British Commonwealth: న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఇంకా బ్రిటీష్ పాలనలో ఉన్నాయా..?
British Commonwealth: ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూకే యూనియన్ జాక్ ప్రభావం ఎందుకు?
British Commonwealth:
మీరెప్పుడైనా న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జాతీయ జెండాలను గమనించారా. ఇలాంటి జెండాను ఎక్కడో చూసినట్లు అనిపించింది కదా. పైగా ఎందుకు ఆ రెండు జెండాలు చూడటానికి ఒకేలా ఉన్నాయి ఆలోచించారా. వాస్తవం ఏంటంటే..ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జెండాలపై యూకే యూనియన్ జాక్ ప్రభావం ఉంటుంది. యూనియన్ జాక్ అంటే యునైటెడ్ కింగ్ డం జెండా. అంటే స్కాట్లాండ్, ఐర్లాండ్, ఇంగ్లండ్ దేశాల జెండాలను కలిపితే వచ్చేదే యూనియన్ జాక్. యునైటైడ్ కింగ్ డమ్ అస్థిత్వం ఈ జెండా. ఆస్ట్రేలియాపై, న్యూజిలాండ్ లపై యూనియన్ జాక్ ప్రభావం ఎందుకుంది అంటే ఆ రెండూ కామన్ వెల్త్ దేశాలే కాబట్టి.
భారత్ కూడా :
ఇంగ్లండ్, స్కాట్లాండ్, ఐర్లాండ్ తో పాటు భారత్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, పపువా న్యూ గినియా ఇలా 54 దేశాలు కామన్ వెల్త్ దేశాలుగా ఉండేవి. అంటే ఆ దేశాల్లో నేరుగా బ్రిటీష్ పరిపాలనే సాగేది. వీటినే కామన్ వెల్త్ దేశాలు అంటారు. భారత్ కు 1947 లో స్వతంత్రం వచ్చింది. అలానే మిగిలిన దేశాలు కూడా కాలక్రమేణా రిపబ్లిక్ దేశాలుగా మారాయి. కానీ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి కొన్ని దేశాలు మాత్రం స్వతంత్రంగా మారినా, ప్రజాస్వామ్య విధానాలను అనుసరిస్తున్నా నేటికీ వాటి అధిపతి మాత్రం అధికారికంగా యూకే సింహాసమే. అంటే నిన్నటి వరకూ క్వీన్ ఎలిజబెత్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలకు అధికారికంగా రాణి అన్నమాట. ఇప్పటికీ కెనడా, ఆసియా ఫసిఫిక్ అనేక చిన్న చిన్న దేశాలు, కరేబియన్ దీవులు యునైటెడ్ కింగ్ డమ్ అధీనంలోనే ఉన్నాయి. వాటికి ప్రధానులు ఉండొచ్చు. సొంత ప్రభుత్వాలు ఉండొచ్చు. కానీ సార్వభౌమాధికారం మాత్రం యునైటెడ్ కింగ్ డమ్ దే.
యూకే అధికారం అక్కడి వరకే :
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నేటికీ యూకే పరిపాలన ఉండటం అక్కడ అనేక వివాదాలకు కారణమైంది. రోజూవారీ ప్రభుత్వ కార్యకలాపాల్లో యూకే జోక్యం ఉండకపోయినప్పటికీ...గవర్నమెంట్ కి రాణి అధినేత్రి కాకపోయినప్పటికీ...రాజ్యం పరంగా చూస్తే మాత్రం రాణి అధీనంలో ఉన్నాయనే చెప్పాలి. కొత్త ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు వాటిని ఆమోదించటం, కొంత మంది అధికారుల నియమాకం ప్రత్యేకించి గవర్నర్ జనరల్ తరహా వ్యవస్థలు నేటికి కొన్ని కామన్ వెల్త్ దేశాల్లో కొనసాగుతూనే ఉన్నాయి. అంతే కాకుండా యూకే సింహాసంపైన కూర్చున్న వారికి ఉండే ప్రత్యేక అధికారాలు అనేక సార్లు ఆయా దేశాల్లో రాజకీయ సంక్షోభాలకు కారణమయ్యాయి. 1975 లో ఆస్ట్రేలియాలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడినప్పుడు యూకే నియమిత గవర్నర్ జనరల్...... ప్రధానమంత్రిని పదవి నుంచి తొలగించటం తీవ్ర వివాదాస్పదమైంది.
ఇటీవలే బార్బడాస్ :
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇండియా, నైజీరియా, పాకిస్థాన్ లాంటి దేశాలు కామన్ వెల్త్ నుంచి బయటకి వచ్చి స్వతంత్రం పొందాయి. 1970 లో కూడా కరీబియన్ దీవులైన డొమినికా, గయానా, ట్రినిడాడ్, టొబాగో ఇండిపెండెన్స్ ప్రకటించుకున్నాయి. 1992 లో మారిషస్ బయటకు రాగా....చివరిసారిగా 2021 లో బార్బడాస్ కామన్ వెల్త్ నుంచి బయటకు వచ్చిన దేశం.