India Pakistan War: అబ్బో ..ఇంత ఓవరాక్షన్ చేస్తోందేంటి ? పాక్ యాంకర్ వీడియో వైరల్
Nadia Khan: పాకిస్తాన్ అసలే టెన్షన్ లో ఉంటే అక్కడి కొంత మంది యాంకర్లు ఓవరాక్షన్ తో కామెడీ చేస్తున్నారు. నదియా ఖాన్ అనే యాంకర్ సెలబ్రిటీలపై స్టూడియోలో కూర్చుని రెచ్చిపోయారు.

Pak Anchor Nadia Khan: పహల్గాం దాడిని పాక్ సైన్యం సాయంతో ఉగ్రవాదులు పూర్తి చేశారు. ఇప్పుడు అది పాకిస్తాన్ కు పెను ముప్పు తెచ్చి పెట్టింది. పాకిస్తాన్ సైన్యం ఓవరాక్షన్ తో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అయితే పాకిస్తాన్ లో కూడా ఇలాంటి ప రిస్థితుల్లో సీరియస్ కామెడీ పండించేవాళ్లు పెరిగిపోయారు. అలాంటి వారిలో నటి, టీవీ యాంకర్ అయిన నదియా ఖాన్ ఒకరు.
ఆమె యాంకర్ సీట్లో కూర్చునే నవరసాలు పండిస్తూ వార్తలు చదివింది. ఏడ్చింది.. కోపగించుకుంది. ఆవేశపడింది. కావాలంటే ఆ వీడియో మీరే చూడండి.
पाकिस्तानी एक्ट्रैस नादिया खान स्टूडियो लगी रोने, सेलिब्रिटिज क्यों कर रहे हैं भारत को पसंद इससे हो गई नाराज ... #NadiaKhan #Pakistan #IndiaPakistanTensions pic.twitter.com/QDHsJivksy
— Live Dainik (@Live_Dainik) May 8, 2025
నదియా ఖాన్ ఇంత బాగా ఒక్క వీడియోలు హావభావాలు పండించారంటే ఖచ్చితంగా ఆమె న్యూస్ యాంకర్ మాత్రమే కాదు మంచి నటిగా ఎదిగిపోయి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ ఆమె నటిగా ఎదుగలేదుకానీ.. నటినే. ఎంటర్ టెయిన్ మెంట్ ఇండస్ట్రీలో తన ముద్ర వేయడానికి ప్రయత్నించారు కానీ.. ఆ దూకుడును తట్టుకోలేక ఎవరూ పెద్దగా చాన్సులివ్వలేదు. అందుకే బాగా ఫ్రస్ట్రేషన్ కు గురయ్యారేమో కానీ ఇప్పుడు సందు దొరికిందని పాక్ సెలబ్రిటీలందర్నీ దున్ని పడేశారు.
𝗕𝗘𝗟𝗧 𝗧𝗥𝗘𝗔𝗧𝗠𝗘𝗡𝗧 𝗼𝗳 𝘀𝗵𝗮𝗺𝗲𝗹𝗲𝘀𝘀 🇵🇰 𝗬𝗼𝘂𝗧𝘂𝗯𝗲𝗿𝘀
— Pakistan Cricket Team USA FC (@DoctorofCricket) May 7, 2025
Nadia Khan criticized Pakistani YouTubers who aren't condemning Indian Attack on 🇵🇰 due to their Social Media Following.#IndiaPakistanWarpic.twitter.com/ZMeAjMlLaO
మిగతా అందరు సెలబ్రిటీలు సరే.. ముందు ఈ స్వయం ప్రకటిత మీడియా సెలబ్రిటీ దేశం కోసం ఏం చేశారన్న ప్రశ్నలు వస్తున్నాయి. కానీ తాను ప్రశ్నించానని ఈమె కవర్ చేసుకుంటున్నారు.
Television host Nadia Khan got emotional while talking about the behavior of Pakistani celebrities during the ongoing tensions between Pakistan and India. #NadiaKhan #TheCurrent pic.twitter.com/AnSBgw1W1m
— سید عامر حسین (@syedamirhussa16) May 9, 2025
ఇటీవలి కాలంలో చాలా మంది పాక్ సెలబ్రిటీలు అక్కడి కన్నా ఇండియాలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నారు. దీంతో చాలా మంది భారత్ కు వ్యతిరేకంగా కా మెంట్స్ చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. బాలీవుడ్ లో చాన్స్ వస్తే తమ లైఫ్ సెటిల్ అయిపోతుందని వారు అనుకుంటున్నారు. నదియా ఖాన్ కు అలాంటి అవకాశాలు లేవు కాబట్టి ఆమె రెచ్చిపోతున్నారని.. ఇతర సెలబ్రిటీలు మనసులో తిట్టుకుంటున్నారు.
Nadia Khan on Indian government being unhappy about the popularity of Pakistani stars in India and the need for Pakistani actors to end their obsession with Bollywood.
— Pakistani Cinema (@PakistaniCinema) May 1, 2025
Through: @arynewstv #NadiaKhan pic.twitter.com/foCRziINpr





















