Kerala Lottery : కేరళ లాటరీ టిక్కెట్లను ఇతర రాష్ట్రాల్లో కొనొచ్చా? ఆన్ లైన్‌లో కొంటె చెల్లుతాయా ?
Lottery : లాటరీలను తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడో బ్యాన్ చేశారు. కానీ కేరళ వంటి రాష్ట్రాల్లో ఇంకా అమల్లో ఉన్నాయి. మరి వాటిని ఇక్కడ కొనొచ్చా ?
Methods to Buy Kerala Lottery: లాటరీ కొట్టాలంటే చాలా లక్ ఉండాలి. లక్ష మంది టిక్కెట్లు కొంటె ..అందులో ఒకరిద్దరికి మాత్రమే లక్ ఉంటుంది.కానీ అలాంటి లక్ కోసం చాలా మంది ఉంటారు. మన దేశంలో రాష్ట్రాల వారీగా లాటరీ విధానాలను ఆయా ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా కేంద్రం లాటరీలకు అనుమతి ఇవ్వలేదు. కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు లాటరీలకు అనుమతి ఇస్తున్నాయి. ఇదే విధంగా కేరళలో కేరళ లాటరీ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యింది. ఇందులో లక్షల మంది లాటరీలు కొంటారు. తరచూ డ్రా తీస్తూనే ఉంటారు.
అయితే కేరళలో లాటరీలను ఇతర రాష్ట్రాల్లో కొనొచ్చా అన్న సందేహాలు ఉన్నాయి. కేరళ లాటరీలు ఇతర రాష్ట్రాల్లోకొనలేరు. ఎందుకంటే కేరళలో మాత్రమే అమ్ముతారు. కానీ ఇతర రాష్ట్రాల వారు కూడా తమ అధృష్టాన్ని కేరళ లాటరీల ద్వారా పరీక్షించుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. రెండు మార్గాలు ఉన్నాయి. నేరుగా ఆన్ లైన్ లో కొనుగోలు చేయడం లేదా ధర్డ్ పార్టీ ద్వారా ఆన్ లైన్ లో కొనుగోలు చేయవచ్చు.
నేరుగా ఆన్ లైన్ లో కొనుగోలు చేయాలంటే.. https://results.keralalotteryonline.in సైట్ లో కొనుగోలు చేయవచ్చు. ఇందులో 13 రకాల లాటరీలు ఉన్నాయి. అక్షయ, విన్ విన్, శ్రీ శక్తి, ఫిఫ్టీ ఫిఫ్టీ, నిర్మల్, కరుణ, న్యూ ఇయర్ బంపర్ ఇలా రకరకాల పేర్లతో వీటిని నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా ఖాతాల ద్వారా లాటరీ సైట్‌లో రిజిస్టర్ అవ్వొచ్చు. ఆ తర్వాత ఏ లాటరీ కావాలో ఎంచుకోవాలి. ప్రతీ లాటరీ వివరాలు, ధర, మొదటి ప్రైజ్, రెండో ప్రైజ్, మూడో ప్రైజ్, నాలుగో ప్రైజ్.. ఇలా దాదాపు 10 రకాల ప్రైజులు ఉంటాయి. మొదటి ప్రైజ్ లక్షల రూపాయలతో ఉంటుంది. చివరి ప్రైజ్ విలువ దాదాపు రూ.100 ఉంటుంది. మీరు తీసుకునే లాటరీ ధరను బట్టీ ప్రైజ్ వాల్యూ ఉంటుంది.
లాటరీని బుక్ చేసుకోవడం, ఫలితాలు చూడటం అంతా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. లాటరీ ఫలితాలను వెబ్‌సైట్‌లో చూపిస్తారు. మీరు కొన్న లాటరీకి ప్రైజ్ మనీ వస్తే క్లెయిమ్ చేసుకోవచ్చు. అత్యధిక లాటరీలను వారానికోసారి డ్రా తీస్తారు. ఇది అనధికారికంగా ధర్డ్ పార్టీ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. కానీ దీని వల్ల మోసాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రైజ్ మనీ వచ్చినా ఇవ్వకపోవచ్చు.
లాటరీలు కొనుగోలు చేయడం అంటే వ్యవసం బారిన పడటమే. కేరళలో ఎప్పటి నుంచో లాటరీ వ్యవస్థ ఉంది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో లాటరీల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైపోయాయని వాటిని రద్దు చేశారు. మరోసారి వాటిని తెచ్చేందుకు ప్రభుత్వాలు సాహసించలేదు.
Also Read: సోలార్ తో విద్యుత్తే కాదు.. వంట కూడా చేయొచ్చని నిరూపించిన విశాఖ చందేరీ