అన్వేషించండి

Top Headlines Today: నేడు తెలంగాణ ఎన్నికల శంఖారావం- చంద్రబాబు పిటిషన్లపై అందరి చూపు- మార్నింగ్ టాప్‌ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today

నేడే ఎన్నికల నగారా

ఇవాళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తెలంగాణతోపాటు మిజోరాం, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఐదు రాష్ట్రాలలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఇవాళ అంటే సోమవారం, అక్టోబర్ 8, 2023న ప్రకటించనుంది పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఉద్యోగులకు గుడ్ న్యూస్

అసెంబ్లీ ఎన్నికలకు ఏ క్షణమైనా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఎన్నికల ఇప్పటికే వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించింది. రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. నోటిఫికేషన్ రాకముందే ముఖ్యమంత్రి కేసీఆర్, ఊహించని నిర్ణయాలు తీసుకున్నారు. ఉద్యోగులు, పింఛనర్ల కోసం ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీం అమలుకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.  హెల్త్ స్కీం ద్వారా ఉద్యోగులు, పింఛనర్లతో పాటు వారి కుటుంబసభ్యులకూ ప్రయోజనం కలగనుంది. ఈ స్కీం నిర్వహణకు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి నేతృత్వంలో బోర్డును ఏర్పాటు చేశారు. అధికారులు, ఉద్యోగులు, పింఛనర్లు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఇందుకు సంబంధించిన జీవో నంబర్‌ 186ను సర్కార్ విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఊరట ఉంటుందా?

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో నేడు విచారణకు రానుంది. ఈ కేసు 59వ ఐటం కింద విచారణకు రానుంది. ఏపీ సీఐడీ నమోదు చేసిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసును కొట్టేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. జస్టిస్‌ అనిరుద్ధబోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం, చంద్రబాబు వేసిన పిటిషన్ పై విచారణ జరపనుంది. ఈ నెల 3న తేదీన ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, హైకోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లు సమర్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు చంద్రబాబుపై నమోదు చేసిన ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అంగళ్లు, ఫైబర్‌నెట్‌ కేసుల్లో బెయిల్‌ పిటిషన్‌లపై సోమవారం హైకోర్టు తీర్పులు ఇవ్వనుంది. మరోవైపు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, పోలీసు కస్టడీ కోరుతూ సీఐడీ వేసిన పిటిషన్‌పై ఏసీబీ కోర్టు నిర్ణయం ప్రకటించనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కీలక సమావేశం 

వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి -సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్లేందుకు విజయవాడలో సోమవారం సమావేశం నిర్వహిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలియచేశారు. దాదాపు 8 వేల మంది వైసీపీ ప్రతినిధులతో సీఎం జగన్ సమావేశం కానున్న ఇంధిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల, రాష్ర్ట మంత్రి జోగిరమేష్, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ ఆదివారం పరిశీలించారు. సభావేదికతో పాటు సమావేశానికి హాజరయ్యే వారికి భోజన ఏర్పాట్లు, తదితర అంశాల గురించి పరిశీలించారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రేపు షా రాక 

తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ లో పర్యటించనున్నట్లు తెలిపారు. అమిత్ షా జనగర్జన సభను విజయవంతం చేయాలని ప్రజలు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ డైట్ మైదానంలో సభ ఏర్పట్లను పరిశీలించారు. ఎంపీ సోయం బాపురావ్ తో పాటు బిజేపి పార్టీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి తదితరులు ఉన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మద్యంపై యుద్ధం

ఏపీ ప్రభుత్వంపై టీడీపీతో పాటు బీజేపీ చేస్తున్న ఆరోపణలలో మద్యం అమ్మకాలు ఒకటి. రాష్ట్రంలో గత నాలుగున్నరేళ్లలో మద్యం అమ్మకాలలో జరిగిన అవకతవకలపై కేంద్ర మంత్రి అమిత్ షాకు పురంధేశ్వరి ఫిర్యాదు చేశారు. మద్యం అమ్మకాలలో లెక్కలపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి అమిత్ షాను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కోరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

త్వరలో కాంగ్రెస్ జాబితా 

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేస్తామన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ థాక్రే. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తామన్న ఆయన, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుందన్నారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయన్న ఆయన, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు. అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించామన్న మాణిక్ రావ్ థాక్రే, అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నామని వెల్లడించారు. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదేనన్న మాణిక్ రావ్ థాక్రే, సీఈసీ సమావేశం కంటే ముందు మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

టీమిండియా విక్టరీ

టీమిండియా వరల్డ్ కప్‌లో బోణీ కొట్టింది. మొదటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై ఆరు వికెట్లతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసి గెలిచింది. ప్రస్తుతానికి భారత్ పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. కానీ మంచి నెట్ రన్‌రేట్‌ను సాధించింది. 1999 తర్వాత ఆస్ట్రేలియా ప్రపంచకప్ మొదటి మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే మొదటి సారి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

బాలయ్యపై అనిల్ రావిపూడి ప్రశంసలు

నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భగవంత్‌ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్​గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దీనిలో బాలీవుడ్ నటుడు అర్జున్‌ రాంపాల్‌ విలన్​గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్​కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్​లో భాగంగా లేటెస్టుగా ట్రైలర్​ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్యతో ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు దర్శకుడు అనిల్. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

గ్రౌండ్‌ ఫ్లోర్ బలిసిందా అన్నాడు

బాలకృష్ణ తరువాతి సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ మాత్రమే కాదు కమర్షియల్ మూవీ లవర్స్ అంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడిలాంటి కామెడి డైరెక్టర్.. బాలకృష్ణతో కలిసి ‘భగవంత్ కేసరి’లాంటి యాక్షన్ సినిమాను ఎలా తెరకెక్కించగలరు అని సందేహిస్తున్న ప్రేక్షకులకు ట్రైలర్‌తో గట్టి సమాధానమే ఇచ్చాడు దర్శకుడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మూవీ టీమ్ అంతా హాజరయ్యింది. ఇక ఈ ఈవెంట్‌లో బాలకృష్ణ మాట్లాడుతూ ఉపయోగించిన ఒక పదం.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్వికారాబాద్ వివాదంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ట్రోఫీ మ్యాచ్‌లపై ఐసీసీకి లెటర్ రాసిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్పెద్దపల్లిలో అదుపు తప్పిన గూడ్స్, 11 బోగీలు బోల్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YSRCP MLAs: అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
అసెంబ్లీకి హాజరవ్వాలనుకుంటున్న ఎమ్మెల్యేలు - వద్దే వద్దంటున్న జగన్ - ధిక్కరిస్తారా ?
TG Group 3 Exam: తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
తెలంగాణలో గ్రూప్ 3 అభ్యర్థులకు అలర్ట్, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
Kanguva Twitter Review: కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
కంగువ ట్విట్టర్ రివ్యూ - సూర్య రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?
Matka Twitter Review: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?
Matka: అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో వరుణ్ తేజ్ 'మట్కా' షోస్ క్యాన్సిల్ - అసలు కారణం అదేనా?
Which OTT Platform Has Basic Instinct: మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
మర్డర్లు చేస్తూ నవలలు రాసే హీరోయిన్- డిటెక్టివ్‌ ప్రేమ - బోల్డ్ సీన్లతో మతిపోగొట్టే బేసిక్ ఇన్‌స్టింక్ట్‌
Andhra News: అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
అమరావతిలోనే లోకాయుక్త కమిషన్‌, హెచ్‌ఆర్‌సీ: హైకోర్టుకు తెలిపిన ఏపీ ప్రభుత్వం
Sim Cards Blocked: 1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
1.77 కోట్ల సిమ్ కార్డులు బ్లాక్ చేసిన ట్రాయ్ - మీ సిమ్ బ్లాక్ అయిందేమో చూసుకోండి!
Embed widget