అన్వేషించండి

Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !

Rohit Sharma Become Father for second time | భారత కెప్టెన్ రోహిత్ శర్మ రెండోసారి తండ్రయ్యాడు. రోహిత్ భార్య రితికా సజ్దే పండంటి బాబుకు జన్మనిచ్చింది. దాంతో ఇరు కుటుంబాల్లో సంతోషం నెలకొంది.

Rohit Sharma and Ritika Sajdeh blessed with baby boy | టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. రోహిత్ శర్మ మరోసారి తండ్రయ్యాడు. ఆయన భార్య రితికా సజ్దే శుక్రవారం నాడు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. రోహిత్ శర్మ, రితికా సజ్దే దంపతులకు సమైరా అనే కుమార్తె జన్మించిన సమయంలో తొలిసారి తల్లిదండ్రులు అయ్యారు. తాజాగా రితికా ఓ బాబుకు జన్మనివ్వడంతో రోహిత్ శర్మ కుటుంబంలో సంబరాలు మొదలయ్యాయి. 

రోహిత్, రితికా ప్రేమించి పెళ్లి..

రోహిత్‌ శర్మ, తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తమ ప్రేమ విషయంలో పెద్దలను ఒప్పించి 2015 డిసెంబర్ 13న రోహిత్, రితికాల వివాహం ఘనంగా జరిగింది. వీరి ప్రేమకు గుర్తుగా 2018 డిసెంబరు 30న ఓ పాప పుట్టగా, సమైరాగా నామకరణం చేశారు. తాజాగా శుక్రవారం నాడు రోహిత్, రితికాలు మరోసారి తల్లిదండ్రులయ్యారని శుభవార్త బయటకు వచ్చింది. రితికా ఓ పండంటి బాబుకు జన్మనివ్వగా.. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని సమాచారం. వీలైతే రోహిత్ శర్మ రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియా చేరుకోవచ్చు. ఐదు టెస్టుల బోర్డర్, గవాస్కర్ ట్రోఫీలో పాల్గొనేందుకు తొలి టెస్టుకు ముందు సైతం కెప్టెన్ రోహిత్ శర్మ భారత్ నుంచి బయలుదేరే అవకాశం ఉంది.

భార్య రితికా సజ్దే నిండు గర్భిణి కావడం, డెలివరీపై డాక్టర్లు ఇచ్చిన సమాచారం కారణంగా రోహిత్ శర్మ ఆస్ట్రేలియా పర్యటనకు ఇంకా బయలుదేరలేదు. తన భార్య రితికా త్వరలో రెండోసారి బిడ్డకు జన్మనివ్వనుందని, తనను తొలి టెస్టు నుంచి మినహాయించాలని రోహిత్ శర్మ ఇటీవల బీసీసీఐని కోరాడు. కోచ్ గౌతమ్ గంభీర్ కు ఇదే విషయాన్ని చెప్పగా.. మేనేజ్‌మెంట్ రోహిత్ శర్మకు ఊరట ఇచ్చింది. వ్యక్తిగత, కుటుంబ కారణాలతో ఆటగాళ్లు మ్యాచ్‌లకు దూరం కావడం ఇదేమీ కొత్త కాదు. గతంలో పలువురు ఆటగాళ్లు సిరీస్ మధ్యలోనే ఇంటికి వెళ్లి తండ్రి అయ్యానన్న సంతోషాన్ని కుటుంబసభ్యులతో పంచుకున్నారు.

Also Read: Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే! 

అదే కారణంగా రోహిత్ శర్మ జట్టుతో పాటు ఆస్ట్రేలియా వెళ్లకుండా భారత్ లో ఉండిపోయాడు. దీనిపై విమర్శలు సైతం వచ్చాయి. రోహిత్ శర్మ కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి జాతీయ జట్టును పక్కన పెట్టడం సబబు కాదని కొందరు మాజీలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఆస్ట్రేలియా క్రికెటర్ ఆరోన్ ఫించ్ మాత్రం రోహిత్ నిర్ణయాన్ని సమర్థించాడు. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్ లో కుటుంబంతో పాటే రోహిత్ ఉండాలనుకోవడం సరైన నిర్ణయమని పేర్కొన్నాడు. ఫించ్ ప్రకటనపై రోహిత్ శర్మ భార్య రితికా సైతం స్పందించింది. అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపేలా పోస్ట్ చేసింది. 

Also Read: IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget