Top Headlines Today: తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం; పవన్‌ను ఇరుకున పడేసిన బండి సంజయ్ - నేటి టాప్ న్యూస్
AP Telangana Latest News: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం
తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ కాకా రేపాయి. కేటీఆర్‌కు సబితా ఇంద్రారెడ్డి ప్రాంప్టింగ్ చేస్తుంటే రేవంత్‌రెడ్డి సీరియస్ అయ్యారు. వెనుక నుంచి మాటలు చెప్పే అక్కలను నమ్మితే కష్టమని రేవంత్ అన్నారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. పద్దులపై చర్చల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతూ... హామీలు అమలు చేయకపోతే కచ్చితంగా తెలంగాణ ప్రజల తరఫున ప్రభఉత్వాన్ని నిలదీస్తామని హెచ్చిరించారు. తన ప్రసంగం ముంగింపు టైంలో కళాజీ వ్యాఖ్యలను గుర్తు చేశారు. ఇంకా చదవండి
కాంగ్రెస్ ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందని యువకులు చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా- అసెంబ్లీలో కేటీఆర్ సవాల్
కాంగ్రెస్ హయాంలో ఒక్క ఉద్యోగం ఇచ్చిందని తెలంగాణ యువకులు చెబితే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెబుతూ కాలం గడుపుతున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ప్రతిపక్షం మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వానికి సవాల్ చేశారు. 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు... తెలంగాణ యువకులతో చెప్పిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం గాలి మాటలే చెబుతుంది కానీ ఇంత వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని అన్నారు. తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా నియామకమైన వారిని తమ ఖాతాల్లో వేసుకున్నారని ఆరోపించారు. కేవలం అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇచ్చినమంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదన్నారు కేటీఆర్. ఇంకా చదవండి
పవన్‌ను ఇరుకున పడేసిన బండి సంజయ్
ఆంధ్రప్రదేశ్‌లో 2019-23 మధ్య అదృశ్యమైన 44,685 మంది మహిళల్లో 44,022 మందిని పోలీసులు వెతికి పట్టుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర పోలీస్ శాఖకు సహాయపడిందని టీడీపీ ఎంపీలు బీకే పార్థసారథి, లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మహిళలపై వేధింపులు, చిన్నారులపై అఘాయిత్యాలు తదితర చర్యల నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి `విముక్తి` కార్యక్రమం నిర్వహించినట్టు మంత్రి బండి సంజయ్ వివరించారు. ఇంకా చదవండి
పింఛన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్- నేరుగా పంపిణీ చేయనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పింఛన్ల సొమ్ము ఒకటో తారీఖున లబ్ధిదారులకు అందజేయనున్నారు. సత్యసాయిజిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) నేరుగా పింఛన్‌సొమ్ము ఇవ్వనున్నారు. ఇంకా చదవండి
రేవంత్ ప్రభుత్వాన్ని లెక్క చేయని సినీ పరిశ్రమ
సినీ పరిశ్రమ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేరుగానే చెప్పాను. నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి ముందడుగు పడలేదని.. కనీసం సంప్రదించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే చిరంజీవి స్పందించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం చాంబర్ ను అప్రమత్తం చేశారు. నేడో రేపో ఇండస్ట్రీ బృందం ప్రభుత్వ పెద్దల్ని కలవొచ్చు. కానీ అసలు సమస్య అది కాదని.. రేవంత్ సినీ ఇండస్ట్రీ నుంచి మరింత సహకారం కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇంకా చదవండి