UP Election 2022: ఆ సీఎంపై యూపీ పోలీసుల ఎఫ్ఐఆర్.. ఇదెక్కడి న్యాయమని ముఖ్యమంత్రి ఫైర్
తనపై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ అభ్యంతరం తెలిపారు. భాజపాపై ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు.
ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ బఘేల్‌పై ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం విధించిన కరోనా మార్గదర్శకాలను ఉల్లంఘించి నోయిడాలో బఘేల్ ఇంటింటి ప్రచారం నిర్వహించారని ఎఫ్ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. కొవిడ్ కేసులు పెరిగిన కారణంగా జనవరి 22 వరకు బహిరంగ ర్యాలీలు, సభలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
అయితే తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై భూపేశ్ బఘేల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందని ఆరోపించారు.
The election commission should give a demo on how to do election campaigning. We will do it exactly like that. BJP has been campaigning door-to-door for 5 days in Amroha, why are there no actions on that? I campaigned only y'day. EC should be fair: Chhattisgarh CM Bhupesh Baghel pic.twitter.com/Q7c7ySkRyA
— ANI (@ANI) January 17, 2022
Also Read: Covid Vaccine for Children: గుడ్‌న్యూస్.. 12-14 ఏళ్ల పిల్లలకు అప్పటి నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ!
Also Read: Omicron Cases: భారత్‌లో కాస్త శాంతించిన కరోనా మహమ్మారి.. మరోవైపు 8 వేలు దాటిన ఒమిక్రాన్ కేసులు