search
×

ITR 2024: ఐటీ రిటర్న్‌ ఫైల్‌ చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేయాల్సిన విషయాలివి

Income Tax Return: ఆదాయ పన్ను ప్రకటన కాస్త ఈజీగా మారినా, మనకు తెలీకుండా చేసే చిన్నపాటి పొరపాటుకు కూడా ఐటీ నోటీస్‌ అందుకోవాల్సి వస్తుంది. ఐటీ రిటర్న్‌ ఫైల్ చేసే ముందు క్రాస్‌ చెక్‌ చేయాల్సిన అంశాలు

FOLLOW US: 
Share:

Income Tax Return Filing 2024: ప్రస్తుతం, ఎవరికి వాళ్లే సొంతంగా రిటర్న్‌ ఫైల్‌ చేసుకునేలా ఆదాయ పన్ను విభాగం కొన్ని మార్పులు తెచ్చింది. ఇప్పుడు, ప్రి-ఫిల్డ్‌ ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ (Pre-Filled Income Tax Return) అందుబాటులో ఉంటోంది. దీనివల్ల ఆదాయ పన్ను పత్రాల సమర్పణ చాలా సులభంగా మారింది.

ఆదాయ పన్ను ప్రకటన కాస్త ఈజీగా మారినా, మనకు తెలీకుండా చేసే చిన్నపాటి పొరపాటుకు కూడా ఐటీ నోటీస్‌ అందుకోవాల్సి వస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరం లేదా 2024-25 అసెస్‌మెంట్ సంవత్సరానికి మీరు ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్ చేయబోతున్నట్లయితే, కొన్ని విషయాల గురించి ముందుగానే జాగ్రత్త తీసుకోవాలి.

ఐటీ రిటర్న్‌ ఫైల్ చేసే ముందు క్రాస్‌ చెక్‌ చేయాల్సిన అంశాలు:

ITR ఫైల్ చేసే ముందు AIS (Annual Information Statement), TIS ‍‌(Taxpayer Information Summary), ఫామ్‌ 26ASను చెక్‌ చేయడం చాలా ముఖ్యం. ప్రి-ఫిల్డ్‌ ఐటీఆర్‌తో వీటిని క్రాస్‌ చెక్‌ చేయాలి. దీనివల్ల, కొన్ని ఆదాయాలను మరిచిపోయే ప్రమాదం ఉండదు. వార్షిక సమాచార నివేదికలో (AIS) మీ పూర్తి ఆదాయాల వివరాలు ఉంటాయి. దీనిని చూడాలంటే.. ఆదాయ పన్ను విభాగం పోర్టల్‌లోకి మీ యూజర్‌ ఐడీ (పాన్‌), పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి. మెయిన్‌ మెనూ బార్‌లో కనిపించే సర్వీసెస్‌ను క్లిక్‌ చేస్తే మరొక డ్రాప్‌ డౌన్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. అందులో AISను ఎంచుకోండి. ఇందులోని పార్ట్ వన్‌లో.. మీరు పేరు, పాన్, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారం ఉంటుంది. రెండో భాగంలో.. మీ సంపాదన, TDS, అడ్వాన్స్‌ టాక్స్‌, సెల్ఫ్‌ అసెస్‌మెంట్‌, డిమాండ్ వంటి పూర్తి సమాచారం ఉంటుంది. వీటన్నింటినీ తనిఖీ చేసి, తప్పులు ఏవైనా ఉన్నామో చూసుకోండి. ఏదైనా అంకె సరిగ్గా లేదు అనిపిస్తే, మీ యాజమాన్యాన్ని లేదా బ్యాంక్‌ను సంప్రదించాలి. ఆ ఇబ్బందిని తొలగించుకున్న తర్వాత ITR ఫైల్ చేయండి. ఇలా చేస్తే మీ వైపు నుంచి ఎలాంటి పొరపాటు జరగదు.

మొదటిసారి ఐటీఆర్‌ ఫైల్ చేస్తున్నట్లయితే, ముందుగా మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, మీ పర్మినెంట్‌ మొబైల్ నంబర్‌ను మీ వద్ద ఉంచుకోండి. మీ ఆధార్‌ నంబర్‌-పాన్‌ కచ్చితంగా లింక్‌ అయి ఉండాలి. ఇప్పుడు, ఆదాయ పన్ను విభాగం అధికారిక వెబ్‌సైట్ https://eportal.incometax.gov.in లోకి వెళ్లండి. మొదటిసారి రిటర్న్‌ ఫైల్ చేసే వ్యక్తులు తమ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి. ఈ వెబ్‌సైట్‌ హోమ్‌ పేజీలో, టాప్‌ రైడ్‌ సైడ్‌ కార్నర్‌లో క్రియేట్‌ బటన్‌ ఉంటుంది. దాని ద్వారా మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ క్రియేట్ చేసుకోవాలి. మీ పాన్ నంబరే మీ యూజర్ ఐడీ అవుతుంది. పాస్‌వర్డ్ మీరే సృష్టించొచ్చు.

పాస్‌వర్డ్‌ మరచిపోతే ఏం చేయాలి?
ఇన్‌కమ్‌ టాక్స్‌ పోర్టల్‌లో లాగిన్‌ పాస్‌వర్డ్‌ను ఎక్కువ మంది ప్రజలు మర్చిపోతుంటారు. పాస్‌వర్డ్‌ మరిచిపోయినా ఇబ్బంది లేదు. పోర్టల్‌లో, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయాల్సిన బాక్స్‌ కింద కనిపించే "ఫర్‌గాట్‌ పాస్‌వర్డ్‌" ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు. మీ అకౌంట్‌కు మీరు లింక్ చేసిన ఫోన్‌ నంబర్‌కు OTP వస్తుంది. ఇక్కడ అడిగిన వివరాలను సరిగ్గా పూర్తి చేశాక కొత్త పాస్‌వర్డ్‌ సృష్టించొచ్చు.

మరో ఆసక్తికర కథనం: మీ బిజినెస్‌ కోసం రూ.10 లక్షల వరకు పీఎం ముద్ర లోన్‌ - ఇలా అప్లై చేయండి

Published at : 20 Apr 2024 03:34 PM (IST) Tags: Income Tax it return Tds AIS ITR 2024 Form-26AS

ఇవి కూడా చూడండి

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

House Rates: భాగ్యనగరంలో ఇళ్ల రేట్లకు భారీ రెక్కలు - దేశం నలుమూల నుంచీ డిమాండ్‌

Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 21 Nov: రూ.78,000 పైనే పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Provident Fund: ఈపీఎఫ్‌ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!

Provident Fund: ఈపీఎఫ్‌ బకాయిలను మీ కంపెనీ ఎగ్గొట్టిందా?, ఇలా చేస్తే మీ డబ్బు తిరిగొస్తుంది!

Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి

Investment Tips: పిల్లల చదువు ఖర్చుల కోసం మీరు కష్టపడొద్దు, మార్కెట్‌కు ఆ పని అప్పజెప్పండి

Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold-Silver Prices Today 20 Nov: యుద్ధభయంతో పెరుగున్న పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

టాప్ స్టోరీస్

Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ