అన్వేషించండి

Pune Ketan Agrawal Murder Case: పుణె మర్డర్ కేసులో నయా ట్విస్ట్ - లవర్ చేతన్‌పై మొత్తం తోసేస్తూ.. తప్పించుకునే ప్లాన్‌లో సియా గోయల్!

Chetan Chaudhary Blame Game: పుణె మర్డర్ కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. లవర్ చేతన్‌పై మొత్తం తోసేసింది సియా గోయల్.. ఇద్దరి మధ్య బ్లేమ్ గేమ్ మొదలైంది.

Pune Ketan Murder Investigation: మహారాష్ట్రలోని పుణె నగరంలో సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తన బాయ్‌ఫ్రెండ్ కేతన్‌ను కిరాతకంగా చంపిన ఆరోపణలపై అరెస్ట్ అయిన యువతి సియా గోయల్  , పోలీసుల కస్టడీలో కొన్ని రోజులు గడిపిన తర్వాత సరికొత్త డ్రామాకు తెరలేపింది. ఈ ఘోర హత్యకు తానేమీ కారణం కాదని, తన  లవర్ చేతన్ చౌదరి   చెప్పడం వల్లే అంతా జరిగిందని, అసలు సూత్రధారి ఆయనేనంటూ బాంబు పేల్చింది. దీంతో ఈ మర్డర్ మిస్టరీలో ఇప్పుడు సరికొత్త లవ్ అండ్ క్రైమ్ యాంగిల్ బయటపడి కేసు మరింత ముదిరింది.
 
 నువ్వే చేశావంటే.. నువ్వే చేశావ్! నిందితుల మధ్య మొదలైన బ్లేమ్ గేమ్ 

పోలీస్ లాకప్‌లో విచారణ ముదురుతున్న కొద్దీ నిందితుల్లో వణుకు మొదలైంది. ఒకప్పుడు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన సియా గోయల్, చేతన్ చౌదరిలు ఇప్పుడు చట్టం నుండి ఎలాగైనా తప్పించుకోవాలనే ఏకైక రూట్‌లో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు.  ఈ మర్డర్ ప్లాన్ మొత్తం చేతన్‌దే.. ఆయనే నన్ను ఉసిగొలిపి ఇదంతా చేయించాడు  అని సియా వాదిస్తుండగా.. ఇటు చేతన్ మాత్రం సీన్ రివర్స్ చేశాడు.  నాకు ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదు. కేతన్‌ను వదిలించుకోవడానికి సియానే పక్కా స్కెచ్‌తో అంతా స్వయంగా చేసి, ఇప్పుడు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తోంది  అంటూ పోలీసుల ఎదుట స్టేట్‌మెంట్ ఇచ్చాడు.
  
 కస్టడీలోనే అసలు రంగు బయటపెట్టిన ప్రియురాలు!   

మొదట కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా సియా గోయల్‌ను పుణె పోలీసులు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. జైలు ఊచలు లెక్కబెట్టాల్సి వస్తుందని భయపడిన సియా, చట్టం నుండి ఎస్కేప్ అవ్వడానికి తన రెండో ప్రియుడు చేతన్‌ను ఇందులో ఇరికించే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ చేతన్ చౌదరిపై నేరం నెట్టేస్తే, తను కేవలం సహకరించిన వ్యక్తిగానే  మిగిలిపోయి శిక్ష తీవ్రత నుండి లేదా కఠినమైన జైలు శిక్ష నుండి తప్పించుకోవచ్చనే క్రిమినల్ బ్రెయిన్‌తోనే ఆమె ఈ సరికొత్త ట్విస్ట్‌ను తెరపైకి తెచ్చిందని లీగల్ ఎక్స్‌పర్ట్స్ భావిస్తున్నారు.
  
 లవ్ ట్రయాంగిల్ వెనుక దాగి ఉన్న క్రూరమైన స్కెచ్! 

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, ఈ హత్య వెనుక ఒక బలమైన లవ్ ట్రయాంగిల్  ఉన్నట్లు తెలుస్తోంది. మృతుడు కేతన్ అగర్వాల్, నిందితురాలు సియా గోయల్ చాలా కాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో చేతన్ చౌదరి అనే మరో వ్యక్తి సియా జీవితంలోకి ప్రవేశించాడు. పాత బాయ్‌ఫ్రెండ్ కేతన్‌ను వదిలించుకుంటేనే తామిద్దరం హ్యాపీగా ఉండొచ్చనే క్రూరమైన ఆలోచనతోనే ఈ హత్యకు స్కెచ్ వేశారని సమాచారం. తీరా పట్టుబడ్డాక, పాపం పండేసరికి ఒకరికొకరు శత్రువులుగా మారిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.
  
 మిస్టరీ ఛేదించే పనిలో పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు! 

నిందితులు ఇద్దరూ ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ తప్పించుకునే రూట్ వెతుక్కుంటుండటంతో పుణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు శాస్త్రీయ ఆధారాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. హత్య జరిగిన సమయంలో ఇద్దరి మొబైల్ లొకేషన్లు, వారి మధ్య జరిగిన చాటింగ్‌లు, కాల్ డేటా రికార్డులను  నిశితంగా పరిశీలిస్తున్నారు. సియా మాటల్లో ఎంత నిజం ఉంది? చేతన్ పాత్ర ఎంతవరకు ఉందనేది త్వరలోనే తేలుస్తామని, ఇలాంటి బ్లేమ్ గేమ్‌లతో చట్టం నుండి ఎవరూ తప్పించుకోలేరని పుణె పోలీస్ ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. 


   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Wife Kills Husband: భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
భర్తను ముక్కలుగా నరికి పూడ్చేసిన భార్య - ఆస్ట్రేలియాలో ఉన్నాడని రెండేళ్లు డ్రామా !
Advertisement

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Hanumakonda Crime News: హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
హనుమకొండలో ఘోరం.. కాళ్లు, చేతులు కట్టేసి భార్యను హత్య చేసిన భర్త.. పోలీసులకు చెప్పిన కుమారుడు
Rains In AP and Telangana: ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్- గోదావరి ఉగ్రరూపం
ద్రోణి ప్రభావంతో ఏపీలో ఆ జిల్లాల్లో వర్షాలు.. తెలంగాణలో పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్
Revanth Reddy On Uppal Nalla Cheruvu: ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
ఉప్పల్ నల్లచెరువుకు జలకళ.. హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
Secret Soldier : చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
చైనా పీస్ కాదు సీక్రెట్ సోల్జర్ - సెన్సార్ అభ్యంతరాలతో టైటిల్ చేంజ్... రిలీజ్ ఎప్పుడంటే?
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బైక్‌లే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ లిమిటెడ్ ఎడిషన్‌కు అతి భారీ డిమాండ్
కేవలం 3 నిమిషాల్లోనే అమ్ముడైన రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 X రఫ్ క్రాఫ్ట్స్ - ఏంటి దీని స్పెషాలిటీ?
Embed widget