అన్వేషించండి

Kerala Lottery Raghavan Story: జీవితాంతం లాటరీ టిక్కెట్లు కొన్నాడు - ఇప్పటికి 2 కోట్లు - కానీ అదృష్టమే కలసి రాలేదు!

Raghavan Spent 2 Crore On Lottery: కేరళకు చెందిన రాఘవన్ అనే రైతు ఆరు దశాబ్దాలుగా లాటరీ జాక్‌పాట్ కోసం ఏకంగా రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. చివరకు అప్పులపాలై ఆస్తులు అమ్ముకున్నారు కానీ లాటరీ తగల్లేదు.

Unluckiest Lottery Buyer Kerala:  అదృష్టం ఎప్పుడో ఒకప్పుడు తన తలుపు తడుతుందని, లక్ష్మీదేవి తనను కరుణించకపోదనే నమ్మకంతో ఒక వ్యక్తి ఏకంగా 60 ఏళ్ల పాటు ఎదురుచూశాడు. రెండు కోట్లు ఖర్చు పెట్టి లాటరీలు కొంటూనే ఉన్నాడు.కానీ ఎప్పుడూ లక్కే తగల్లేదు. 

కేరళలోని కరివెల్లూర్, పాలక్కున్ను ప్రాంతానికి చెందిన పి.పి. రాఘవన్ అనే రైతు కథ ఇది. సాధారణంగా లాటరీ తగిలినా, తగలకపోయినా చాలా మంది ఆ టికెట్లను పారేస్తుంటారు. కానీ రాఘవన్ మాత్రం తను కొన్న ప్రతి ఒక్క టికెట్‌ను జాగ్రత్తగా దాచిపెట్టాడు. ప్రస్తుతం ఆయన ఇంట్లో ఐదు పెద్ద సంచుల నిండా లాటరీ టికెట్లు ఉన్నాయి. ఇవి గెలుచుకున్న బహుమతుల టికెట్లు కావు.. ఆరు దశాబ్దాల పాటు ఆయన గుండెల్లో మోసిన ఆశలు, నిరాశల తాలూకు సజీవ సాక్ష్యాలు.

రాఘవన్ లాటరీల ప్రయాణం 1967లో భూటాన్ లాటరీ టికెట్ కొనడంతో ప్రారంభమైంది. ఆ తర్వాత సరిగ్గా అదే ఏడాది నవంబర్ 1, 1967న కేరళ ప్రభుత్వం దేశంలోనే మొదటిసారిగా సొంతంగా లాటరీ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. నిరుద్యోగాన్ని నిర్మూలించడం, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడం లక్ష్యంగా రూ. 50 వేల బంపర్ ప్రైజ్‌తో వచ్చిన ఆ మొదటి కేరళ లాటరీ టికెట్‌ను రాఘవన్ కేవలం ఒక్క రూపాయి పెట్టి కొన్నారు. అలా సరదాగా మొదలైన అలవాటు.. కాలక్రమేణా ఆయనకు ఒక వ్యసనంగా, జీవితకాల అన్వేషణగా మారిపోయింది. ఇటీవల విడుదలైన విషు బంపర్  లాటరీ వరకు ఆయన టికెట్లు కొంటూనే ఉన్నారు. 

ఈ ఆరు దశాబ్దాల కాలంలో ఆ జాక్‌పాట్ అదృష్టం రాఘవన్‌ను ఎప్పుడూ వరించలేదు. మధ్యమధ్యలో భూటాన్ లాటరీలో రూ. 4,000 వంటి చిన్న చిన్న బహుమతులు వచ్చినప్పటికీ, జీవితాన్ని మార్చేసే పెద్ద బంపర్ ప్రైజ్ మాత్రం ఎప్పుడూ దక్కలేదు. ఆయన తనకున్న రెండున్నర ఎకరాల పొలంలో వరి, కొబ్బరి, అరటి తోటలు సాగు చేస్తూ, పశువుల పెంపకం ద్వారా వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగాన్ని లాటరీ టికెట్లకే తగలేశారు. కొన్ని రోజుల్లో పయ్యనూర్, కాన్హంగాడ్ వంటి ప్రాంతాలకు ప్రయాణించి మరీ రోజుకు రూ. 1,000 నుండి రూ. 3,000 వరకు టికెట్ల కోసం ఖర్చు చేసేవారు.

అదృష్టం వెనుక పరిగెత్తిన ఈ గుడ్డి నమ్మకం రాఘవన్‌ను ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది. రోజురోజుకూ అప్పులు పెరిగిపోవడంతో, చివరికి తనకున్న రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమితో పాటు, తన భార్య ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను కూడా అమ్ముకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు కోట్ల రూపాయల జాక్‌పాట్ కొట్టాలని కలలు గన్న రాఘవన్.. తాను కొన్న టికెట్ల విలువ మొత్తాన్ని లెక్కగడితే అది దాదాపు రూ. 2 కోట్లకు చేరిందని తెలిసి షాకయ్యారు. కేవలం లాటరీ టికెట్ల కోసమే రూ. 2 కోట్లు తగలేసిన రికార్డు బహుశా ఆయన ఒక్కడికే దక్కుతుంది. అందుకే ఆయన్ను అందరూ  కోట్లు నష్టపోయిన దురదృష్టవంతుడు అని పిలుస్తుంటారు.

ప్రస్తుతం వృద్ధాప్య సమస్యల వల్ల రాఘవన్ ఇంటికే పరిమితమయ్యారు. ఆయన, భార్య కె. శాంతతో కలిసి కేవలం 25 సెంట్ల స్థలంలో ఉన్న ఒక చిన్న ఇంట్లో శేషజీవితాన్ని గడుపుతున్నారు. ఇప్పుడు క్రమం తప్పకుండా రోజువారీ టికెట్లు కొనడం మానేసినా, కేవలం బంపర్ లాటరీలు వచ్చినప్పుడు మాత్రం ఇప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. లక్ష్మీదేవి నన్ను ఏదో ఒక రోజు కరుణిస్తుందని బలంగా నమ్మాను, కానీ అది ఎప్పటికీ జరగలేదు. ఈ రోజు నేను కోట్లు నష్టపోయిన ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడిని  అంటూ రాఘవన్ బాధపడుతూంటారు. 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Trisha Vijay: త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
త్రిషకు విజయ్ ప్రభుత్వం రాచమర్యాదలు... తమిళనాడు ఇండిపెండెన్స్ డే వేడుకల్లో హాట్ టాపిక్
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
Anasuya Bharadwaj : నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
నేను హనుమంతుడి కుమార్తెను - వివాదంపై అనసూయ క్లారిటీ
Embed widget