Viral Video: భారీ వర్షంలో నడి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్న వ్యక్తి , ఢీకొట్టిన భారీ ట్రక్ - వీడియో
Viral News: యూపీలోని ఓ బిజీ రోడ్‌లో ఓ వ్యక్తి కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. భారీ వర్షం పడుతున్నా పట్టించుకోలేదు. ఇంతలో వెనక నుంచి ఓ ట్రక్ వచ్చి ఢీకొట్టింది.
Viral News in Telugu: భారీ వర్షంలో నడి రోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నాడో వ్యక్తి. పక్కనే ఉన్న వాళ్లంతా తప్పుకోమని గట్టిగా కేకలు వేస్తున్నా పట్టించుకోలేదు. కదలకుండా అలానే కూర్చున్నాడు. ఇంతలో ఓ భారీ ట్రక్ వచ్చి ఢీకొట్టింది. తృటిలో ప్రాణాపాయం తప్పింది. కుర్చీతో సహా కింద పడిపోయాడు. కొంచెం అటు ఇటు అయ్యుంటే లారీ చక్రాల కింద పడి నలిగిపోయేవాడు. ఈ 17 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత బిజీ రోడ్‌లో అలా కూర్చుని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. యూపీలో జరిగిందీ ఘటన. పోలీస్ చెక్‌పోస్ట్‌కి దగ్గర్లోనే ఈ ఘటన జరిగినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. వెనక నుంచి లారీ వస్తున్నది ఆ వ్యక్తి చూసుకోలేదు. చుట్టూ ఉన్న వాళ్లంతా అరుస్తున్నా లెక్క చేయలేదు. క్షణాల్లోనే ఆ ట్రక్ వచ్చి కుర్చీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదు. అలాగో రోడ్డుపై పడిపోయి బిత్తరగా చూస్తూ ఉండిపోయాడు. (Also Read: Viral Video: స్టెప్పులతో అదరగొట్టిన ట్రంప్, 78 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా డ్యాన్స్ - వీడియో)
Drunk Man Narrowly Escapes Truck Collision on Busy Road While Sitting on the Chair, in the middle of the road, in Pratapgarh, UP.
— Yumlok (@Yumlok01) August 31, 2024
The UP police arrived at the scene and took the man into custody for further treatment pic.twitter.com/EmeGNUwL9L
ఈ వీడియో వైరల్ కావడం వల్ల పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తిని వెతికి పట్టుకున్నారు. కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆ వ్యక్తి మానసిక వ్యాధితో ఇబ్బంది పడుతున్నాడని, అందుకే అలా ప్రవర్తించాడని చెప్పారు. ఆ వ్యక్తిని ఢీకొట్టిన ట్రక్‌ని గుర్తించామని...తప్పకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Also Read: Viral Video: షాకింగ్ వీడియో! హఠాత్తుగా కుంగిపోయిన రోడ్డు, భారీ గోతిలో కూరుకుపోయిన కార్ - వీడియో