News
News
వీడియోలు ఆటలు
X

Weekly Horoscope 08-14 May 2023: మే 8 నుంచి 14 వీక్లీ రాశిఫలాలు, ఈ 6 రాశులవారికి ఆర్థికలాభం, వ్యవహారజయం

Weekly horoscope 8th to 14th May : ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.

FOLLOW US: 
Share:

Weekly Horoscope 08-14 May 2023: మే నెలలో రెండో వారం ఈ రాశులవారికి శుభ ఫలితాలున్నాయి...

మేష రాశి
మేష రాశివారికి వారం ప్రారంభంలో మంచి ఆర్థిక లాభాలు ఉంటాయి. వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి అకస్మాత్తుగా లాభాలొస్తాయి. వ్యాపారం విస్తరిస్తారు.ఉద్యోగులు పదోన్నతి లేదా జీతం పెరుగుదలకు  సంబంధించి శుభవార్త వింటారు. వారం మధ్యలో ప్రయాణం చేయాల్సిన అవసరం రావొచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కొత్త అవకాశాలు అన్వేషిస్తూ తమ లక్ష్యాన్ని మార్చుకోవచ్చు. ఈ వారం వృత్తి-వ్యాపారాల పరంగా శుభప్రదంగా ఉంటుంది. ఆరోగ్యం బావుంటుంది. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆహారం, దినచర్యలో జాగ్రత్త వహించండి.  మీరు మీ ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ జీవితం బావుంటంది. హనుమంతుడిని పూజించండి మంచి జరుగుతుంది. 

మిగిలిన రాశిఫలాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

కర్కాటక రాశి 
ఈ రాశివారికి గతవారం కన్నా ఈ వారం శుభఫలితాలు పొందుతారు. వారం ప్రారంభంలో  మీలో ఉన్న కొన్ని ఆందోళనలు తొలగిపోతాయి. ఒక పెద్ద సమస్య నుంచి బయటపడడంతో ఉపశమనం పొందుతారు. కొత్త శక్తితో మీ లక్ష్యాన్ని సాధించడానికి దూసుకుపోతారు. చాలా కాలంగా విదేశాల్లో చదువులు, వ్యాపారాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం చివరి నాటికి శుభవార్త అందుతుంది. భూమి నిర్మాణం లేదా ఆస్తిలో పనిచేసేవారికి సమయం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్య పరంగా మామూలుగానే ఉంటుంది. ఆహారం, దినచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. వారం ద్వితీయార్థంలో ఓ శుభకార్యంలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు సాధారణంగానే ఉంటాయి. కొత్తగా పెళ్లయిన వారికి సంతాన సాఫల్యం లభిస్తుంది. ప్రతిరోజూ శ్రీ సూక్తాన్ని పఠించండి. 

Also Read: మీ ఇంట్లో నీరు ప్రవహించే దిశే (వాలు) మీ ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తుంది

సింహ రాశి
ఈ రాశివారికి ఈ వారం శుభదాయకం. వారం ప్రారంభంలో వృత్తి-వ్యాపారానికి సంబంధించిన ఏదైనా పెద్ద విజయం లేదా దానికి సంబంధించిన మంచి సమాచారం లభిస్తుంది. ఆరోగ్యం, ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఉద్యోగస్తులు పనిప్రాంతంలో మెరుగైన పనితీరుకు బాస్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. పూర్తి అభిరుచితో పనిచేయడం వల్ల మీరు మీ పనిలో ఆశించిన విజయాన్ని సాధించడమే కాకుండా, సహోద్యోగులతో మీ సంబంధం చాలా బలంగా ఉంటుంది. సంతానం కారణంగా సంతోషంగా ఉంటారు. వారం ద్వితీయార్ధంలో కుటుంబ సభ్యులతో చర్చించి ఆస్తికి సంబంధించిన ఓ నిర్ణయం తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వారం చివరినాటికి లాభదాయకమైన ప్రణాళికలు అమలుచేసేందుకు ప్లాన్ చేస్తారు. ప్రతి రోజూ  శ్రీమహా విష్ణువును ఆరాధించండి.

కన్యా రాశి 
కన్యా రాశి వారికి ఈ వారం అదృష్టం కలిసొస్తుంది. ఈ వారం మీరు తీసుకునే పెద్ద నిర్ణయాలు మీకు కలిసొస్తాయి. వారం ప్రారంభంలో వ్యాపారానికి సంబంధించి  ప్రయాణాలుంటాయి..ఈ పర్యటన మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. సమర్థవంతమైన వ్యక్తి సహాయంతో మీరు కెరీర్ పరంగా ఓ అడుగు ముందుకువేస్తారు. ఉద్యోగులు అదనపు ఆదాయవనరులు వెతుక్కోవడంలో సక్సెస్ అవుతారు. వారం ద్వితీయార్ధంలో ఉద్యోగస్తులకు కోరుకున్న చోటుకు బదిలీ లేదా పదోన్నతి పొందాలనే కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో కొన్ని శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. తల్లిదండ్రులు , జీవిత భాగస్వామి మద్దతులో పెద్ద ఆందోళన నుంచి బయటపడతారు. ప్రేమ వ్యవహారాల్లో సామరస్యం నెలకొంటుంది. ప్రతిరోజూ దుర్గాదేవిని ఆరాధించండి.

Also Read: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!

ధనుస్సు రాశి
ఈ వారం ధనుస్సు రాశి వారికి సుఖసంతోషాలతో నిండి ఉంటుంది. వారం ప్రారంభంలో మీరు మీ వృత్తి-వ్యాపారానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వింటారు. మీ స్థానం, పేరుప్రఖ్యాతులు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. మీరు కొంత కాలంగా ఒక సమస్యతో బాధపడుతుంటే అది ఈ వారం పరిష్కారం అవుతుంది.  వ్యాపార విస్తరణ ప్రణాళికలు ఫలిస్తాయి. అయితే ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం ఖర్చులు పెరుగుతాయి.  కుటుంబ పరంగా ఈ సమయం శుభప్రదంగా ఉండబోతోంది. కుటుంబంతో కలిసి ఆకస్మికంగా పర్యాటక ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సామరస్యం నెలకొంటాయి. శ్రీ విష్ణువును ఆరాధించండి. 

కుంభ రాశి
ఈ వారం కుంభ రాశి వారికి శుభాలు కలుగుతాయి. మీరు ఒక నిర్దిష్ట పనిని పూర్తి చేయడం లేదా ప్రత్యేక అవకాశం పొందడం కోసం కొంతకాలంగా వేచి ఉంటే, ఈ వారం మీ కోరిక నెరవేరుతుంది. ఈ వారం మీరు మీ తెలివితేటలు మరియు విచక్షణాబలంతో అతిపెద్ద పనిని సులభంగా చేయగలుగుతారు. ఈ వారం మీరు అనుకున్న పనులు పూర్తి చేయడానికి పెద్దగా శ్రమ అవసరం లేదు. మీ  స్నేహితులు, కుటుంబం నుంచి పూర్తి మద్దతు పొందుతారు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు సీనియర్ల ఆశీస్సులు లభిస్తాయి. ఆర్థికంగా, మీరు ఈ వారం పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. మీరు గతంలో ఒక పథకంలో పెట్టుబడి పెట్టిన డబ్బు నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. వ్యాపారం బాగా సాగుతుంది. వారం ద్వితీయార్థంలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ప్రేమ భాగస్వామితో ఆహ్లాదకరమైన సమయాన్ని గడపడానికి అవకాశాలు లభిస్తాయి. శివారాధన మీకు మంచి చేస్తుంది. 

Published at : 07 May 2023 10:21 AM (IST) Tags: Weekly Horoscope Weekly Horoscope Aries horoscope may 8th to may 14th Weekly Horoscope Cancer Weekly Horoscope Gemini

సంబంధిత కథనాలు

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి  ఎప్పుడొచ్చింది,  ప్రత్యేకత ఏంటి!

Eruvaka Pournami 2023: ఏరువాక పున్నమి ఎప్పుడొచ్చింది, ప్రత్యేకత ఏంటి!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Nirjala Ekadashi 2023: మే 31 నిర్జల ఏకాదశి, అక్షయ తృతీయ కంటే ముఖ్యమైన రోజిది!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

Shukra Gochar 2023: నెల రోజుల పాటూ ఈ 4 రాశులవారికి అంత బాలేదు!

మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి

మే 31 రాశిఫలాలు, ఈ రాశులవారు శత్రువులపట్ల జాగ్రత్త వహించాలి

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం

టాప్ స్టోరీస్

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Gorantla Butchaiah Chowdary: సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినప్పుడల్లా అవినాష్ కేసుకు బ్రేకులు: గోరంట్ల బుచ్చయ్య సెటైర్లు

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Margadarsi Case: మార్గదర్శి కేసు: సీఐడీ లుక్‌అవుట్ నోటీసులపై హైకోర్టుకు శైలజా కిరణ్

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అంకురార్పణ - ఈ ఏడాది ఎన్ని అడుగులంటే ?

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!

Ugram OTT Release: ఓటీటీలోకి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ - స్ట్రీమింగ్ డేట్ ఇదే!