మే 8 రాశిఫలాలు, ఈ రాశివారికి ఈ రోజు ఆందోళనగా ప్రారంభమవుతుంది
Rasi Phalalu Today 8th May: ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
మే 8 రాశిఫలాలు
మేష రాశి
ఈ రోజు ఈ రాశివారు కొన్ని రహస్యాలు తెలుసుకోవడంపై ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆశక్తి చూపిస్తారు. కొత్త పని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉండదు. ప్రయాణంలో కొన్ని సమస్యలు రావొచ్చు. కోపాన్ని, మాటలను అదుపులో పెట్టుకోవాలి. శత్రువు మీకు హాని కలిగించకుండా అప్రమత్తంగా ఉండండి.
వృషభ రాశి
కుటుంబ జీవితంలో ఆనందం, సంతోషం ఉంటుంది. మంచి ఆహారాన్ని ఆస్వాదిస్తారు.ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక లాభం ఉంటుంది. దూరంగా ఉన్న ఆత్మీయుల వార్తలు మిమ్మల్ని సంతోషపరుస్తాయి. భాగస్వామ్య వ్యాపారంలో ప్రయోజనం పొందుతారు. ఉద్యోగులకు మంచి రోజు.
మిథున రాశి
ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఈ రోజు పూర్తవుతాయి. వాతావరణం సంతోషంగా ఉంటుంది. ఆర్థికంగా లాభపడతారు. కార్యాలయంలో వాదోపవాదాలు పెట్టుకోవద్దు. ఆరోగ్యం బావుంటుంది. ఈ రోజు పాత స్నేహితుడిని కలుస్తారు. వ్యాపారులకు శుభఫలితాలున్నాయి.
Also Read: మే 8 నుంచి 14 వీక్లీ రాశిఫలాలు, ఈ 6 రాశులవారికి ఆర్థికలాభం, వ్యవహారజయం
కర్కాటక రాశి
ఈ రోజు మీకు ఆందోళనతో ప్రారంభమవుతుంది. ఆరోగ్యపరమైన ఫిర్యాదులు కూడా ఉంటాయి. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి రోజు మంచిది కాదు. ఈరోజు అకస్మాత్తుగా ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది. స్నేహితుల మధ్య వాగ్వాదం జరగొచ్చు. ప్రయాణాలలో ఇబ్బంది ఉంటుంది. ఎవరికీ సలహా ఇవ్వకండి. ఓపికగా వ్యవహరించండి.
సింహ రాశి
ఈ రాశివారు సంతోషంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది. తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది. పనిలో ప్రతికూల ప్రభావం ఉంటుంది. అశాంతిగా అనిపిస్తుంది. ఈరోజు ఇంటి డాక్యుమెంటరీ పనులకు దూరంగా ఉండండి. ఆఫీసులో ఆందోళన ఉంటుంది. రిస్క్ తీసుకోకండి.
కన్యా రాశి
మీ ఆరోగ్యం బాగుంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోగలగాలి. తోబుట్టువులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం కూడా లాభదాయకంగా ఉంటుంది. మీ శత్రువులపై పైచేయి సాధిస్తారు. మీ అదృష్టం బాగున్నప్పటికీ ఆలోచించకుండా ఏ పనీ చేయకండి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి ఉంటుంది.
తులా రాశి
ఈ రోజు మీరు గందరగోళ స్థితిలో ఉంటారు. ముఖ్యమైన నిర్ణయాలు ఏవీ తీసుకోకూడదు. ఈ రోజు ఏ కొత్త పనిని ప్రారంభించవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలనుకుంటే మీ ప్రసంగంలో సంయమనం పాటించండి. మీరు మీ మొండితనాన్ని వదులుకోవాలి. ఆర్థికంగా లాభపడతారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.
Also Read: ఈ వారం ఈ రాశివారు తెలివితేటలు, మాట సరిగ్గా వినియోగించుకుంటే శుభఫలితాలు పొందుతారు
వృశ్చిక రాశి
ఈ రోజంతా సరదాగా గడుపుతారు. ఓ శుభవార్త వినే అవకాశం ఉంది. మీరు స్నేహితులు లేదా ప్రియమైనవారి నుంచి బహుమతిని పొందుతారు. ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ రోజు ఆనందంగా గడుపుతారు.
ధనుస్సు రాశి
ఈ రోజు కుటుంబ సభ్యులతో విభేదాలు రావొచ్చు. కోపాన్ని తగ్గించుకోవాలి. చట్టపరమైన విషయంలో నిర్ణయం మీకు వ్యతిరేకంగా రావొచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ప్రవర్తనను, మాటలను నియంత్రించుకోవాలి. డ్రైవింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు.
మకర రాశి
ఈరోజు ఇంట్లో శుభకార్యాల నిర్వహణపై చర్చిస్తారు. ధనలాభం ఉంటుంది. స్టాక్ మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు స్నేహితులతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగం, వ్యాపారాలలో లాభం ఉంటుంది. గౌరవం పొందుతారు. అవివాహితులకు పెళ్లి సంబంధం కుదురుతుంది.
కుంభ రాశి
ఈ రోజు కుటుంబ పెద్దల ఆశీస్సులు మీపై ఉంటాయి. ప్రయాణాలు కలిసొస్తాయి. ఉద్యోగ-వ్యాపారాలలో పరిస్థితి బాగుంటుంది. మీ మనస్సు తేలికగా మారుతుంది. గౌరవం అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో సక్సెస్ అవుతారు.
మీన రాశి
ఈ రోజు మీరు పిల్లల కారణంగా ఆందోళన చెందుతారు. కార్యాలయంలో అధికారులతో వాగ్వాదం జరిగే అవకాశం ఉంటుంది. కోపం తగ్గించుకోవాలి. శత్రువులు మీకు ఇబ్బందులు సృష్టించవచ్చు. మీపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ప్రభుత్వ పనుల్లో ఒత్తిడి ఉంటుంది. కుటుంబ విభేదాలు రావచ్చు.