News
News
X

Love in War: రణంలో ప్రణయం- ఇది యుద్ధంతో రాసిన ప్రేమ కథ!

Love in War: ఇది యుద్ధంలో విరిసిన ప్రణయం.. ఇది యుద్ధంతో రాసిన ప్రేమ కావ్యం. రష్యా, ఉక్రెయిన్.. ఓ ప్రేమ కథ.

FOLLOW US: 

Love in War: 

ఓవైపు.. తుపాకీ తూటాలు, బాంబుల మోతలు, శతఘ్నుల భీకర దాడులు..

మరోవైపు.. ప్రేమకు దేశాల మధ్య శత్రుత్వం కూడా అడ్డుకాదని నిరూపించిన జంట.. 

ఓవైపు.. నెత్తురోడుతోన్న ఇరు దేశాల సైన్యం..

News Reels

మరోవైపు.. రణంలో వెల్లివిరిసిన ప్రణయం..

అక్కడ రోజూ ఇదే కథ.. 

కానీ ఇది మాత్రం యుద్ధంతో రాసిన ప్రేమ కథ..

రష్యా X ఉక్రెయిన్

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై అక్టోబర్ 24కు సరిగ్గా 8 నెలలు పూర్తయ్యాయి. ఈ 8 నెలల్లో జరిగిన యుద్ధ ప్రభావం.. ఆ రెండు దేశాలపైనే కాదు యావత్ ప్రపంచంపైనే ప్రభావం చూపింది. లక్ష్యం చేరే వరకు యుద్ధం ఆపే ప్రసక్తే లేదని రష్యా అధ్యక్షుడు శపథం చేస్తే.. తమ మట్టిని కాపాడుకునేందుకు తుదిశ్వాస వరకు పోరాడతామని ఉక్రెయిన్ అంటోంది. ఇదీ కొన్నాళ్లుగా రెండు దేశాల పరిస్థితి.

ప్రేమ కథ

అయితే మరోవైపు తమ దేశం కోసం పోరాడుతోన్న ఇద్దరు సైనికుల మధ్య మాత్రం ప్రేమ చిగురించింది. ఎమరాల్డ్ ఎవ్జెనియా అనే ఉక్రేనియన్ స్నైపర్.. యుద్ధం వేళ రష్యాకు చెందిన ఓ సైనికుడిని వివాహం చేసుకుంది. 31 ఏళ్ల రష్యా సైనికుడు ఖార్కివ్‌లోని ఒక అడవిలో అక్టోబర్ 14న ఎవ్జెనియాను పెళ్లి చేసుకున్నాడు.

వారి వివాహం 'డిఫెండర్స్' డే రోజే జరగడం మరో విశేషం. 'డిఫెండర్స్ డే' అనేది ఉక్రేనియన్ సాయుధ దళాల తరఫున పోరాడి వీర స్వర్గం పొందిన సభ్యుల గౌరవార్థం జరుపుకునే రోజు. వారి పెళ్లి రోజే.. తాను చేసుకున్న భర్త పుట్టినరోజు కూడా కావడంతో ఆమె ఆనందానికి అవధులు లేవు.

మిలటరీ కమాండర్‌ ఆధ్వర్యంలో ఈ వివాహ వేడుకలు జరిగాయి. ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన తర్వాత ఇద్దరూ ప్రేమలో పడ్డారు. ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్నారు.

వైరల్ 

తన పెళ్లి ఫొటోలను వధువు ఎవ్జెనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది, దీనిలో ఆమె తెల్లటి వెడ్డింగ్ గౌను ధరించగా ఆమె భర్త  సైనిక యూనిఫాం ధరించాడు.

View this post on Instagram
 
A post shared by Євгенія Емеральд (@emerald.evgeniya)

" నేను ఇంతకంటే గొప్ప వివాహాన్ని ఊహించలేకపోయాను! నా ప్రియమైన భర్తకు నా శుభాకాంక్షలు. ఎందుకంటే ఈ రోజు అతని పుట్టినరోజు. ఇప్పుడు అతను తన వివాహ తేదీని ఎప్పటికీ మరచిపోలేడు. "
-ఎమరాల్డ్ ఎవ్జెనియా, ఉక్రెయిన్ స్నైపర్

Also Read: Biryani Shop: బిర్యానీ తింటే మగాళ్లకు ఆ సామర్థ్యం తగ్గిపోతుందట!

Published at : 24 Oct 2022 02:26 PM (IST) Tags: Russia Ukraine - Russia war Love in war Ukrainian sniper marries soldier

సంబంధిత కథనాలు

Gujarat Elections: యూసీసీ అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది - రాజ్‌నాథ్ సింగ్

Gujarat Elections: యూసీసీ అమలు చేయాల్సిన సమయం వచ్చేసింది - రాజ్‌నాథ్ సింగ్

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

YS Sharmila Effigy Burnt: షర్మిల దిష్టిబొమ్మ దహనం, మారకపోతే మరింత బుద్ధి చెబుతామన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే

Arvind Kejriwal: 'సార్, మీరు మఫ్లర్ ఎందుకు వేసుకోలేదు'- కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన యువతి

Arvind Kejriwal: 'సార్, మీరు మఫ్లర్ ఎందుకు వేసుకోలేదు'- కేజ్రీవాల్‌ను ప్రశ్నించిన యువతి

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

AP Police Constable Notification: ఏపీలో 6100 కానిస్టేబుల్ పోస్టులు, ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ - చివరితేది ఎప్పుడంటే?

DPHFW Recruitment: ఏపీలో 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అర్హలివే! దరఖాస్తు చివరితేది ఎప్పుడంటే?

DPHFW Recruitment: ఏపీలో 461 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు, అర్హలివే! దరఖాస్తు చివరితేది ఎప్పుడంటే?

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

PVP ED Office : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

PVP ED Office  : జగన్ కంపెనీల్లో పెట్టుబడులపై ఆరా - మరోసారి ఈడీ ఎదుట హాజరైన పీవీపీ !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ? - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

Jagan On Vidya Deevena : గత పాలకులు బటన్ నొక్కి డబ్బులెందుకు ఇవ్వలేకపోయారు ?  - మదనపల్లిలో సీఎం జగన్ ప్రశ్న !

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్