Top Headlines Today: ఏపీలో కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్స్; కేటీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ - నేటి టాప్ న్యూస్
నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్స్
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని షర్మిల వ్యూహాత్మకంగా ఎన్నికల పోరాటంలో బరిలో నిలుపుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాలపై తెర వెనుక కొంత మంది సీనియర్లు పని చేస్తున్నారు. కేవీపీ రామచంద్రరావు, రఘువీరారెడ్డి లాంటి వాళ్లు బయట పెద్దగా కనిపించడం లేదు. కానీ తెర వెనుక మాత్రం చురుగ్గా వ్యవహరిస్తున్నారు. వైసీపీలో అసంతృప్తికి గురైన నేతల్ని తీసుకుని పోటీకి ఒప్పిస్తున్నారు. రాయలసీమతో పాటు కోస్తాలో బలమైన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేస్తున్నారు. అయితే వీరి వ్యూహాలన్నీ గెలవడానికి కాదు.. ఓడించగలిగే శక్తి ఉందని నిరూపించడానికి అన్నట్లుగా రాజకీయం నడుస్తోంది. ఇంకా చదవండి
5 ఏళ్లు రేవంత్ రెడ్డి సీఎంగా ఉండాలి
మల్కాజ్ గిరిలో బీజేపీతోనే మనకు పోటీ, గత పదేళ్లలో తెలంగాణకు ప్రధాని మోదీ చేసిందేమిటీ? పదేళ్లలో కేసీఆర్ పాలనలో చేసిందేంటో ఒక్కసారి చెక్ చేసుకోవాలని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మనమే తప్పు చేసినం. మనం చేసిన మంచి పనులను చెప్పుకోవాల్సినంత చెప్పుకోలే అన్నారు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పు జరగకుండా చూసుకోవాలె అని పార్టీ శ్రేణులకు సూచించారు. నువ్వే 5 ఏళ్లు సీఎంగా ఉండాలె. చెప్పిన 420 హామీలు అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మేడ్చల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా చదవండి
తెలంగాణలో పొలిటికల్ మైండ్ గేమ్
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గెలుపు కోసం తమ అస్త్రశస్త్రాల సిద్ధం చేశాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బేరీజు వేసుకుని పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపు అంతా సీఎం రేవంత్ రెడ్డి తన భుజాల మీద వేసుకుని 10-12 స్థానాలు గెలుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరో జాతీయ పార్టీ బీజేపీకి మళ్లీ మోదీ క్రేజే గెలుపు గుర్రమని భావిస్తోంది. గులాబీ పార్టీ గెలుపునకు మాజీ సీఎం ఆ పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగారు. ఇంకా చదవండి
జగన్‌ది శాడిస్టిక్ మనస్తత్వం!
'రాష్ట్ర పరదాల మహారాణిని కాలేజీ విద్యార్థులు బస్సు యాత్రలో ఏదో అన్నారని కోపం వచ్చింది. విద్యార్థులతో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది. ప్రజలు అన్నీ చూస్తున్నారు. ఈ మహారాణిని ఇంటికి పంపడానికి ప్రజలు ఎప్పుడో సిద్ధమై ఉన్నార'ని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. జగన్‌ది శాడిస్టిక్ మనస్తత్వం! కలుగులో ఎలుక లాంటివాడు.. ఎవరికి పేరు వచ్చినా తట్టుకోలేని స్వభావం. చిత్ర పరిశ్రమను సైతం రాజకీయాల్లోకి లాగాలని చూశారని వ్యాఖ్యానించారు. ఇంకా చదవండి
ఇండియన్స్‌పై బంగ్లాదేశ్ టూరిస్ట్‌ల రాళ్లదాడి, భారత్-బంగ్లా సరిహద్దులో అలజడి
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దు (India Bangladesh Border) ప్రాంతంలో ఉన్నట్టుండి అలజడి రేగింది. Jaflong సరిహద్దు వద్ద బంగ్లాదేశ్ విజిటర్స్ ఇండియన్ టూరిస్ట్‌లపై (Jaflong Border) రాళ్లు విసిరారు. నదిలోకి దిగి సేద తీరుతుండగా ఉన్నట్టుండి ఆ వైపు నుంచి కొందరి బంగ్లాదేశ్ టూరిస్ట్‌లు ఇండియన్స్‌పై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా భారతీయులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడి నుంచి బయటకు వచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జఫ్లాంగ్ సరిహద్దు ప్రాంతం అటు బంగ్లాదేశ్ వాళ్లకి ఇటు భారతీయులకు మంచి టూరిస్ట్ స్పాట్. నిత్యం అక్కడ పర్యాటకుల రద్దీ కనిపిస్తూనే ఉంటుంది. పైగా ఇక్కడికి రావాలంటే వీసా కూడా అక్కర్లేదు. అందుకే రెండు దేశాల వాళ్లు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటారు. ఇంకా చదవండి
Kalki 2898 AD: ‘కల్కి 2898 AD' అప్డేట్ - రేపు రెడీగా ఉండండి అంటూ!
2024లో తెలుగు నుండి విడుదల అవుతున్న పాన్ ఇండియా సినిమాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటి కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి సినిమాల్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 AD' కూడా ఒకటి. ఈ మూవీ మేలోని విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటికీ దీని నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై మరోసారి ‘కల్కి 2898 AD' రిలీజ్ గురించి అనుమానాలు మొదలవుతున్నాయి. ఆ సందేహాలు అన్నీ తొలగిపోయేలా మూవీ టీమ్.. ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ను బయటపెట్టింది. ఇంకా చదవండి
విక్రమార్కుడు 2 అప్‌డేట్ వచ్చేసింది
బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ ప్రధాన పాత్రలో, టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్న తాజా హిందీ చిత్రం ‘రుస్లాన్‘. సుశీ మిశ్రా హీరోయిన్ గా కనిపించనుంది. కరణ్ బి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోంది. కె.కె.రాధామోహన్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 26న ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని సందడి చేశారు. ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసార్ హాజరయ్యారు. ఇంకా చదవండి
ఐటీ రిటర్న్ ఫైల్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేయాల్సిన విషయాలివి
ప్రస్తుతం, ఎవరికి వాళ్లే సొంతంగా రిటర్న్ ఫైల్ చేసుకునేలా ఆదాయ పన్ను విభాగం కొన్ని మార్పులు తెచ్చింది. ఇప్పుడు, ప్రి-ఫిల్డ్ ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (Pre-Filled Income Tax Return) అందుబాటులో ఉంటోంది. దీనివల్ల ఆదాయ పన్ను పత్రాల సమర్పణ చాలా సులభంగా మారింది. ఆదాయ పన్ను ప్రకటన కాస్త ఈజీగా మారినా, మనకు తెలీకుండా చేసే చిన్నపాటి పొరపాటుకు కూడా ఐటీ నోటీస్ అందుకోవాల్సి వస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి మీరు ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ ఫైల్ చేయబోతున్నట్లయితే, కొన్ని విషయాల గురించి ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి. ఇంకా చదవండి
EVMలను ఎక్కడ తయారు చేస్తారు? అందుకోసం ఎంత ఖర్చవుతుంది?
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియ (Lok Sabha Elections 2024) అత్యంత కీలకమైంది. ఎన్నికల నిర్వహణ పారదర్శకంగా,పకడ్బందీగా జరపడం ఎన్నికల సంఘం బాధ్యత. ఎక్కడా చిన్నలోపం కూడా తలెత్తకుండా చాలా పక్కాగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు పాత పద్ధతులకు స్వస్తి చెప్పి మరింత పారదర్శకత కోసం మార్పులు చేర్పులు చేస్తోంది ఈసీ. అలా అందుబాటులోకి వచ్చినవే Electronic Voting Machines. 1982లో తొలిసారి కేరళలోని పరవుర్ నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా వీటిని ప్రవేశపెట్టారు. అప్పుడే దేశవ్యాప్తంగా ఈ మెషీన్‌లపై (History of EVMs) చర్చ జరిగింది. ఆ తరవాత 2004 నుంచి ఇవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ఇంకా చదవండి
హైదరాబాద్ బ్యాటర్ల పరుగుల తుఫానులో కొట్టుకుపోయిన ఢిల్లీ
ఐపీఎల్(IPL)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)జోరు కొనసాగుతోంది. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసంతో సన్‌రైజర్స్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటర్లు సునామీలా ప్రత్యర్థి బౌలర్లను ముంచెత్తడం... తర్వాత బౌలర్లు కట్టడి చేసే వ్యూహాన్ని అనుసరిస్తున్న హైదరాబాద్ మరోసారి అదే చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. ఇంకా చదవండి