News
News
వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: మండే మార్నింగ్‌ టాప్‌ టెన్ హెడ్‌లైన్స్ ఇవే

Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..

FOLLOW US: 
Share:

అమెరికాలో తెలుగమ్మాయి మృతి 
అమెరికాలో మరోసారి కాల్పులకు దుండగులు తెగబడ్డారు. ఈసారి జరిగిన కాల్పుల్లో తెలుగు అమ్మాయి మృతి చెందారు. టెక్సాస్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రంగారెడ్డి జిల్లా జడ్జి కుమార్తె మృతి చెందారు. 

రంగారెడ్డి జిల్లా జడ్జి నర్సిరెడ్డి కుమార్తె ఐశ్వర్య అమెరికాలో పని చేస్తున్నారు. ఫర్‌ఫెక్ట్ జనరల్‌ కంట్రాక్ట్స్‌ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా వర్క్ చేస్తున్నారు. మొన్న రాత్రి టెక్సాస్‌లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్‌లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 27 ఐశ్వర్య మృతి చెందినట్టు ఎఫ్‌బీఐ ధ్రువీకరించింది. పూర్తి వివరాలు చూడండి

క్షేమంగా తీసుకొచ్చేందుకు
మణిపూర్‌ విద్యార్ధుల విషయంలో ఫలించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రయత్నాలు ఫలించాయి. రెండు ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసి మణిపూర్ లో ఉన్న రాష్ట్రానికి చెందిన విద్యార్థులను క్షేమంగా తరలించనున్నారు. ఏపీ ప్రభుత్వం సొంత ఖర్చులతో రెండు విమానాలు ఏర్పాటు చేసింది. ఇంఫాల్ నుంచి ఒక విమానం హైదరాబాద్‌కు, మరోక విమానం కోల్‌కత్తాకు, అక్కడినుంచి స్వస్థాలాలకు పంపేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సోమవారం ఉదయం 9.35 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరనున్న విమానం, అందులో 108 మంది ఏపీ విద్యార్ధులు ప్రయాణించనున్నారు. అయితే విద్యార్థుల విషయంలో ఆందోళన అక్కర్లేదని ఏపీ ప్రభుత్వం విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించింది. పూర్తి వివరాలు చూడండి

రేపే ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో ఇంటర్ ఫలితాల వెల్లడికి సమయం ఖరారైనట్లు తెలుస్తోంది. రేపు (మే 9న‌ ) ఇంట‌ర్ ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం ఫ‌లితాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది. మే 9న ఉద‌యం 11 గంట‌ల‌కు నాంప‌ల్లిలోని ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డులో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నట్లు స‌మాచారం. ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఎగ్జామ్స్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వ‌ర‌కు నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. ప్రథ‌మ‌, ద్వితీయ సంవ‌త్సరం ప‌రీక్షల‌కు 5 ల‌క్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. ఇంట‌ర్ ఫ‌లితాల కోసం tsbie.cgg.gov.in వెబ్‌సైట్ల ద్వారా చూసుకోవచ్చు. పూర్తి వివరాలు చూడండి

ప్రియాంక టూర్‌పై రగడ 
పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం చెబుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. ఏఐసీసీ నాయకురాలు ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్ ని ఎడ్యుకేషన్ టూర్ గా మార్చుకుని, తెలంగాణలోని తమ పరిపాలన విధానాలను... ప్రజలకు అందుతున్న వాటి ఫలాలను తెలుసుకోవాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఎంప్లాయిమెంట్ పాలసీ ఒకటి ఉంటే దేశంలో ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు కేటీఆర్. పూర్తి వివరాలు చూడండి

పెను విషాదం
కేరళలో ఘోర విషాదం చోటుచేసుకుంది. టూరిస్టుల బోటు బోల్తా పడటంతో 18 మంది మృతి చెందినట్లు సమాచారం. మలప్పురం జిల్లాలో తన్నూర్ బీచ్ దగ్గర ప్రమాదం జరిగింది. టూరిస్టుల బోటు బోల్తా పడిన సమయంలో అందులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. గజ ఈతగాళ్లతో పోలీసులు, సహాయక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు చూడండి

నోబాల్‌తో చేజారిన విజయం 
ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ డ్రమెటిక్ మ్యాచ్‌ను సన్‌రైజర్స్ దక్కించుకుంది. సన్‌రైజర్స్ విజయానికి చివరి బంతికి ఐదు పరుగులు కావాలి. సందీప్ శర్మ వేసిన బంతిని అబ్దుల్ సమద్ బలంగా కొట్టాడు. అది నేరుగా లాంగాఫ్‌లో ఉన్న జోస్ బట్లర్ చేతిలో పడింది. దీంతో రాజస్తాన్ శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. కానీ అంతలోనే షాక్. సందీప్ వేసింది నోబాల్ అని అంపైర్లు ప్రకటించారు. దీంతో లక్ష్యం ఒక్క బంతికి నాలుగు పరుగులుగా మారింది. ఈ దశలో సందీప్ వేసిన బంతిని అబ్దుల్ సమద్ నేరుగా సిక్సర్‌గా తరలించాడు. ఈ విజయంతో సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టిలో తొమ్మిదో స్థానానికి చేరుకుంది. తన ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పూర్తి వివరాలు చూడండి

జాగ్రత్త సుమీ
భారతదేశంలో పెరుగుతున్న ఇంటర్నెట్ వాడకంతో పాటే సైబర్ నేరం కేసుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. చెప్పుల షాపింగ్ నుంచి ఆహారం ఆర్డర్ చేయడం వరకు అన్ని రకాల పనుల కోసం ప్రజలు ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం రకరకాల వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. వీటిలో కొన్ని నమ్మకమైన వెబ్‌సైట్లు అయితే, మిగిలినవి ఫేక్‌ సైట్లు. ఫేక్‌ సైట్లలో సైబర్‌ నేరగాళ్లు పొంచి ఉంటారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే, ప్రజల నమ్మకాన్ని చూరగొన్న సైట్లలోనూ ఇప్పుడు మోసాలు వెలుగు చూస్తున్నాయి. కాబట్టి, ఆన్‌లైన్‌లో షాపింగ్‌ లేదా ఆర్డర్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. పూర్తి వివరాలు చూడండి

హెల్త్ ఇన్సూరెన్స్‌ అప్‌డేట్స్
ప్రస్తుత కాలంలో, ఆర్థిక భద్రత కోసం బీమా ముఖ్యంగా ఆరోగ్య బీమా అవసరంగా మారింది. అనర్థాలు, రోగాలు చెబితే రావని అంటారు. కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని బాగా అర్ధం చేసుకున్నారు. రోగాలు వచ్చినప్పుడు అకస్మాత్తుగా పెద్ద ఖర్చును తెచ్చి మన బడ్జెట్‌ ప్లాన్‌ను పాడు చేస్తుంది. ఇలాంటి సందర్భంలో ఆరోగ్య బీమా ఉపయోగపడుతుంది. ఆకస్మిక అనారోగ్యాల సమయంలో ప్రజలకు ఆర్థిక భద్రతను అందిస్తుంది. ఇటీవలి కాలంలో కొన్ని మార్పులు ఆరోగ్య బీమా విలువను పెంచాయి. ఆరోగ్య బీమా కంపెనీలు తమ బీమా ప్లాన్స్‌కు కొత్త సౌకర్యాలను జోడిస్తున్నాయి, దీనివల్ల, కొత్త బీమా పథకాలు వినియోగదార్లకు మరింత ఉపయోగకరంగా మారుతున్నాయి. పూర్తి వివరాలు చూడండి

మీ రాశికి ఎలా ఉంది?
ఈ రోజు ఈ రాశివారు కొన్ని రహస్యాలు తెలుసుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆశక్తి చూపిస్తారు. కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు. ప్రయాణంలో కొన్ని సమస్యలు రావొచ్చు. కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకోవాలి. శత్రువు మీకు హాని కలిగించకుండా అప్రమత్తంగా ఉండండి. పూర్తి వివరాలు చూడండి

మొబైల్‌ ఫోన్స్‌తో సమస్య
మొబైల్ ఫోన్స్‌తో ఇప్పటికే ఎన్నో రకాల సమస్యలు ముడిపడి ఉన్నాయి. టాయిలెట్ సీటు కంటే మొబైల్ ఫోన్ పైన ఉండే బ్యాక్టీరియా ఎక్కువ అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెప్పాయి. ఇప్పుడు మరొక అధ్యయనం మొబైల్లో ఫోన్లు ఎక్కువగా మాట్లాడే వారికి హైబీపీ వచ్చే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ వ్యక్తితో పోలిస్తే రోజుకు 30 నిమిషాలకు మించి ఫోన్లో మాట్లాడే వారిలో అధిక రక్తపోటు వచ్చే అవకాశం 12 శాతం ఉన్నట్టు చెబుతోంది అధ్యయనం. పూర్తి వివరాలు చూడండి

Published at : 08 May 2023 08:23 AM (IST) Tags: AP news today Telangana LAtest News Todays latest news Top 10 headlines today

సంబంధిత కథనాలు

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

CEERI: రాజస్థాన్‌ సీఎస్‌ఐఆర్‌-సీఈఈఆర్‌ఐలో 20 సైంటిస్ట్‌ పోస్టులు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

Anakapalli Lovers: లాడ్జిలో రూం తీసుకొని లవర్స్ ఆత్మహత్యాయత్నం, యువతి మృతి, కొనఊపిరితో యువకుడు!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!

లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!