Amit Shah: ఈ 10న తెలంగాణకు రానున్న అమిత్ షా, ఆదిలాబాద్ లో జనగర్జన సభ
ఈనెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ లో పర్యటించనున్నట్లు బీజేపీ ఎంపీ సోయం బాపురావ్ తెలిపారు.

Amit Shah To visit Telangana:
తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో అన్ని సీట్లు బీజేపీ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ ఎంపీ సోయం బాపురావ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ లో పర్యటించనున్నట్లు తెలిపారు. అమిత్ షా జనగర్జన సభను విజయవంతం చేయాలని ప్రజలు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అదిలాబాద్ జిల్లా కేంద్రంలోనీ డైట్ మైదానంలో సభ ఏర్పట్లను పరిశీలించారు. ఎంపీ సోయం బాపురావ్ తో పాటు బిజేపి పార్టీ నాయకులు అల్జాపూర్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, బిజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి తదితరులు ఉన్నారు.
గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ కు అమిత్ షా రెండోసారి వస్తున్నారని ఎంపీ బాపూరావ్ అన్నారు. గతంలో నిర్మల్ కు వచ్చారని.. ప్రస్తుతం బీజేపీ నిర్వహించనున్న జనగర్జన సభను విజయవంతం చేయాలని అన్ని వర్గాల వారికి పిలుపునిచ్చారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో రంగాల్లో అభివృద్ది చెందుతామని ప్రజలు భావించారు, కేసీఆర్ పాలనతో మేలు జరగలేదన్నారు. దేశంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉండాలంటే బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇక్కడ భూములు కేటాయించకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు వరంగల్ కు వెళ్లాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకున్నా కేంద్ర ప్రభుత్వం పలు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టిందన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు కేంద్రం త్వరలోనే అందిస్తుందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీని ప్రభుత్వ లేక ప్రైవేట్ పరంగానైనా తెస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదని అమిత్ షా దృష్టికి ఇలాంటి పలు విషయాలు తీసుకెళ్తామని బాపూరావ్ తెలిపారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఓసీ ఇవ్వడం లేదన్నారు. ఆదివాసీల గిరిజనుల ప్రాంతంలో పోడు భూములను ఇస్తామని ప్రకటన చేస్తున్నారు కానీ వారికి భూములు ఇవ్వడం లేదని ఆరోపించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

