Work from cinema hall: సెలవు పెట్టి సినిమాకెళ్లొచ్చుగా .. మళ్లీ పని ఒత్తిడి అని ఫిర్యాదులు ! ఈ ఉద్యోగిని చేస్తున్నది కరెక్టేనా ?
Bengaluru: బెంగళూరులో ఓ యువతి సినిమా చూస్తూ పని చేసుకుంటున్న ఫోటో వైరల్ అయింది. చాలా మంది పాపం సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అంటున్నారు. కానీ సెలవు పెట్టి సినిమా చూడొచ్చుగా అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.

Bengaluru Work from cinema hall: బెంగళూరు అంటే కార్పొరేట్ సంస్కృతి ఎక్కువగా ఉండే నగరం. ఉద్యోగులు ఇరవై నాలుగు గంటల్లో ఎప్పుడైనా పని చేయాల్సి ఉంటుంది. అందుకే ట్రాఫిక్ లోనూ పని చేసుకుంటున్న దృశ్యాలు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు ఇంటికెళ్లలేకపోతే.. రోడ్ల మీదే పని చేసుకుంటారు. అయితే ఓ యువతి సినిమాల్లో పని చేసుకుంటూ కనిపించింది. కొంత మంది ఫోటోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
సినిమా థియేటర్‌లో ‘లోకహ్’ (Lokah) సినిమా చూస్తూ ఒక మహిళ తన ల్యాప్‌టాప్‌తో పనిచేస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో సోషల్ మీడియాలో బెంగళూరు క వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌పై చర్చ ప్రారంభమయింది. హై-ప్రెషర్ కార్పొరేట్ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుందని ఈ మహిళ విధులు నిర్వహిస్తున్న వైనం చూపిస్తోందని.. , ఉద్యోగులు కేవలం రెండు గంటల సినిమా సమయంలో కూడా పని ఒత్తిడి నుంచి విముక్తి పొందలేకపోతున్నారని కొంత మంది కామెంట్ చేస్తున్నారు.
బెంగళూరులో మాత్రమే ఇలాంటివి జరుగుతాయి.. లోకహ్ సినిమా చూడటానికి వెళ్లాను, ముందు వరుసలో ఒక మహిళ ల్యాప్‌టాప్ తెరిచి ఆఫీసులో ఉన్నట్టు పనిచేస్తోందని రెడిట్ లో ఓ యూజర్ పోస్ట్ చేశారు. “ఇక్కడి వర్క్ కల్చర్ ఎంత గందరగోళంగా ఉందో ఇది చూపిస్తోంది, ప్రజలు రెండు గంటలు కూడా ఆఫీస్ ఒత్తిడి నుంచి బయటపడలేరు,” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పోస్ట్ వైరల్ కావడంతో సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. కొందరు ఈ మహిళ చర్యను “టాక్సిక్ వర్క్ కల్చర్” ఫలితంగా భావిస్తే, మరికొందరు ఆమె వ్యక్తిగత బాధ్యతారాహిత్యాన్ని తప్పుబట్టారు. ఆఫీసు పనిని ఇంట్లో లేదా ఆఫీసులో చేయకుండా సినిమాకు వచ్చి చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
"WFH" in Bengaluru now means "Work From (Cinema) Hall"?
— Trend Pulse (@Trend_Pulse7) September 12, 2025
A viral photo of a woman working on her laptop in a movie theater has sparked a debate about India's work-life balance. Is this dedication or a sign of burnout? The incident symbolizes the relentless 'hustle culture' that… pic.twitter.com/Nks1fLGm6S
ఈ మహిళ వర్క్-ఫ్రమ్-హోమ్ (WFH) సదుపాయాన్ని దుర్వినియోగం చేసి, ఆఫీసుకు చెప్పకుండా సినిమాకు వెళ్లి, అత్యవసర మీటింగ్‌లో పాల్గొనవలసి వచ్చి ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. “ఇది ఉద్యోగి రహస్యంగా సినిమాకు వెళ్లిన ఫలితం కావచ్చు,” అని ఒక యూజర్ వ్యాఖ్యానించారు.
#Bengaluru’s infamous hustle culture has become a talking point online after a #Reddit user shared a picture of a woman working on her laptop in a movie theatre.
— Business Today (@business_today) September 11, 2025
➡️ Addressing the “chaotic” #workculture in the #Karnataka capital, the user wrote on the subreddit r/Bangalore:… pic.twitter.com/WBmwtEAS9B
కారణం ఏదైనా.. పని అనేది..ఎక్కడైనా చేసుకోవచ్చని.. చేసే ఉద్యోగిపై ఆధారపడి ఉంటుందన్న సెటైర్లు గట్టిగానే వినిపిస్తున్నాయి.





















