By: Arun Kumar Veera | Updated at : 20 Apr 2024 02:23 PM (IST)
రూ.10 లక్షల వరకు పీఎం ముద్ర లోన్
PM MUDRA Loan: ప్రధాన మంత్రి ముద్ర యోజనను (PMMY) పీఎం ముద్ర లోన్లు అని పిలుస్తుంటారు. సామాన్య ప్రజలు కూడా వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సాయపడే కేంద్ర ప్రభుత్వ పథకం. ఈ స్కీమ్ కింద లోన్ తీసుకుని.. కూరగాయల షాపు, పండ్ల దుకాణం, రిపేర్ షాపు, ట్రక్ ఆపరేటింగ్, ఆహార సేవ యూనిట్, చిన్న పరిశ్రమలు, చేతివృత్తులు వంటి చిన్న స్థాయి వ్యాపారాలను పెంచుకోవచ్చు. రూ.50,000 నుంచి రూ.10,00,000 వరకు రుణం దొరుకుతుంది. గ్రామీణ ప్రజలు, పట్టణ ప్రాంత ప్రజలు, ఆడవాళ్లు, మగవాళ్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
పీఎం ముద్ర రుణాలు అంటే ఏమిటి?
ప్రధాన మంత్రి ముద్ర యోజనలో ముద్ర (MUDRA) అంటే.. 'మైక్రో యూనిట్స్ డెవలప్‌మెంట్ & రీఫైనాన్స్ ఏజెన్సీ'. సూక్ష్మ సంస్థల అభివృద్ధి & రీఫైనాన్సింగ్ కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్థిక సంస్థ ఇది.
మూడు కేటగిరీల్లో PMMY లోన్ అందుతుంది. అవి.. 'శిశు', 'కిషోర్', 'తరుణ్'. శిశు విభాగం కింద రూ.50,000 వరకు; కిషోర్ విభాగం కింద రూ.50,000 నుంచి రూ.5,00,000 వరకు; తరుణ్ విభాగం కింద రూ.5,00,000 నుంచి రూ.10,00,000 వరకు లోన్ వస్తుంది.
ముద్ర రుణంపై వడ్డీ రేటు (Rate of Interest on MUDRA Loan)
ప్రభుత్వ వెబ్‌సైట్ ప్రకారం, ముద్ర అనేది ఒక రీఫైనాన్సింగ్ ఏజెన్సీ. ఇది నేరుగా రుణాలు ఇవ్వదు. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల వంటి ఆర్థిక సంస్థల ద్వారా చిన్న వ్యాపారాలకు నిధులు అందించడం ఈ పథకం ఉద్దేశం. బజాజ్ ఫిన్‌సర్వ్ వెబ్‌సైట్ ప్రకారం, PMMY వడ్డీ రేటు 8% నుంచి 12% వరకు ఉంటుంది.
ముద్ర లోన్ తీసుకోవడానికి అర్హతలు (Eligibility for MUDRA Loan)
ముద్ర లోన్ తీసుకునే వ్యక్తి భారతీయ పౌరుడై ఉండాలి. తయారీ, ప్రాసెసింగ్, ట్రేడింగ్ లేదా సేవల రంగం వంటి వ్యవసాయేతర రంగంలో ముద్ర రుణాలు తీసుకోవచ్చు. ఇందుకోసం దగ్గరలోని బ్యాంక్, MFI లేదా NBFCని సంప్రదించవచ్చు. లోన్ ఇచ్చే సంస్థ నియమ, నిబంధనలను రుణగ్రహీత అనుసరించాలి.
ముద్ర లోన్ కోసం ఎలా దరఖాస్తు చేయాలి? (How to Apply for MUDRA Loan?)
ఆఫ్‌లైన్ విధానం:
ప్రధాన్ మంత్రి ముద్ర యోజన (PMMY) లోన్ కోసం మీ సమీపంలోని బ్యాంక్, NBFC, MFI వంటి సంస్థను సంప్రదించవచ్చు.
ఆన్‌లైన్ విధానం:
ముద్ర లోన్ కావలసిన వ్యక్తి ఉద్యమిమిత్ర పోర్టల్‌లో (www.udyamimitra.in) ఆన్‌లైన్ దరఖాస్తును ఫైల్ చేయవచ్చు. జన్‌సమర్థ్ పోర్టల్ (www.Jansamarth.in) ద్వారా కూడా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
శిశు, కిషోర్, తరుణ్ విభాగాలకు అనుగుణంగా ఆన్‌లైన్‌లో వివరాలు నింపాలి.
శిశు కేటగిరీ లోన్లకు ఒక పేజీ అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది. కిషోర్, తరుణ్ కేటగిరీ కోసం మూడు పేజీల అప్లికేషన్ ఫార్మాట్ ఉంటుంది.
అవసరమైన పత్రాలు (Required documents)
రుణ గ్రహీత ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి గుర్తింపు రుజువులు అవసరం. విద్యుత్, టెలిఫోన్, గ్యాస్, వాటర్ బిల్ వంటి చిరునామా రుజువులు కూడా కావాలి. వ్యాపారం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ వంటి వ్యాపార రుజువు కూడా ఉండాలి.
ముద్ర అనేది ఒక రీఫైనాన్సింగ్ ఏజెన్సీ, ఇది నేరుగా లోన్ ఇవ్వదు. బ్యాంక్‌ల ద్వారా అప్లై చేసుకోవాలి. కాబట్టి, ముద్ర లోన్ పొందేందుకు ఏజెంట్లు లేదా మధ్యవర్తులు ఉండరన్న విషయాన్ని గమనించాలి.
మరో ఆసక్తికర కథనం: ఎవరెస్ట్ మసాలాలో ప్రమాదకర రసాయనం!, వాడొద్దంటూ ప్రజలకు హెచ్చరిక
Digital Real Estate: 'డిజిటల్ రియల్ ఎస్టేట్' గురించి తెలుసా?, కొంతమంది రూ.కోట్లు సంపాదిస్తున్నారు!
SBI Loan: లోన్ తీసుకున్నవాళ్లకు షాక్ ఇచ్చిన ఎస్‌బీఐ - ఈ రోజు నుంచి EMIలు పెంపు
Gold-Silver Prices Today 15 Nov: పతనం నుంచి పుంజుకున్న పసిడి - మీ ప్రాంతంలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ
Childrens Day Gifts: ఈ చిల్డ్రన్స్ డే నాడు మీ పిల్లలకు ఆర్థిక భద్రతను గిఫ్ట్‌గా ఇవ్వండి - ఇవిగో బోలెడన్ని ఆప్షన్స్!
ICICI Bank: ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ రూల్స్‌లో భారీ మార్పులు - ఇక దబిడిదిబిడే!
Jyotula Nehru: ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న జ్యోతుల నెహ్రూ - వైసీపీ సభ్యుల కన్నా ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు !
Naga Chaitanya: వెంకీ మామలా నలుగురు పిల్లలు వద్దు కానీ... పెళ్లి, మ్యారీడ్ లైఫ్ గురించి ఓపెన్ అయిన నాగ చైతన్య
YSRCP Gautham Reddy:42 కేసులున్నా రౌడిషీట్ ఎత్తేశారు - ఇదే చాన్స్ అనుకుని ఓ ఇల్లు కబ్జా - గౌతంరెడ్డి కథలు ఇన్నిన్ని కాదయా !
Vijay Deverakonda: వినసొంపైన మ్యూజిక్, అద్భుతమైన విజువలైజేషన్ - ఆకట్టుకున్న విజయ్ దేవరకొండ ‘సాహిబా’ సాంగ్!