు సైనికులకు అస్వస్థత..
బ్రిటన్‌లో ప్రిన్స్ విలియమ్ ముందు కలర్ పరేడ్ నిర్వహించే క్రమంలో ముగ్గురు సైనికులు కళ్లు తిరిగి కింద పడిపోయారు. ఎండ ధాటిని తట్టుకోలేక నిలబడిన చోటే కుప్ప కూలిపోయారు. Fox News ఈ విషయం వెల్లడించింది. అంత ఎండలోనూ యూనిఫామ్స్ వేసుకోవడం, పైగా హ్యాట్‌లు ధరించడం చాలా ఇబ్బందికి గురి చేసింది. ప్రస్తుతం అక్కడ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డీహైడ్రేట్ అయిన ముగ్గురు సైనికులు ఇలా పడిపోయారు. అయినా...పరేడ్ కొనసాగింది. కొందరు సైనికులు వచ్చి స్ట్రెచర్‌పై ముగ్గురినీ తీసుకెళ్లారు. ఈ పరేడ్‌పై ప్రిన్స్ విలియమ్ స్పందించాడు. అంత క్లిష్ట పరిస్థితుల్లోనూ పరేడ్ సక్సెస్‌ఫుల్‌గా చేశారని ప్రశంసలు సైనికులపై కురిపించారు.
"కల్నల్స్ రివ్యూలో కలర్ పరేడ్‌లో పాల్గొన్న ప్రతి ఒక్క సైనికుడికీ నా ధన్యవాదాలు. అంత కష్టమైన పరిస్థితులున్నా అద్భుతంగా పరేడ్ చేశారు. ఇంత హార్డ్ వర్క్ చేసి రిహార్సల్స్ చేయడం గొప్ప విషయం. ప్రతి ఒక్కరికీ ఈ క్రెడిట్ ఇవ్వాల్సిందే. థాంక్యూ"
- ప్రిన్స్ విలియమ్స్
Conducting the Colonel's Review of the King's Birthday Parade today. The hard work and preparation that goes into an event like this is a credit to all involved, especially in today’s conditions. pic.twitter.com/IRuFjqyoeD
— The Prince and Princess of Wales (@KensingtonRoyal) June 10, 2023
పరేడ్ జరుగుతుండగానే ముగ్గురు సైనికులు కిందపడిపోగా..ఇతర సైనికులు వచ్చి వాళ్లను ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ అలెర్ట్ ప్రకటించింది. సౌత్ ఇంగ్లాండ్‌లో వేడి గాలులు వీచే ప్రమాదముందని హెచ్చరించింది.
💂 At least three British royal guards collapsed during a parade rehearsal in London ahead of King Charles' official birthday as temperatures exceeded 88 degrees Fahrenheit pic.twitter.com/V0fLjROoD5
— Reuters (@Reuters) June 10, 2023
గతేడాది క్వీన్ ఎలిజబెత్-II అంత్యక్రియలు చేసిన సమయంలోనూ ఇలాంటి సంఘటనే జరిగింది. రాణి ఎలిజబెత్ 2 శవపేటిక ఉంచిన వేదిక వద్ద విధి నిర్వహణలో ఉన్న రాయల్ గార్డ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో అతని ముఖం నేరుగా నేలను తాకింది. దీంతో అక్కడ ఉన్న వారు వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా అయింది. వెస్ట్‌మినిస్టర్ హాల్లో ఎత్తైన వేదిక కాటఫ్లాక్పై శవపేటికను ఉంచారు. కాటఫ్లాక్ వేదిక చుట్టూ ప్రత్యేక సైనిక బలగాలు భద్రతను పర్యవేక్షించాయి. అదే సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న ఓ గార్డ్ స్పృహతప్పి కుప్పకూలిపోయాడు. వెంటనే పక్కనున్న భద్రతా సిబ్బంది అతడిని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఎక్కువ సేపు నిలబడి ఉండటం వల్ల గార్డ్ కింద పడిపోయాడు.
A royal guard at Queen Elizabeth II's coffin collapses inside of the chapel. pic.twitter.com/JI1MyfdtkV
— Alex Salvi (@alexsalvinews) September 14, 2022
Also Read: SpaceX Engineer: 14 ఏళ్లకే సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్, అది కూడా స్పేసెక్స్ కంపెనీలో - ఏం బుర్ర సామి నీది