(Source: ECI/ABP News/ABP Majha)
Revanth Reddy Film Industry : రేవంత్ ప్రభుత్వాన్ని లెక్క చేయని సినీ పరిశ్రమ - సహకరిస్తే అలుసైపోతారా ? భయపెడితేనే భయభక్తలతో ఉంటారా ?
Telangana : రేవంత్ ప్రభుత్వం విషయంలో సినీ పరిశ్రమ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారుతోంది. గద్దర్ అవార్డుల పేరుతో రేవంత్ తన అసంతృప్తిని వ్యక్తం చేసినా... అంతకు మించిన కారణాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Film Industry ignoring Revanth Governament : సినీ పరిశ్రమ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేరుగానే చెప్పాను. నంది అవార్డులకు బదులుగా గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి ముందడుగు పడలేదని.. కనీసం సంప్రదించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే చిరంజీవి స్పందించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం చాంబర్ ను అప్రమత్తం చేశారు. నేడో రేపో ఇండస్ట్రీ బృందం ప్రభుత్వ పెద్దల్ని కలవొచ్చు. కానీ అసలు సమస్య అది కాదని.. రేవంత్ సినీ ఇండస్ట్రీ నుంచి మరింత సహకారం కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది.
ప్రజల్ని ప్రభావితం చేయగల శక్తి ఉన్న ఇండస్ట్రీ
సినీ ఇండస్ట్రీకి ఉన్న పవర్ గురించి రేవంత్ రెడ్డికి తెలియనిదేం కాదు. అందుకే ఇండస్ట్రీ వైపు నుంచి తనకు.. తన ప్రభుత్వానికి మరింత సపోర్టు కావాలని కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కొంత మంది సినీ ప్రముఖులు కలిశారు. అవన్నీ వ్యక్తిగత భేటీలు. ఇండస్ట్రీ తరపున ఎవరూ ప్రత్యేకంగా ప్రతినిధి బృందంగా కలవలేదు. సహకారం కోరలేదు. గత ప్రభుత్వంతో ఇండస్ట్రీ పెద్దలు ఎంతో సఖ్యతగా ఉండేవారు. అయిన దానికి కాని దానికి సపోర్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. ఉదాహరణకు.. మొక్కలు నాటే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం పిలుపునిస్తే.. సినీ ప్రమఖులంతా మొక్కలు నాటి వాటిని సోషల్ మీడియాలో పెట్టేారు. గొప్ప కార్యక్రమం చేపట్టారని అభినందించేవారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం పిలుపునిచ్చినా స్పందన లేదు.
ఏపీలో ఆరోగ్య శ్రీ చుట్టూ రాజకీయం - షర్మిలకు గట్టి కౌంటర్ ఇచ్చిన పెమ్మసాని
డ్రగ్స్ విషయంలోనూ రేవంత్ ప్రకటనపై అంతంత మాత్రం స్పందన
కొద్ది రోజుల క్రితం.. సినిమా ప్రారంభానికి ముందో తర్వాతో.. డ్రగ్స్ కు వ్యతిరేకంగా సందేశం ఉండాలని రేవంత్ ప్రకటించారు . దీనిపై ఒకరిద్దరు తప్ప పెద్దగా ఎవరూ స్పందించలేదు. సిద్ధార్థ్ ఇంకా వ్యతిరేకంగా స్పందించారు. తమకు ఉన్న బాధ్యత గురించి ఆయన చెప్పాలా అన్నట్లుగా మాట్లాడారు. తర్వాత క్షమాపణలు చెప్పారు కానీ..అప్పటికే నెగెటివ్ గా వెళ్లిపోయింది. ఇండస్ట్రీ మొత్తం ఈ అంశంపై ఓ తీర్మానం చేసి.. సీఎం నిర్ణయం ద్వారా... సమాజంలో తమ వంతు పాత్ర పోషిస్తామని సమైక్యంగా చెప్పలేకపోయారు. ఇది కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అసహనానికి గురి చేసి ఉంటుందని అంటున్నారు.
ఇండస్ట్రీకి పూర్తి స్థాయిలో రేవంత్ సర్కార్ సహకారం
సినిమా ఇండస్ట్రీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరిస్తోంది. భారీ సినిమాలు వస్తే ఎక్స్ ట్రా షోలు, టిక్కెట్ రేట్ల పెంపకం వంటి విషయాల్లో వారు అడినట్లుగానే ఉత్తర్వులు ఇస్తున్నారు. కనీసం తిప్పించుకోవడం లేదు కూడా. ఈ మాత్రం సహకారం అందే ప్రభుత్వం పట్ల ఇండస్ట్రీ నిర్లక్ష్యంగా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు ఇస్తామన్నారు. ఈ అవార్డులపై ఇంస్ట్రీ ఆసక్తి చూపించలేదు. బహుశా పేరు కారణం కావొచ్చన్న వాదన ఉంది. కానీ గద్దర్ అవార్డులు అనేది గొప్పగా లేవని.. ఓ అవార్డుకు ఆ పేరు పెట్టి మిగతా మొత్తానికి నంది లేదా.. మరో ఉన్నతమైన పేరు పెట్టాలన్న ఆలోచనను యినా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సి ఉందన్న అభిప్రాయం ఉంది.
సినీ ఇండస్ట్రీపై రేవంత్ ఆగ్రహం - వెంటనే స్పందించిన చిరంజీవి - ఏమన్నారంటే ?
భయపెడితేనే దారికి వస్తారా ?
తెలంగాణ ఏర్పాటు తర్వాత సినీ ఇండస్ట్రీ .. ఏపీ ప్రభుత్వంలోనే ఎక్కువ సఖ్యతగా ఉంది. ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేశారు. సినిమా వాళ్లు ఇప్పటికీ ఏపీ ప్రభుత్వానికే రిపోర్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత కొన్ని ఘటనలు జరిగాయి. డ్రగ్స్ కేసులు.. కొన్ని చెరువుల ఆక్రమణలు.. రోడ్ల వెడల్పు వంటి అభివృద్ధి పనులు ఇలా వరుస పెట్టి జరగడంతో సీన్ మారిపోయింది. అంతా బీఆర్ఎస్ పెద్దలకు దగ్గరయ్యారు. అప్పట్నుంచి బీఆర్ఎస్ కు సపోర్టుగా ఉంటూనే వచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ సహకరిస్తున్నా.. ఆ కోపరేషన్ చూపించడం లేదు. కానీ రేవంత్ కూడా గతంలో ప్రభుత్వంపై చూపించినంత ప్రేమ తన ప్రభుతవంపై చూపించాలని కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. రైతు రుణమాఫీ సహా.. తాను చేస్తున్న పథకాలకు ఇండస్ట్రీ కూడా ప్రచారం చేయాలని ఆయన కోరుకుంటున్నారన్న వాదన వినిపిస్తోంది. దీన్ని ఇండస్ట్రీ గుర్తిస్తుందో లేదో మరి !