Kalki 2898 AD Glimpse: ‘కల్కి 2898 AD’ నుంచి క్రేజీ న్యూస్, రేపే గ్లింప్స్ విడుదల, రిలీజ్ డేట్ పైనా క్లారిటీ!
పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 AD’. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
![Kalki 2898 AD Glimpse: ‘కల్కి 2898 AD’ నుంచి క్రేజీ న్యూస్, రేపే గ్లింప్స్ విడుదల, రిలీజ్ డేట్ పైనా క్లారిటీ! Special treat from Kalki 2898 AD team Glimpse arriving tomorrow Kalki 2898 AD Glimpse: ‘కల్కి 2898 AD’ నుంచి క్రేజీ న్యూస్, రేపే గ్లింప్స్ విడుదల, రిలీజ్ డేట్ పైనా క్లారిటీ!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/20/19a2b4e4832b59d0cb9cafb2108ae9cc1713616880749544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Special Treat From ‘Kalki 2898 AD’ Team Arriving Tomorrow: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘కల్కి 2898AD’. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉవ్విళ్లూరుతున్నారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని పాన్ వరల్డ్ రేంజిలో తెరకెక్కిస్తున్నారు. పురాణాలను బేస్ చేసుకుని ఫ్యూచర్ టెక్నాలజీకి లింక్ చేస్తూ రూపొందిస్తున్నారు. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన పలు సినిమాలు ఇప్పటికే అద్భుత విజయాలు అందుకున్న నేపథ్యంలో ‘కల్కి‘పై కనీవినీ ఎరుగని రీతిలో అంచనాలు నెలకొన్నాయి. హాలీవుడ్ రేంజిలో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.
రేపే గ్లింప్స్ విడుదల, రిలీజ్ డేట్ పైనా క్లారిటీ
నిజానికి ‘కల్కి’ సినిమాను తమ సెంటిమెంట్ ప్రకారం మే 9న రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ, ఎన్నికల కారణంగా మూవీ వాయిదా వేశారు. ఇక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది మేకర్స్ ప్రకటించలేదు. అయితే ఈ సినిమాను మే 30న విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాకు సంబంధించి మేకర్స్ అదిరిపోయే అప్ డేట్ ఇవ్వబోతున్నారు. ‘కల్కి‘ మూవీకి సంబంధించిన గ్లింప్స్ ను రేపు రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ గ్లింప్స్ తో సినిమాపై అంచనాలను పెంచడంతో పాటు రిలీజ్ డేట్ విషయంపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గ్లింప్స్ ఎండింగ్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం ఉన్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఈ న్యూస్ తెలియడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
రూ. 100 కోట్లు ధర పలికిన నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్
ఇక ఇప్పుటికే ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సైన్స్ ఫిక్షన్ మూవీకి సంబంధించి నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ ఏకంగా రూ. 100 కోట్లకు అమ్ముడు పోయాయి. తెలుగులోనూ పెద్ద మొత్తంలో ధర పలికినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. రెండో హీరోయిన్ గా దిశా పటానీ కనిపించనుంది. ఈ మధ్యే విదేశాల్లో దిశా, ప్రభాస్ మధ్య ఒక రొమాంటిక్ సాంగ్ చిత్రీకరించినట్టు తెలిసింది. అంతేకాదు సెట్స్‌లోని వీరిద్దరు ఫోటోలను దిశ తన సోషల్ మీడియాలో ఖాతాలో కూడా షేర్ చేసింది. అలాగే రీసెంట్‌గా ప్రభాస్‌తో సెల్ఫీ దిగి ఫోటోను పంచుకుంది. జెండరీ హీరోలు బిగ్ బి అమితాబ్ బచ్చన్, లోక నాయకుడు కమల్ హాసన్ సైతం 'కల్కి 2989 AD' సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ హాసన్ విలన్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. వైజయంతీ బ్యానర్ లో అశ్వినిదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
View this post on Instagram
Also Read: ‘రానా నాయుడు 2’లో ‘ఏజెంట్’ విలన్ - పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)