అన్వేషించండి

Pulivendula Crime News : డ్రమ్ములో నాలుగేళ్ల చిన్నారి మృతదేహం! పులివెందులలో దారుణం! హంతకుల కోసం పోలీసుల వేట!

కడప జల్లాల్లో దారుణం జరిగింది. కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారి మృతదేహం నీటి డ్రమ్ములో లభించింది. దీంతో ఎవరి పని అయ్యి ఉంటుందనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • పులివెందుల నిత్విక మృతి కలకలం; డ్రమ్ములో మృతదేహం లభ్యం.
  • పొరుగింటి మహిళపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు, పోలీసులు విచారణ.
  • కుట్టుమిషన్ గొడవతో ఇరు కుటుంబాల మధ్య వైరం, గతంలో ఫిర్యాదులు.
  • చిన్నారి హత్యతో పాత గొడవలు మళ్ళీ సంచలనమయ్యాయి.

Pulivendula Crime News : పులివెందులకు సమీపంలోని గ్రామంలో జరిగిన దారుణ ఘటన సంచలనంగా మారుతోంది. గురువారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన నాలుగేళ్ల చిన్నారి చివరికి ఇంటి పరిసరాల్లో ఉండే డ్రమ్ములో మృతదేహమై కనిపించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఎక్కడికైనా వెళ్లి ఆడుకుంటుందేమో అన్న ఆలోచనలో  ఉన్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఈ చిన్నారి అలా చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇదంతా పొరుగింటి వారు చేసిన పనిగా అనుమానిస్తున్నారు. నాలుగేళ్ల చిన్నారి డ్రమ్‌లోకి వెళ్లేంత హైట్ కాదని చంపేసి అందులో పడేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

లింగాల మండలంం లోపట్నూతల గ్రామంలో ఆ దారుణం జరిగింది. చిన్నారి పేరు నిత్విక.  నాగవేటి రామాచారి, సృజన దంపతుల కుమార్తె. ఇంటి ఆవరణంలో ఆడుకుంటూనే గురవారం సాయంత్రం కనిపించుండా పోయింది. చిన్నారి కోసం చాలా ప్రాంతాల్లో గాలించారు. చివరకు ఆ చిన్నారి నీళ్ల ట్యాంకులో పడి ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డ్రమ్ నాలుగు అడుగులు ఉంటుందని చిన్నారి అందులో ఎలా పడి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది గిట్టని వారు చేసిన పనిగానే చెబుతున్నారు. 

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు చిన్నారి నిత్వికది అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారు ఫిర్యాదులో పేర్కొన్న అనుమానితులను పిలిచి విచారిస్తున్నారు. వీరిలో పొరుగింటి మహిళ పేరు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. చాలా కాలంగా ఇరువురి మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. కుట్టుమిషన్ విషయంలో వీరి మద్య రైవల్రీ నడుస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాలు పోలీసు స్టేషన్‌లో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. 

గతంలో కూడా కొన్ని ఘోరాలు జరిగాయని స్థానికులు చెబుతున్నారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి సంబంధించిన బైక్‌లు రాత్రిరాత్రే కాలిపోయాయి. ఇది పక్కంటి వారి పనేనని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో కేసులో వీరిపై పొరుగింటి వారు ఫిర్యాదు చేశారు. ఇలా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకుంటూ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈక్రమంలోనే ఇప్పుడు చిన్నారి హత్య కలకలం రేపుతోంది.

Frequently Asked Questions

పులివెందుల దగ్గర జరిగిన దారుణ ఘటన ఏమిటి?

నాలుగేళ్ల చిన్నారి నిత్విక కనిపించకుండా పోయి, ఇంటి పక్కనే ఉన్న డ్రమ్ములో మృతదేహమై కనిపించింది. కుటుంబ సభ్యులు ఇది హత్య అని అనుమానిస్తున్నారు.

మృతి చెందిన చిన్నారి వివరాలు ఏమిటి?

ఆ చిన్నారి పేరు నిత్విక. నాగవేటి రామాచారి, సృజన దంపతుల కుమార్తె. ఆమె వయస్సు నాలుగేళ్లు.

ఈ దారుణం ఎక్కడ జరిగింది?

ఈ ఘటన పులివెందులకు సమీపంలోని లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో చోటుచేసుకుంది. చిన్నారి ఇంటి ఆవరణంలోనే డ్రమ్ములో మృతదేహమై కనిపించింది.

ఈ కేసులో పొరుగింటి వారిపై అనుమానం ఎందుకు?

చిన్నారి డ్రమ్‌లోకి పడటం అసాధ్యమని, హత్య చేసి పడేశారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పొరుగింటి మహిళతో కుట్టుమిషన్ విషయంలో పాత గొడవలు, ఫిర్యాదులు ఉన్నాయని స్థానికులు తెలిపారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget