అన్వేషించండి

50 Year Old Woman 30 Year Old Boy Love: 50 ఏళ్ల ప్రియురాలి కోసం 200 అడుగుల టవరెక్కిన 30 ఏళ్ల ప్రియుడు! యూపీలో వింత ప్రేమకథ - చివరికికేమయిందంటే?

Viral Love Story: ఆమె వయసు యాభై. అతని వయసు ముఫ్పై. నలుగురు పిల్లల తల్లి కూడా. అయినా ఆమె కోసం టవరెక్కాడు ఆ లవర్.

Man Climbs Mobile Tower for Girlfriend UP:  ప్రేమకు కళ్లు లేవు.. వయసుతో అస్సలు పనేలేదు అనే పాత సామెతను ఈ కాలపు ప్రేమికులు అక్షరాలా నిరూపిస్తున్నారు. తనకంటే ఏకంగా 20 ఏళ్లు పెద్దదైన, నలుగురు పిల్లల తల్లి అయిన 50 ఏళ్ల ప్రియురాలి కోసం ఓ 30 ఏళ్ల యువకుడు ఏకంగా 200 అడుగుల ఎత్తున్న మొబైల్ టవరెక్కి నానా హంగామా చేశాడు. ప్రియురాలిపై అలిగి, ఆమెను చూడాలంటూ సినిమా ఫక్కీలో ఒక రాత్రి అంతా టవర్‌పైనే గడిపిన ఈ వింత ప్రేమికుడి కథ ఉత్తరప్రదేశ్   సరిహద్దుల్లో జరిగింది. 

ఆమె ఫోన్ ఎత్తలేదని.. ముంబై నుండి యూపీకి పరుగు! 

 ఉత్తరప్రదేశ్‌కు చెందిన చందన్  అనే యువకుడు ముంబైలో ఉపాధి పొందుతున్నాడు. ఈ క్రమంలోనే అతనికి నలుగురు పిల్లల తల్లి, యాభై ఏళ్ల వయసున్న ఓ మహిళతో పరిచయం ఏర్పడి, అది కాస్తా కాస్త ముదిరి  గాఢమైన ప్రేమ గా మారింది. అయితే, గత కొన్ని రోజులుగా సదరు ప్రియురాలు చందన్ ఫోన్ ఎత్తడం మానేసింది. దీంతో తట్టుకోలేకపోయిన మన రోమియో.. ముంబై నుండి నేరుగా ప్రియురాలి స్వగ్రామానికి పరుగున వచ్చాడు. అక్కడ కూడా ఆమె ముఖం చాటేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
  
 పోలీసులకు తానే ఫోన్ చేసి.. టవర్ ఎక్కేసాడు! 

ప్రియురాలిని లొంగతీసుకోవడానికి చందన్ ఒక ఊహించని స్కెచ్ వేశాడు. గ్రామంలో ఉన్న 200 అడుగుల మొబైల్ టవర్‌ను చకచకా ఎక్కేసాడు. అంతటితో ఆగకుండా, తానే స్వయంగా జేబులోంచి మొబైల్ తీసి పోలీసుల అత్యవసర నంబర్  112 కు డయల్ చేశాడు.  సార్.. నేను టవర్ చివర ఉన్నాను.. నా ప్రియురాలిని ఇక్కడికి పిలిపించకపోతే దూకేస్తా  అంటూ పోలీసులకే మైండ్ బ్లాక్ అయ్యే సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి వేళ ఫోన్ రావడంతో కంగారుపడిన పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
 
ఆమెను పిలిపిస్తాం అని నచ్చజెప్పిన ఖాకీలు! 

చందన్ టవర్‌పై ఉండటం చూసి గ్రామస్థులంతా నిద్రలేచి అక్కడకు చేరుకున్నారు. పోలీసులు మెగాఫోన్ల ద్వారా అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కిందకు దిగాలని ఎంత బ్రతిమాలినా వినని చందన్..  ఆమె రావాల్సిందే  అంటూ మొండికేసాడు. చివరకు పోలీసులు పక్కా ప్లాన్ వేశారు. నువ్వు కిందకు దిగు.. నీ ప్రియురాలిని పిలిపించి మీ ఇద్దరికీ మాట్లాడిస్తాం  అంటూ గట్టిగా హామీ ఇచ్చారు. పోలీసుల మాటలు నమ్మిన మన ప్రేమికుడు మెల్లగా టవర్ దిగి కిందకు వచ్చాడు.
  
 ప్రేమ మైకంలో ఉన్నోడికి.. లాకప్ ట్రీట్‌మెంట్!   

చందన్ కిందకు అడుగు పెట్టగానే పోలీసులు అతనికి  గౌరవ వందనం చేసి అదుపులోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం, ఆత్మహత్యాయత్నం నెపంతో కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.  ప్రేమించడం తప్పు కాదు బాబు.. కానీ ఇలా అర్ధరాత్రి టవర్లు ఎక్కి ఊరి జనాన్ని, పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించడం ఏంటయ్యా  అంటూ లాకప్‌లో పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ప్రేమ మైకంలో టవరెక్కిన చందన్.. ఇప్పుడు లాకప్ ఊచలు లెక్కబెడుతుండటం చూసి గ్రామస్థులు సెటైర్లు వేసుకుంటున్నారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Siraj Wierd Throw Towords Umpire: అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
అంపైర్ వైపు దూసుకొచ్చిన సిరాజ్ రాకెట్ త్రో.. జడేజా ఫన్నీ రియాక్షన్ తో గాలే టెస్టులో నవ్వులు.. ఆన్ ఎయిర్ లో తిట్టుకున్న కామేంటేటర్లు..!
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
ABP Desam Top 10, 18 August 2026: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి - Afternoon
Pujara Bold Strategy: టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
టీమిండియా గెలవాలంటే సాహసోపేత డిక్లరేషన్ ఇవ్వాల్సిందే.. గాలే టెస్ట్ లో నెగ్గాలంటే ఏం చేయాలో చెప్పిన మాజీ క్రికెట‌ర్!
Ayodhya Ram Mandir News: అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
అయోధ్య రామ మందిరం విరాళాల కేసులో బిగ్ ట్విస్ట్ ! చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలకు క్లీన్ చిట్!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Embed widget