Kalki 2898 AD: ‘కల్కి 2898 AD' అప్డేట్ - రేపు రెడీగా ఉండండి అంటూ!
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’ నుండి ఒక్క అప్డేట్ వస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో ఈ సినిమా నుండి అమితాబ్ పాత్ర గురించి రివీల్ చేస్తామంటూ మేకర్స్ ముందుకొచ్చారు.
Amitabh Bachchan In Kaliki 2898 AD: 2024లో తెలుగు నుండి విడుదల అవుతున్న పాన్ ఇండియా సినిమాలు చాలానే ఉన్నాయి. వాటన్నింటి కోసం తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. ఇక అలాంటి సినిమాల్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘కల్కి 2898 AD' కూడా ఒకటి. ఈ మూవీ మేలోని విడుదల అవుతుందని వార్తలు వినిపిస్తున్నా.. ఇప్పటికీ దీని నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంపై మరోసారి ‘కల్కి 2898 AD' రిలీజ్ గురించి అనుమానాలు మొదలవుతున్నాయి. ఆ సందేహాలు అన్నీ తొలగిపోయేలా మూవీ టీమ్.. ఒక ఆసక్తికరమైన అప్డేట్‌ను బయటపెట్టింది.
ఆసక్తికర అప్డేట్..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ‘కల్కి 2898 AD' కోసం ఎదురుచూస్తున్నారు. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా ఎలా ఉండబోతుందా అని తరచుగా ప్రేక్షకులు చర్చించుకుంటూనే ఉన్నారు. ముందుగా ఈ మూవీ గతేడాది విడుదల అవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ అలా ‘కల్కి 2898 AD' రిలీజ్ దాదాపుగా మూడుసార్లు పోస్ట్‌పోన్ అవ్వడంతో మేలో అయినా విడుదల అవుతుందా లేదా అని ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలయ్యింది. ఆ ఆందోళనను దూరం చేస్తూ.. వారిని హ్యాపీ చేయడానికి ‘కల్కి 2898 AD' టీమ్ ఆసక్తికరమైన అప్డేట్‌ను అందించింది.
కొత్త పోస్టర్..
ఇప్పటికే ‘కల్కి 2898 AD'లో లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ప్రభాస్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యాయి. అలా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌లో అమితాబ్ బచ్చన్.. ఒక స్వామిజీగా కనిపిస్తూ తన మొహాన్ని పూర్తిగా కప్పేసుకొని ఉన్నారు. ఆ ఒక్క లుక్ తప్పా ఇప్పటివరకు ‘కల్కి 2898 AD' నుండి అమితాబ్ పాత్రకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా మేకర్స్ రివీల్ చేయలేదు. అయితే ‘కల్కి 2898 AD'లో బిగ్ బీ పాత్ర గురించి రివీల్ చేసే సమయం వచ్చేసందంటూ ఒక స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్. ఏప్రిల్ 21న సాయంత్రం 7.15 నిమిషాలకు స్టార్ స్పోర్ట్స్ ఇండియా ఛానెల్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా అమితాబ్ బచ్చన్ పాత్ర గురించి రివీల్ చేస్తామని ప్రకటించింది.
𝐓𝐡𝐞 𝐭𝐢𝐦𝐞 𝐡𝐚𝐬 𝐜𝐨𝐦𝐞 𝐭𝐨 𝐤𝐧𝐨𝐰 𝐰𝐡𝐨 𝐡𝐞 𝐢𝐬!
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) April 20, 2024
Exclusively on @StarSportsIndia at 7:15 PM on April 21st.#Kalki2898AD @SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7@DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD #IPLonStar pic.twitter.com/EvCB18YDJV
ఐపీఎల్ సీజన్..
ప్రస్తుతం అంతటా ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. అందుకే ‘కల్కి 2898 AD' టీమ్ కూడా ఈ విషయాన్ని క్యాష్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సాయంత్రం అయితే చాలు.. చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ స్టార్ స్పోర్ట్స్‌కే పరిమితం అయిపోతున్నారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ పాత్ర గురించి కూడా అందులోనే రివీల్ చేయడం వల్ల ఇది చాలామంది ప్రేక్షకులకు త్వరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. వైజయంతీ బ్యానర్ లో అశ్వినిదత్ ‘కల్కి 2898 AD'ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దిశా పటానీ, కమల్ హాసన్ వంటి వారు కూడా ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Also Read: ‘కల్కి 2898 AD’ నుంచి క్రేజీ న్యూస్, రేపే గ్లింప్స్ విడుదల, రిలీజ్ డేట్ పైనా క్లారిటీ!