Bhagavanth Kesari : నేను రాసిన దానికంటే బాలయ్య 1000 రెట్లు అద్భుతంగా నటించారు: డైరెక్టర్ అనిల్ రావిపూడి
నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న 'భగవంత్ కేసరి' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ బాలయ్యతో ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు.
Bhagavanth Kesari : నందమూరి బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్ర పోషించింది. దీనిలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ మూవీని దసరా కానుకగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రమోషన్స్‌లో భాగంగా లేటెస్టుగా ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా బాలయ్యతో ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు దర్శకుడు అనిల్.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘షైన్ స్క్రీన్స్ నిర్మాతలు సాహు గారపాటి, హరీష్ పెద్దికి ధన్యవాదాలు. నన్ను నమ్మి మేకింగ్ పరంగానూ, బడ్జెట్ పరంగా కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు. దాని అవుట్ పుట్ ఏంటి, రిజల్ట్ ఏంటి అనేది మీరు అక్టోబర్ 19న చూస్తారు. 'భగవంత్ కేసరి' చిత్రం పట్టాలెక్కడానికి సురేందర్, ఆనంద్ అనే ఇద్దరు వ్యక్తులు కారణం. వారి గురించి తర్వాత చెప్తాను. ఈ చిత్రానికి పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, నా రైటింగ్ టీమ్‌లో ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. నా కెరీర్లో ఈ మూవీ సానా ఏళ్లు యాదుంటది. వీరందరితో ఈ 8 నెలల జర్నీ ఎంతో ఎమోషనల్‌గా సాగింది. నేను తెలియని ఒక ఉద్వేగానికి లోనవుతున్నాను. ఇది నాకు ఎంతో మెమరబుల్’’ అని అన్నారు.
‘‘హీరోయిన్ కాజల్ అగర్వాల్‌తో ఫస్ట్ టైం కలిసి వర్క్ చేశా. ఎన్నో బ్లాక్ బస్టర్స్‌తో కెరీర్లో పీక్స్ చూసిన కాజల్, చిన్న గ్యాప్ ఇచ్చి ఒక బాబుకు జన్మనిచ్చి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఈ సినిమాలో ప్రతీ పాత్రకి ప్రాధాన్యం ఉంది. కాత్యాయని అనే ఒక సైకాలజిస్ట్‌గా కాజల్ చాలా అద్భుతంగా నటించింది. నేషనల్ అవార్డ్ విన్నర్ అర్జున్ రాంపాల్ ఈ సినిమాతో తెలుగులో లాంఛ్ అవుతున్నారు. బాలయ్య గారికి ధీటుగా ప్రతినాయకుడిగా రాహుల్ సాంగ్వి అనే పాత్రలో అలరించబోతున్నారు. ఆయన ఒక హిందీ ఆర్టిస్ట్ అయ్యుండి తెలుగు నేర్చుకుని సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పారు''
''భగవంత్ కేసరి సినిమాని యాక్సెప్ట్ చేయడానికి, ఈ పాత్ర ముందుకు వెళ్లడానికి బాలయ్య డెసిజన్ మేకింగ్ కారణం. ఇది నాకు చాలా పెద్ద అవకాశం. ఈ చిత్రం ద్వారా నాతో పాటుగా శ్రీలీలకు కూడా లక్ దొరికింది. ఆమె పోషించిన విజ్జిపాప అనే రోల్ మీకు చాలా రోజులు గుర్తిండిపోతుంది. భగవంత్ కేసరి, విజ్జిపాప మధ్య ఎమోషనల్ జర్నీ మిమ్మల్ని చాలా బాగా ఆకట్టుకుంది. మనం ఏదైనా మంచి పని చేసే ముందు, మన మంచి కోరుకునే వారు మన పక్కన ఉంటే అది చాలా పెద్ద విజయం సాధిస్తుంది. నా మంచి కోరుకునే వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని, బాబీ ఈ ట్రైలర్ లాంచ్‌కి వచ్చినందుకు కృతజ్ఞతలు''
''బాలయ్య బాబు కెరీర్లో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు చేశారు. ఆయనకు నటన కొత్తేమీ కాదు. అయినప్పటికీ ఏదైనా కొత్త పాత్ర ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఓ స్టూడెంట్ లాగా నేనేం చేయాలని తపిస్తూ.. కష్టపడి పనిచేస్తుంటారు. నేను పేపర్ మీద రాసిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువ పెరఫార్మ్ చేసి టాప్ నాచ్‌లో పెట్టారు. ప్రతి రోజూ ఆయన నటనను మానిటర్లో చూస్తున్నప్పుడు నా ఎమోషన్ని ఆనందాన్ని ఎలా చెప్పాలో తెలిసేది కాదు. ఇప్పుడు ఆయనకు ఒక హగ్ ఇచ్చి మాత్రమే చెప్పగలను. ఈ సినిమాలో చాలా ఎమోషన్స్ ఉంటాయి. భగవంత్ కేసరి పాత్రతో చాలా జర్నీ చేస్తారు. వ్యక్తిగతంగా బాలయ్యతో ఈ ప్రయాణం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. నందమూరి బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు’’ అని అనిల్ రావిపూడి అన్నారు.
కాగా, 'పటాస్' సినిమాతో డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన అనిల్ రావిపూడి.. బ్యాక్ టూ బ్యాక్ విజయాలతో అపజయం ఎరుగని దర్శకుడిగా కొనసాగుతున్నారు. యాక్షన్‌కు తనదైన ఎంటర్టైన్మెంట్ జోడించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. చివరగా 'ఎఫ్ 3' చిత్రంతో హిట్ కొట్టిన అనిల్.. 'భగవంత్ కేసరి' మూవీతో సక్సెస్ ట్రాక్ ని కొనసాగిస్తారని అభిమానులు భావిస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
Also Read: టాలీవుడ్ న్యూ ఏజ్ లేడీ ప్రొడ్యూసర్స్ - సినిమా నిర్మాణంలో సత్తా చాటుతున్న వారసురాళ్లు!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial