Image Credit: Freepik
Weekly Horoscope 08-14 May 2023: మే నెలలో రెండో వారం ఈ రాశులు కొంత జాగ్రత్తగా మసలుకోవాలి
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. జీవితంలో కొన్ని ఆకస్మిక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో, మీరు అవసరానికి మించి విశ్వసించే వ్యక్తుల వల్ల నిరాశ చెందుతారు. అనుకున్న సమయానికి పని పూర్తవదు. ఉద్యోగులకు వారం ప్రారంభంలో అధిక పనిభారం ఉండవచ్చు కానీ వారం చివరినాటికి పరిస్థితి అదుపులోకి వస్తుంది. వ్యాపారులకు ఈ వారం వ్యాపారంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి. మార్కెట్లో మీ విశ్వసనీయతను కాపాడుకోవడానికి పోటీదారులతో గట్టిగానే పోటీ పడాల్సి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారికి బాగానే ఉంటుంది. ఈ వారం ప్రేమ వ్యవహారాల్లో ఆలోచించి ముందడుగు వేయవలసి ఉంటుంది. జీవితంలో ఎదులయ్యే క్లిష్ట సమయాల్లో మీ జీవిత భాగస్వామి మద్దతుగా ఉంటారు. ప్రతిరోజూ శివుడిని ఆరాధించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ వారం ఓ మోస్తరుగా లాభదాయకంగా ఉంటుంది. ఈ వారం మీరు మీ తెలివితేటలు, మాటని సరిగ్గా ఉపయోగించుకోవాలి. పని ప్రాంతంలో వ్యక్తులతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించండి. చిన్న చిన్న విషయాలను విస్మరించడమే మంచిది. ఉద్యోగులు ఈవారం తమ పనిని సకాలంలో పూర్తి చేయడానికి మరింత శ్రమించాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా పనిభారం, బాధ్యతల భారం పెరగడం వల్ల మానసిక, శారీరక అలసటకు గురవుతారు. నిరుద్యోగులకు మరికొంతకాలం నిరీక్షణ తప్పదు. ప్రేమ వ్యవహారాలు పెద్దగా కలసిరావు. మీ జీవితంలో మూడో వ్యక్తి జోక్యం ఇబ్బందులు తీసుకొస్తుంది. ఆర్థికపరంగా చూస్తే ఈ వారం పెద్దగా ఆదాయం పెరిగే సూచనలు లేవు. దుర్గాదేవిని పూజించండి.
Also Read: మరణానంతరం ఆత్మ ప్రయాణం ఇలా సాగుతుంది!
తులా రాశి
తులా రాశి జాతకులకు ఈ వారం మిశ్రమ ఫలితాలున్నాయి. మీ శ్రేయోభిలాషులను సంప్రదించకుండా వృత్తి, వ్యాపారానికి సంబంధించిన ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు వారం ప్రారంభంలో కొంత ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీకు శారీరక మరియు మానసిక అలసట ఉంటుంది. అకస్మాత్తుగా వేరే డిపార్ట్ మెంట్ లేదా ప్రదేశానికి బదిలీ కావడం వల్ల మీ మనసు కాస్త విచారంగా ఉంటుంది. వ్యాపారంతో సంబంధం ఉన్నవారు వారం ప్రారంభంలో మాంద్యం ఎదుర్కొంటారు, కానీ వారం ద్వితీయార్ధంలో మంచి లాభం ఉంటుంది. పరీక్ష-పోటీకి సిద్ధమవుతున్న విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ బంధంలో ఏదో విషయంలో ప్రేమ భాగస్వామితో వివాదం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి మనసు కాస్త ఆందోళన చెందుతుంది. ప్రతిరోజూ శివుడిని ఆరాధించండి.
వృశ్చిక రాశి
ఈ వారం వృశ్చిక రాశి వారికి కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో గృహ, వ్యాపారాలకు సంబంధించిన సమస్యలు ఆందోళన కలిగిస్తాయి. ఒక పనిలో జాప్యం మీలో కోపాన్ని పెంచుతుంది. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధి మళ్లీ బయటపడే ప్రమాదం ఉంది. వ్యాపారంలో మందగమనం ఉండవచ్చు. మార్కెట్ లో డబ్బు చిక్కుకోవడం వల్ల మనసు ఆందోళన చెందుతుంది. ఉద్యోగస్తులు తమ సీనియర్లు, జూనియర్లను కలుపుకుని ముందడుగు వేయాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాల పరంగా ఈ వారం మామూలుగా ఉండబోతోంది. జీవితంలో క్లిష్ట సమయాల్లో మీ భాగస్వామి మీకు అండగా ఉంటారు. ప్రతిరోజూ హనుమంతుడిని ఆరాధించండి .
Also Read: మే 8 నుంచి 14 వీక్లీ రాశిఫలాలు, ఈ 6 రాశులవారికి ఆర్థికలాభం, వ్యవహారజయం
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం ఏ పనినైనా చాలా తెలివిగా చేయాల్సి ఉంటుంది..లేదంటే ఆర్థికంగా నష్టోతారు. ఈ వారం మీరు మీ పనిప్రాంతంలో మిమ్మల్ని ప్రలోభపెట్టడానికి ప్రయత్నించే వ్యక్తుల నుంచి దూరం పాటించాలి. మీ ప్రత్యర్థులతో చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టులో ఏదైనా కేసు నడుస్తుంటే తప్పుడు మార్గంలో పరిష్కరించుకోవద్దు..రాజీ పడటం ద్వారా జీవితంలో ముందుకు సాగడానికి ప్రయత్నించండి. ఉద్యోగం చేసే మహిళలు ఈ వారం తమ పని మరియు ఇంటి మధ్య సమన్వయం చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. యువత ఎక్కువ సమయం సరదాగా గడుపుతారు. వారం ద్వితీయార్ధంలో, అకస్మాత్తుగా పెద్ద ఖర్చు మీ బడ్జెట్ ను గందరగోళంగా మారుస్తుంది. ప్రేమ వ్యవహారంలో ఏదో విషయంలో ప్రేమ భాగస్వామితో అభిప్రాయభేదాలు ఉండవచ్చు. మాట్లాడి సమస్యను పరిష్కరించుకోవడం మంచిది. ప్రతిరోజూ హనుమంతుడిని ఆరాధించండి.
మీన రాశి
ఈ రాశివారు ఈ వారం తమ వృత్తి లేదా వ్యాపారంలో మార్పు గురించి ఆలోచిస్తుంటే జాగ్రత్తగా అడుగేయాలి. తొందరపడి నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత బాధపడక తప్పదు. ఉద్యోగస్తులు వారం ప్రారంభంలో అధిక పని కారణంగా శారీరక, మానసిక అలసటకు గురవుతారు. పూర్వీకుల ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు ఎదురవుతాయి. వారం మధ్యలో, ఏదైనా ఆరోగ్య సంబంధిత సమస్య కారణంగా, మీ మనస్సు కొద్దిగా కలత చెందుతుంది. వారం ద్వితీయార్ధం నాటికి మీరు దానిలో చాలా మెరుగుదల చూడవచ్చు. ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించండి. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం మీ జీవిత భాగస్వామితో మాట్లాడే విధానం మార్చుకోండి. వాదనలకు దూరంగా ఉండండి. ప్రేమ సంబంధంలో జాగ్రత్తగా ఒక అడుగు ముందుకు వేయండి. ప్రతిరోజూ విష్ణువును ఆరాధించండి మరియు అరటి చెట్టుకు నీటిని సమర్పించండి.
Laxmi Yog:ఈ రాశులవారికి ఈ రోజు(మే 30) నుంచి లక్ష్మీయోగం
Ganga Dussehra 2023: పది రకాల పాపాలను తొలగించే రోజు దశపాపహర దశమి ప్రత్యేకత ఇదే!
మే 30 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారు ఎవర్నీ అతిగా నమ్మొద్దు
మే 29 రాశిఫలాలు, ఈ రాశులవారు ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు
Weekly Horoscope 29 May to 04 June: జూన్ మొదటివారం ఈ రాశులవారికి ఆస్తులు కలిసొచ్చే అవకాశం ఉంది!
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
AP Cabinet Meeting : ఏడో తేదీన ఏపీ కేబినెట్ భేటీ - ముందస్తు నిర్ణయాలుంటాయా ?
కాంగ్రెస్‌లోకి జూపల్లి, పొంగులేటి- సంకేతాలు ఇచ్చిన ఈటల !
NBK 108 Movie Title : బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా టైటిల్ 'బ్రో' కాదు - బర్త్ డే గిఫ్ట్ రెడీ!
Shaitan Web Series : గేరు మార్చిన మహి - కామెడీ కాదు, సీరియస్ క్రైమ్ గురూ!