అన్వేషించండి
Advertisement
Morning Top News: ఏపీఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ, తెలంగాణలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు వంటి టాప్ న్యూస్
Top 10 Headlines Today: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయవ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తల సమాహారం ఇక్కడ చూడొచ్చు.
Morning Top News:
ఏపీ అప్పు రూ. 9, 74, 556 కోట్లు.. కాదంటే..
ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పు రూ.9,74,556 కోట్లని.. కాదని ఎవరైనా అంటే అసెంబ్లీకి రావాలని తేల్చుతామని సీఎం స్పష్టం చేశారు. బడ్జెట్‌పై శుక్రవారం అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్రంలో వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రధాని చంద్రబాబుమోదీ, పవన్, ప్రజలు తనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని.. దాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన నష్టం కంటే.. జగన్ ఐదేళ్ల విధ్వంసం వల్ల జరిగిన నష్టమే ఎక్కువని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఐఐసీ మద్రాస్‌తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందాలు
ఏపీ ప్రభుత్వం ఐఐటీ మద్రాస్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది. అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందాలు చేసుకున్నారు. ఈ మేరకు మంత్రి ట్వీట్ చేశారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం, అత్యాధునిక పరిశోధనలు నిర్వహించడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సామాజిక సంబంధిత కార్యకలాపాల్లో ప్రభుత్వంతో కలిసి ఐఐటీ మద్రాస్ పనిచేయనుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిర్మల్ లోని భైంసాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. జిల్లాలోని అటవీ, ప్రభుత్వ భూముల సర్వేను చేపట్టి, హద్దులను గుర్తించి, సంరక్షించాలని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
రాజ్యాంగేతర శక్తిగా సీఎం సోదరుడు
రేవంత్ రెడ్డికి దమ్ముంటే తమతో కొట్లాడాలని, రాజకీయంగా తలపడాలి కానీ పేదలు, రైతులకు మాత్రం నష్టం కలిగొంచవద్దని కేటీఆర్ హెచ్చరించారు. సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఉన్న లగచర్ల బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. తమ వద్ద నుంచి భూములు లాక్కోవద్దని నిరసన తెలిపిన లగచర్ల రైతులపై నమోదు చేసిన కేసులన్నీ ఎత్తివేసి, వారిని జైళ్ల నుంచి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలో రేవంత్ సోదరుడు రాజ్యాంగేతర శక్తిగా మారాడని తెలిపారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
ఏపీ ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధుల ప్రయాణానికి రాయితీ టికెట్ల జారీకి పాటించాల్సిన నిబంధనలకు సంబంధించి సిబ్బందికి ఏపీఎస్ఆర్టీసీ మరోసారి మార్గదర్శకాలు జారీ చేసింది. వృద్ధులు తమ ఆధార్ కార్డు లేదా సీనియర్ సిటిజన్ ఐడీ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్, రేషన్ కార్డుల్లో ఏదో ఒకటి చూపించి రాయితీ పొందవచ్చని తెలిపింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
శబరిమలకు ప్రత్యేక రైళ్లు
తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి (హైదరాబాద్) - కొల్లాం, ఈ నెల 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం - మౌలాలి, నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం - కొల్లాం, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం - మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
10 మంది చిన్నారుల సజీవదహనం
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని చిన్నారుల విభాగం ఐసీయూలో అగ్ని ప్రమాదం సంభవించడంతో 10 మంది చిన్నారులు సజీవదహనం అయ్యారు. చిన్నారుల మృతిపై జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
శబరిమల అయ్యప్ప దర్శనం ప్రారంభం
శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాలు ప్రారంభమయ్యాయి. మకరవిళక్కు పూజల కోసం శుక్రవారం సాయంత్రం ఆలయ ద్వారాలను తెరిచారు. దీంతో అయ్యప్ప భక్తులు శబరిగిరులకు భారీగా పోటెత్తారు. దర్శన సమయాన్ని 18 గంటలకు పొడిగించింది. ఇటు వర్చువల్ క్యూ బుకింగ్స్‌ను ట్రావెన్‌కోర్ బోర్డు ప్రారంభించింది. వర్చువల్ దర్శనానికి తొలిరోజే 30వేల మంది భక్తులు టికెట్స్ బుక్ చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
సంజు, తిలక్ శతక జోరుతో సిరీస్ భారత్ కైవసం
సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 135 పరుగులు భారీ తేడాతో టీమిండియా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో చేలరేగడంతో 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రోటీస్ 18.2 ఓవర్లకు 148 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 3-1 తేడాతో భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. అతని సతీమణి రితికా సజ్దే పండంటి బాబుకు జన్మనిచ్చింది. ఈ దంపతులకు ఇప్పటికే సమైరా అనే కుమార్తె ఉన్నసంగతి తెలిసిందే. రితికాను రోహిత్ లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇరుకుటుంబాల అంగీకారంతో 2015 డిసెంబర్ 13న వీరు వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2018 డిసెంబరు 30న సమైరా జన్మించింది. ప్రస్తుతం రోహిత్ ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లాల్సి ఉంది.పూర్తి వివరాలు ఇక్కడ చూడండి..
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion