అన్వేషించండి

Telangana Congress: వీలైనంత త్వరలోనే అభ్యర్థుల జాబితా : కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ థాక్రే

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేస్తామన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్ రావ్ థాక్రే.

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత త్వరగా సిద్ధం చేస్తామన్నారు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ థాక్రే. అతి త్వరలో తొలి జాబితాను విడుదల చేస్తామన్న ఆయన, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ జాబితాను ఖరారు చేస్తుందన్నారు. వివిధ సామాజికవర్గాల నుంచి దరఖాస్తులు వచ్చాయన్న ఆయన, ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ నుంచి ఒక జాబితా వచ్చిందని తెలిపారు. అన్ని వైపుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించామన్న మాణిక్ రావ్ థాక్రే, అన్నివర్గాలకు తగినంత ప్రాతినిథ్యం లభించేలా చూస్తున్నామని వెల్లడించారు. టికెట్ల ఖరారులో తుది నిర్ణయం పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీదేనన్న మాణిక్ రావ్ థాక్రే, సీఈసీ సమావేశం కంటే ముందు మరోసారి స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరుగుతుందన్నారు. 

మరోవైపు కాంగ్రెస్‌లో టికెట్ ఆశిస్తున్న ఆశావహులు గళం పెంచారు. హస్తినకి చేరుకుంటున్న నేతలు అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సీట్ల ఎంపికకోసం కసరత్తు జరుగుతున్న వార్‌రూమ్‌ ముందు ఓయూ జేఏసీ విద్యార్థి నాయకులు ఆందోళన చేపట్టారు. రాహుల్‌గాంధీ సూచనలు స్క్రీనింగ్‌ కమిటీ పరిగణనలోకి తీసుకొని ఎన్నికల్లో సీట్లు కేటాయించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్‌ పార్టీలో పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకులకు న్యాయం చేయాలని, ఓయూ విద్యార్థుల టికెట్ల అంశంపై స్క్రీనింగ్‌ కమిటీలో చర్చ జరగాలంటూ నినాదాలు చేశారు. 

ఇటు షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేయాలని స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ ను కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్ తో భేటీ అయిన ఆయన, యువజన కాంగ్రెస్ నేతలకు టికెట్లు ఇవ్వాలన్న డిమాండ్ ఉందన్నారు. పార్టీ ప్రతి కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నేతలు కష్టపడుతున్నారని, కేసులను ఎదుర్కొంటూ పార్టీ కోసం పని చేస్తున్నారని తెలిపారు. యువతకు సీట్ల కేటాయింపులో తగిన ప్రాధాన్యత ఉండాలని, టికెట్ల కేటాయింపులో మహిళలకు మంచి కోటా రాబోతుందన్నారు. 

అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్న కోమటిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని వెల్లడించారు. సింగిల్ అభ్యర్థి సీట్లను ఫైనల్ చేయాలని మురళీధరణ్ కు విజ్ఞప్తి చేసినట్లు కోమటిరెడ్డి తెలిపారు. ఆదివారం జరిగే స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 90 శాతం కసరత్తు పూర్తి చేసి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి పంపించాలని సూచించానన్నారు. సాధ్యమైనంత త్వరగా సీఈసీ మీటింగ్ అయ్యేలా చూడాలని కోరినట్లు వెల్లడించారు. ఎన్నికలకు సమయం లేదని, అభ్యర్థుల లిస్ట్ ఫైనల్ అయితే, వారంతా నియోజకవర్గాలకు వెళ్లి పని చేస్తారని తెలిపారు. 

తమ వాటా ఏంటన్న బీసీలు
మరోవైపు బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని పార్టీలోని సీనియర్లు డిమాండ్ చేస్తున్నారు. ఏ యే నియోజకవర్గాల్లో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉంటారో...ఆయా సీట్లను బీసీ వర్గాలకే కేటాయించాలని పార్టీని కోరారు. సర్వేలు చూపించి బీసీలకు అన్యాయం చేస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. పీసీసీ చీఫ్ చెప్పినట్లుగా బీసీలకు 34 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు సీట్ల కోటా విషయంలోనూ తగ్గేదే లేదని కాంగ్రెస్​లోని బీసీ లీడర్లు అంటున్నారు. హైకమాండ్​కు లాయల్​గా ఉంటూనే పోరాటం చేస్తామని, ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో లోక్​సభ పరిధిలో రెండు సీట్లను ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు. బీసీల ఓట్లు లేనిదే ఏ పార్టీ గెలిచే పరిస్థితి లేదని తేల్చి చెప్తున్నారు. బీసీలు ఎక్కువున్నప్పుడు బీసీ లీడర్లకు టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కాంగ్రెస్ సహా ఏ పార్టీలోనూ బీసీలకు న్యాయం జరగడం లేదని అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. బీసీ ఓటర్లు అధికంగా ఉండి, గెలిచే అవకాశం ఉన్న నియోజకవర్గాలల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు మధుయాష్కీ.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Formula E Case Adjourned: ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
ఫార్ములా ఈ-రేసు కేసులో ఏసీబీ కోర్టుకు కేటీఆర్ - రూ.లక్ష పూచీకత్తు సమర్పణ - విచారణ ఆగస్టు 25కు వాయిదా!
Telangana Cabinet Expansion Postponed: తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ బ్రేక్ - ఢిల్లీలో హైకమాండ్ క్లాస్.. ఆశావహులకు నో గ్రీన్ సిగ్నల్!
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
Vizag Dhimsa Dance Guinness Record: చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
చరిత్ర సృష్టించిన గిరిజన సాంస్కృతిక వైభవం - 13 వేల మందితో థింసా డ్యాన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం!
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Price Hike August 2026: ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
ఆగస్టు నుంచి ధరలు పెరిగే వస్తువులు, ధరలు తగ్గే వస్తువులు ఇవే! 
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Embed widget