News
News
X

Vastu Tips: దేవుడి మందిరంలో విగ్రహాలొద్దు, బాత్రూంలో ఖాళీ బకెట్ ఉంచొద్దు-వాస్తు నిపుణులు ఇంకా ఏం చెప్పారంటే!

Vastu Tips: వాస్తుకి సంబంధించి చిన్న చిన్న విషయాలు పెద్దమార్పులను తీసుకొస్తాయి. వాస్తునిపుణులు చెప్పిన ఈ చిన్న చిట్కాలను చిటికెలో పాటించేయవచ్చు...

FOLLOW US: 

Vastu Tips: వాస్తు అనే రెండక్షరాల పదమే కానీ..అమ్మో అడుగువేసినా తీసినా సెంటిమెంట్స్ మాత్రం లెక్కలేనన్ని అంటారు వాస్తుని పట్టించుకునేవారు. బెడ్ రూమ్ నుంచి బాత్ రూమ్ వరకూ... కిచెన్ నుంచి దేవుడి మందిరం వరకూ అన్ని గదుల్లో ఉండాల్సినవి, ఉండకూడవిని అంటూ కొన్ని సూచనలు చేశారు వాస్తు నిపుణులు. ఎందుకంటే ఇంటి ఎంట్రన్స్ నుంచి లోపల అణువణువూ ముఖ్యమే. కేవలం లివింగ్ రూమ్, బెడ్ రూమ్ అందంగా, మీకు అనుగుణంగా సర్దుకుంటే సరిపోదు.. కిచెన్, బాత్రూమ్ కి సంబంధించి కూడా కొన్ని వాస్తుసూచనలున్నాయి.ఇప్పుడు చెప్పేవన్నీ చిన్న చిన్న మార్పులే కానీ చాలా మంచి ఫలితాలుంటాయంటారు వాస్తు నిపుణులు.

వంటగది కోసం వాస్తు చిట్కాలు

 • వాస్తు ప్రకారం నారింజ, పసుపు, ఆకుపచ్చ రంగులు వంటగదికి వేసుకోవడం మంచిది, నలుపు రంగు ఎప్పుడూ వేయరాదు
 • వంటగది ఎప్పుడూ ఇంటికి అగ్నిస్థానం అయిన ఆగ్నేయదిశలోనే ఉండాలి
 • నిప్పు - నీరు వ్యతిరేక మూలకాలు కాబట్టి... గ్యాస్ సిలిండర్ - వాష్‌బేసిన్‌లు వంటగదిలో ఒకే ప్లాట్‌ఫారమ్‌పై లేదా ఒకదానికొకటి సమాంతరంగా ఉంచకూడదు.

Also Read: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!

పూజ గదికి వాస్తు చిట్కాలు

 • పూజగది ఎల్లప్పుడూ ఈశాన్య దిశలో ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది...ఎందుకంటే సానుకూల శక్తి ఈ దిశలోనే కేంద్రీకృతమై ఉంది
 • పూజా స్థలం పడకగదిలో అస్సలు ఉండకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో పడకగదిలోనే దేవుడి మందిరం పెట్టాల్సి వస్తే ఆవైపు కాళ్లు పెట్టకుండా నిద్రించాలి
 • చనిపోయిన వ్యక్తుల ఫొటోలను ఇంట్లో పెట్టుకోవచ్చు కానీ దేవుడి మందిరంలో అస్సలు పెట్టకూడదు
 • దేవుడి విగ్రహాలను ఎప్పుడూ నేలపై ఉంచవద్దు. ఇంట్లో పెట్టుకునే విగ్రహం 10 అంగుళాల కంటే పొడవుగా ఉండకూడదు.

Also Read: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

బాత్రూమ్ కోసం వాస్తు చిట్కాలు

 • బాత్రూమ్ మీ ఇంటి ఉత్తరం వైపు  లేదా వాయువ్య భాగంలో ఉండాలి. బాత్ రూమ్స్ ని నైరుతి దిశలో నిర్మిస్తే ఆ ఇంట్లో ఉంటున్న వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది.
 • బాత్రూంలో అద్దాలు ఉత్తరం లేదా తూర్పు గోడపై ఉంచాలి
 • గీజర్స్ వంటి ఎలక్ట్రికల్ ఫిట్టింగులను ఆగ్నేయం వైపు ఉంచవచ్చు
 • బాత్రూమ్‌లో ఖాళీ బకెట్ ఉంచవద్దు: వాస్తు శాస్త్రం ప్రకారం, వాష్‌రూమ్‌లలో ఖాళీ బకెట్లను ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది
 • బాత్ రూమ్స్ లో నీలిరంగు బకెట్లు ఉంచడం మంచిదంటారు వాస్తుశాస్త్ర నిపుణులు.
 • అవకాశం ఉంటే బాత్రూమ్ టైల్స్ కూడా నీలిరంగువి వినియోగించడమే మంచిదంటారు.

Note: వాస్తునిపుణులు చెప్పినవి , పుస్తకాల ఆధారంగా తెలుసుకుని రాసిన విషయాలివి. వీటిని ఎంతవరకూ విశ్వసించవచ్చు అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.  

Published at : 07 Sep 2022 05:23 PM (IST) Tags: vastu shastra vastu remedies vastu tips for kitchen vastu tips for Puja mandir vastu tips For bathroom Vastu Tips for homes

సంబంధిత కథనాలు

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఏ దిశకు ఏ రంగులు వేస్తే మంచిది!

Vastu Tips: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!

Vastu Tips: గోడ గడియారం ఈ దిశగా ఉంటే నాశనమే, వాస్తు ప్రకారం ఎక్కడ ఉండాలి!

Vinayaka Chavithi 2022 : ఇలాంటి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే ఇంట్లో వాస్తుదోషాలుండవ్, అన్నింటా సక్సెస్ అవుతారు!

Vinayaka Chavithi 2022 : ఇలాంటి వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే ఇంట్లో వాస్తుదోషాలుండవ్, అన్నింటా సక్సెస్ అవుతారు!

Vastu Tips: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

Vastu Tips: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!

Vasthu Tips: భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయా? అయితే ఇంట్లో ఈ మార్పు చేయండి

Vasthu Tips: భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువవుతున్నాయా? అయితే ఇంట్లో ఈ మార్పు చేయండి

టాప్ స్టోరీస్

Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

Amaravati Vs Three Capitals : అమరావతికి పోటీగా మూడు రాజధానులపై విస్తృత ప్రచారం - వైఎస్ఆర్‌సీపీ స్ట్రాటజీ ప్రజల్లోకి వెళ్తుందా ? ప్రజల్ని కన్విన్స్ చేయగలుగుతారా ?

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

KCR National Party : జాతీయ పార్టీ ప్రకటనకు సర్వం సిద్ధం, హైదరాబాద్ చేరుకుంటున్న నేతలు

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Sri Rajarajeshwari Ashtakam: సకల విజయాలను అందించే అష్టకం, దసరా రోజు చదువుకుంటే మంచిది

Dussehra Ravan Dahan 2022: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!

Dussehra Ravan Dahan 2022: ఆ ముగ్గురిని నమ్మొద్దని లక్ష్మణుడికి చెప్పి కన్నుమూసిన రావణుడు!