Vastu Tips: మీ నక్షత్రం ప్రకారం మీ ఇల్లు ఏ ఫేసింగ్ ఉండాలి, అలా లేకపోతే ఏమవుతుంది!
అద్దె ఇల్లు వెతుక్కున్నప్పుడు,సొంతిల్లు చూసుకున్నప్పుడు ఇల్లు ఏ ఫేసింగ్ ఉందో చూసుకుంటారు.ఎక్కువ మంది ఈస్ట్ ఫేసింగ్ కే ఓటేస్తారు. అయితే మీరు ఏ ఫేసింగ్ ఇంట్లో ఉండాలన్నది మీ నక్షత్రం డిసైడ్ చేస్తుంది.
Vastu Tips: ఆరోగ్యం, ఆనందం, సంతానం, సంపద..ఇవన్నీ నివసించే ఇంటి వాస్తుపై ఆధారపడి ఉంటాయని విశ్వసిస్తారు. ఇంట్లో ప్రతి అడుగూ వాస్తు ప్రకారమే ఉండాలని భావిస్తారు. అయితే చాలామంది సింహద్వారం తూర్పువైపు ఉంటే మంచిదనే ఉద్దేశంతో తూర్పు ( ఈస్ట్) ఎంట్రన్స్ ఉండేలా చూసుకుంటారు. మరికొందరు ఉత్తరం ( నార్త్) కావాలి అనుకుంటారు. ఇంకొందరు పడమర ఫేసింగ్ ఉన్న ఇల్లు విశాలంగా ఉంటుందని భావిస్తారు. అయితే సింహద్వారం మీకు నచ్చినది కాదు...మీకు నప్పినది తీసుకోవాలి. వాస్తవానికి తూర్పు దిశ అందరికీ నప్పదనే విషయం మీకు తెలుసా?. మీ నక్షత్రాన్ని బట్టి సింహద్వారం దిశ మారుతుంది. మీకు నప్పే దిశవైపు సింహద్వారం ఉండేలా చూసుకుంటే ఇక మీకు తిరుగుండదంటారు వాస్తు పండితులు. ఇది కేవలం సొంతింటికి మాత్రమే అనుకుంటే పొరపాటే.. అద్దెకు ఉన్న ఇంటికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనం ఉండే అద్దె ఇంటి వాస్తు బావుంటే అది సొంతింటి కల నెరవేర్చుతుందని కూడా అంటారు. అద్దె ఇల్లే కదా అని మరీ పట్టించుకోకుండా ఉంటే ఆర్థికంగా ఎప్పటికీ ఎదుగుదల ఉండదని కూడా కొందరి నమ్మకం. ఇంతకీ మీ నక్షత్రం ప్రకారం ఏ దిశ ఉండే ఇల్లు తీసుకోవాలో చూసుకోండి...
ప్రతి నక్షత్రానికి రెండు దిక్కులు సూచించారు వాస్తుపండితులు. మొదట సూచించిన దిశ ప్రకారం ఇల్లు తీసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రెండో దిశను కూడా ఎంపిక చేసుకోచ్చు.
Also Read: ఆలయాల సమీపంలో ఇల్లుంటే ఏమవుతుంది, ఏ ఆలయానికి ఇల్లు ఎటువైపు ఉండాలి!
మీ నక్షత్రం ప్రకారం మీ ఇంటి ఫేసింగ్ ఎటువైపు ఉండాలంటే
అశ్విని: తూర్పు, పడమర
భరణి: తూర్పు, ఉత్తరం
కృత్తిక: తూర్పు, ఈశాన్యం
రోహిణి: తూర్పు, దక్షిణం
మృగశిర: దక్షిణం, ఉత్తరం
ఆరుద్ర: పడమర, దక్షిణం
పునర్వసు: ఉత్తరం, తూర్పు
పుష్యమి: పడమర, ఉత్తరం
ఆశ్లేష: తూర్పు, ఉత్తరం
మఖ:పడమర, ఉత్తరం
పుబ్బ: తూర్పు
ఉత్తర: తూర్పు, ఉత్తరం
హస్త: ఉత్తరం, తూర్పు
చిత్త: దక్షిణం, తూర్పు
స్వాతి: దక్షిణం, పడమర
విశాఖ: ఉత్తరం, తూర్పు
అనూరాధ:పడమర, ఉత్తరం
జ్యేష్ట: తూర్పు, ఉత్తరం
మూల: పడమర, దక్షిణం
పూర్వాషాడ:తూర్పు, దక్షిణం
ఉత్తరాషాడ:తూర్పు, ఉత్తరం
శ్రవణం: తూర్పు, దక్షిణం
ధనిష్ట: దక్షిణం, ఉత్తరం
శతభిషం: దక్షిణం, పడమర
పూర్వాభాద్ర:ఉత్తరం, తూర్పు
ఉత్తరాభాద్ర: పడమర, ఉత్తరం
రేవతి: ఉత్తరం, తూర్పు, ఈశాన్యం
Also Read: ఇంటి ద్వారం ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి
మీ నక్షత్రానికి సరిపడని దిశలో ఫేసింగ్ లో ఇల్లు తీసుకుంటే...ఆ ఇంట్లో ఎంత సంపాదించినా నిలవదు. చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్దతగాదాలు జరుగుతాయని, మనశ్సాంతి, ప్రశాంతత ఉండదంటారు వాస్తుపండితులు. భార్య-భర్త కు వ్యతిరేక దిశలుంటే ( ఉదాహరణకు: భర్తకు ఈస్ట్, నార్త్- భార్యకు వెస్ట్-సౌత్) ఏం చేయాలనే ఆలోచన రావొచ్చు... అలాంటప్పుడు ఇంటి యజమానిని నప్పిన దిశే ముఖ్యం...అందుకే వారికి నప్పే దిశ ఉన్న ఇంటిని ఎంపిక చేసుకోవాలి. లేదంటే భార్య పేరుపై ఇల్లు రిజిస్ట్రేషన్ చేసినట్టైతే ఆమెకు నప్పిన ఫేసింగ్ ఉన్న ఇల్లు ఎంపిక చేసుకోవచ్చు. ఏదేమైనా గృహమే కదా స్వర్గసీమ అంటారు...అందుకే ఇల్లు ప్రశాంతంగా ఉంటే అంతకుమించిన ఆనందం ఏముంటుంది.
నోట్: కొన్ని పుస్తకాలు, వాస్తుపండితుల సూచనల ఆధారంగా రాసిన వివరాలివి. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...
Also Read: ఇంటి ద్వారానికి ఎదురుగా ఇలాంటి ఫొటోలు పెడుతున్నారా, అయితే ఈ మార్పులు చేయాల్సిందే