Chiranjeevi on Gaddar Awards : సినీ ఇండస్ట్రీపై రేవంత్ ఆగ్రహం - వెంటనే స్పందించిన చిరంజీవి - ఏమన్నారంటే ?
Chiranjeevi : సినిమా పరిశ్రమపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో చిరంజీవి వెంటనే స్పందించారు. గద్దర్ అవార్డుల విషయంలో చొరవ తీసుకోవాలని ఫిలిం చాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను కోరారు.
Gaddar Awards Issue : తెలంగాణలో గద్దర్ అవార్డుల అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. గద్దర్ అవార్డులు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనా సినీ పరిశ్రమ ఆసక్తి చూపించలేదని రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని, సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు, ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్' తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున, ఫిలిం ఛాంబర్ మరియు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకువెళ్లేలా బాధ్యత తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 30, 2024
శ్రీ రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకుని,
సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ
సినీపరిశ్రమలోని ప్రతిభావంతులకు,
ప్రజా కళాకారుడు గద్దర్ గారి పేరు మీదుగా ప్రతియేటా 'గద్దర్ అవార్డ్స్'
తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందని
ప్రకటించిన తరువాత, తెలుగు పరిశ్రమ తరపున,… pic.twitter.com/vpOuec2T5H
రేవంత్ ఏమన్నారంటే ?
హైదరాబాద్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. టాలీవుడ్ ఇండస్ట్రీకి తాను ఒకటి గుర్తు చేయదల్చుకున్నాన్నారు. గతంలో ఇదే గతంలో ఇదే వేదిక నుంచి గద్దర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పానన్నారు. సినీ ప్రముఖులు, బాధ్యత వహిస్తున్నవారు ప్రభుత్వానికి ఏదైనా ప్రతిపాదన తీసుకురావాలని అప్పుడే విజ్ఞప్తి చేశాననని.. కానీ ఇప్పటి వరకూ ఎవరూ ప్రతిపాదనలతో రాలేదన్నారు. ఏ కారణం చేతనో సినీ రంగ ప్రముఖులు ఎవరూ ప్రభుత్వాన్ని సంప్రదించలేదని.. తెలంగాణ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి... మీ విజ్ఞప్తి కంటే ముందే నేను ఓ ప్రకటన చేశానని రేవం్ గుర్తు చేశారు. నంది అవార్డులంత గొప్పగా మా ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతుందని చెపినా ముందుకు రాలేదన్నారు. ఇప్పటికైనా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి ఈ ప్రతిపాదనను... ఈ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్తాలన్నారు. ఈ అంశంపై చిరంజీవి బాధ్యత తీసుకుని వెంటనే స్పందించారు. ఫిలించాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ స్పందించాలని కోరారు.
గతంలో నంది అవార్డు స్థానంలో గద్దర్ అవార్డ్స్ ప్రకటన
గత జనవరిలో రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ జయంతి కార్యక్రమంలో నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా ప్రకటిస్తూ రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. నంది అవార్డులు పునరుద్ధరించాలని సినిమా వాళ్లు అడిగారని.. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుందని చెప్పానన్నారు. గద్దర్ అవార్డుల పేరుతో పురస్కారాలు ఇస్తామని.. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే అధికారిక అవార్డులకు గద్దర్ అవార్డు ఇస్తామని ప్రకటించారు. తన మాటే జీవో అని కూడా ప్రకటించారు. అయితే సినీ పరిశ్రమ వైపు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ముందడుగు పడలేదు. ఇప్పుడు మరోసారి ఆయన స్పందించడం.. చిరంజీవి చొరవ తీసుకోవడంతో త్వరలో సినీ పరిశ్రమ నుంచి ఓ బృందం ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపే అవకాశం ఉందని తెలుస్తోంది.