Upcoming 5G Smartphones: వచ్చే వారం మార్కెట్లోకి మూడు బడ్జెట్ ఫోన్లు - రూ.9 వేలలోపే 5జీ మొబైల్ కూడా!
New 5G Smartphones: డిసెంబర్ మూడో వారంలో మనదేశంలో కొన్ని స్మార్ట్ ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. ఇవన్నీ బడ్జెట్ 5జీ ఫోన్లే. రూ.9 వేలలోపే పోకో సీ75 5జీ కూడా మార్కెట్లోకి రానుంది.

Upcoming 5G Smartphones in India: మీరు కొత్త మొబైల్ కొనాలని చూస్తున్నట్లయితే మార్కెట్లోకి చాలా కొత్త స్మార్ట్ ఫోన్లు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. వచ్చే వారం రియల్‌మీ, పోకో కంపెనీల నుంచి కొత్త మొబైల్స్ భారతదేశంలో లాంచ్ కానున్నాయి. మీరు తక్కువ ధరలలో కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లయితే బడ్జెట్ విభాగంలో వస్తున్న ఈ ఫోన్లు మీకు మంచి ఆప్షన్‌గా ఉంటాయి. వచ్చే వారం ఎప్పుడు ఏ ఫోన్లు రానున్నాయి? వీటిలో ఏ ఫీచర్లు ఉండవచ్చో ఇప్పుడు చూద్దాం.
పోకో సీ75 5జీ (Poco C75 5G)
పోకో మనదేశంలో పోకో సీ75 5జీని డిసెంబర్ 17వ తేదీన లాంచ్ చేయనుంది. టీజర్‌లో కంపెనీ దానికి సంబంధించిన గ్లింప్స్‌ను కూడా చూపింది. నివేదికల ప్రకారం ఇది ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 4ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌తో ఇది మార్కెట్లోకి వస్తుందని అంచనా. ఇది 4 జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్‌ను పొందవచ్చని భావిస్తున్నారు. మైక్రో ఎస్‌డీ కార్డు సహాయంతో దాని స్టోరేజ్‌ని 1 టీబీ వరకు పెంచవచ్చు. ఈ 5జీ ఫోన్ ధర రూ. 9,000 కంటే తక్కువ ఉంటుందని అంచనా. పోకో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ కోసం ఫ్యాన్స్, స్మార్ట్ ఫోన్ లవర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
Also Read: విమానంలో ఫోన్ ఎందుకు ఫ్లైట్ మోడ్‌లో పెట్టాలి? - పెట్టకపోతే ఏం జరుగుతుంది?
రియల్‌మీ 14 ప్రో (Realme 14 Pro)
ఈ ఫోన్ డిసెంబర్ 18వ తేదీన లాంచ్ కానుంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 7ఎస్ జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని టీజర్ ద్వారా తెలిపారు. ఇది 8 జీబీ, 12 జీబీ ర్యామ్, 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో రావచ్చని అంచనా. ఈ ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయని తెలుస్తోంది. దీనిలో ప్రైమరీ సెన్సార్ 50 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. ఇది శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. దీని ధర రూ.15,000 వరకు ఉంటుందని తెలుస్తోంది.
రియల్‌మీ 14ఎక్స్ 5జీ (Realme 14x 5G)
రియల్‌మీ డిసెంబర్ 18వ తేదీన ఈ ఫోన్‌ను కూడా లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మూడు వేర్వేరు ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. టాప్ వేరియంట్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో మార్కెట్లోకి రానుంది. ఈ ఫోన్ డైమండ్ కట్ డిజైన్‌తో కూడిన గ్రేడియంట్ బ్యాక్ ప్యానెల్, రెక్టాంగులర్ కెమెరా ఐల్యాండ్‌ను కలిగి ఉంటుంది. రూ.15,000 కంటే తక్కువ ధరతో ఐపీ69 రేటింగ్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని కంపెనీ తెలిపింది.
Also Read: గూగుల్ పేలో ట్రాన్సాక్షన్లు డిలీట్ చేయడం ఎలా? - సింపుల్ స్టెప్స్‌తో పని అయిపోతుంది!
Shaadi ka hungama ho ya raat ka dhamaka, ab no break! #realme14x5G ke saath unbeatable battery aur non-stop performance.
— realme (@realmeIndia) December 13, 2024
Launch & Sale on 18th Dec, 12 PM
Know more:https://t.co/NiFSjLS8slhttps://t.co/harpyyP20o pic.twitter.com/BHqUt8AXzH





















