అన్వేషించండి

Top Headlines Today: ఎన్నికల ముందు కత్తిపోట్లు ఎంత వరకు కరెక్ట్‌? చంద్రబాబుపై ఆగని కేసుల పర్వం- టాప్‌ టెన్ న్యూస్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

Top 10 Headlines Today:

రక్త రాజకీయం 

భారత రాష్ట్ర సమితి ఎంపీ, దుబ్బాక నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై రాజు అనే వ్యక్తి కత్తితో దాడి చేయడం సంచలనంగా మారింది. మొదట కారులో గజ్వేల్ ఆస్పత్రికి ఆ తర్వాత సికింద్రాబాద్ యశోదాకు తరలించారు. దాడి చేసిన వ్యక్తి కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లిన వ్యక్తి అని మంత్రి మల్లారెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కండువా వేసుకున్న ఫోటోను  ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్ రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారు. కానీ ఆ ఫోటోలో ఉన్నది దాడి చేసిన వ్యక్తి కాదని..  తానేననిఓ వ్యక్తి మీడియాకు  మొరపెట్టుకున్నారు. మంత్రి హరీష్ రావు రాజకీయ కుట్ర ఉందన్నారు. సీఎం కేసీఆర్ మరింత ముందుకు వెళ్లి తమను ఎదుర్కోలేక దాడులు చేస్తున్నరని.. ప్రజలంతా  తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నేతల స్పందనతో ఇది రాజకీయం అయిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చంద్రబాబుపై మరో కేసు

చంద్రబాబుపై ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం మరో కేసు పెట్టింది. ఇప్పటికే వివిధ రకాల కేసులు నమోదు చేసిన సీఐడీ అధికారులు తాజాగా మధ్యం విషయంలో మరో కేసు పెట్టారు. టీడీపీ హాయాంలో లిక్కర్ కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారని సీఐడీ ఆరోపిస్తోంది. దీనిపైనే పీసీ (ప్రివెన్షన్ ఆఫ్ కరెప్షన్) చట్టం కింద చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబును ఏ - 3గా చేర్చారు. ఈ కేసు చంద్రబాబుపై నమోదు చేసిన విషయాన్ని ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలిపారు. ఏసీబీ కోర్టులో కేసుకు సంబంధించి విచారణ చేయాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు అనుమతించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్

ఎన్నికల ప్రచారంలో పాల్గొని కత్తి దాడికి గురైన బీఆర్ఎస్ నేత, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదలైంది. ప్రభాకర్ రెడ్డికి పొట్ట కుడి భాగంలో 6సెం.మీ మేర కత్తిగాటు పడిందని యశోద ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. సరైన సమయంలో ఆసుపత్రికి తీసుకురావడంతో ప్రాణాపాయం తప్పిందన్నారు. సీటీ స్కాన్‌ చేయగా.. శరీరం లోపల బ్లీడింగ్‌ (Internal Bleeding) అవుతున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా హాస్పిటల్ కు తీసుకురావడంతో ఇన్ ఫెక్షన్ ప్రమాదం తప్పిందన్నారు. అయితే బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి మరో 10 రోజుల వరకు హాస్పిటల్ లోనే ఉండాలని యశోద ఆసుపత్రి డాక్టర్లు ఆయనకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

టీడీపీకి భారీ షాక్

పదవికి రాజీనామా చేయడంపై తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పందించారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయకపోవడం పట్ల.. తాను పార్టీలో ఉండి క్యాడర్ కు న్యాయం చేయలేనని అన్నారు. అందుకే టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. రేపు తన క్యాడర్ ను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. తెలంగాణలో ఎందుకు పోటీ చేయడం లేదనేది చంద్రబాబు చెప్పడం లేదని అన్నారు. లోకేశ్ ని అడిగితే చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నారని.. ఇక్కడ ఎం జరుగుతుందో ఆయనకు పట్టింపు లేదని అన్నారు. ఆంధ్రలో టీడీపీ జనసేనతో పొత్తు ఉంటే.. తెలంగాణలో జనసేన, బీజేపీ పొత్తు ఉండడం.. ఇదేం బొమ్మలాట అని తప్పుబట్టారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

యూనివర్సిటీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 20 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నవంబరు 27లోపు దరఖాస్తు హార్డ్‌కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

డైలమాలో బీజేపీ 

 తెలంగాణ బీజేపీ ఇప్పటి వరకూ రెండు జాబితాలు ప్రకటించింది. 119 స్థానాలకు గాను 53 మంది అభ్యర్థుల్ని ప్రకటించారు. ఇంకా 66 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించాలి. కానీ కసరత్తు ఏ మేరకు జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు.  ఓ వైపు జనసేనతో పొత్తు వల్ల  కొత్త తలనొప్పులు వచ్చిపడ్డాయి. కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సెగ్మెంట్లను ఇవ్వాలని జనసేన కోరుతోంది. ఈ సెగ్మెంట్లను వదులుకోవద్దని బీజేపీ నేతలు పట్టుబట్టుతున్నారు. స్థానిక కమలం నేతల ఆందోళన నిరసన రూపం దాల్చింది. దీంతో బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్రస్థాయిలో ఒత్తిడి పెరిగింది.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఈశాన్య వర్షాలు 

ఈ రోజు కింది స్థాయిలోని గాలులు వాయువ్య, ఉత్తర దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి తెలంగాణ రాష్ట్రంలో  పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

అఫ్గాన్‌ సంచలనాలు

భారత్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్‌లో అఫ్గాన్‌ సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ మహా సంగ్రామంలో తొలుత డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ను ఓడించిన అఫ్గానిస్థాన్‌....పాకిస్తాన్‌ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో మట్టికరిపించింది. ఇప్పుడు శ్రీలంకను కూడా చిత్తు చేసి సెమీఫైనల్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. తమ వరుస విజయాలు గాలివాటం కాదని నిరూపిస్తూ శ్రీలంకపై ఘన విజయం సాధించింది. ఏదో అగ్ర జట్టు లక్ష్యాన్ని ఛేదిస్తున్నట్లు సునాయసంగా గెలిచేసింది. అఫ్గాన్ చేతిలో ఓటమితో ప్రపంచకప్‌లో లంకేయుల సెమీస్‌ అవకాశాలకు తెరపడింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్ఘానిస్థాన్‌ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక  49.3 ఓవర్లలో 241 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 242 పరుగుల లక్ష్యంతో  బరిలోకి దిగిన అఫ్గాన్‌...  45.2 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని చేధించింది. ఈ విజయంతో అఫ్గాన్ సెమీస్‌ అవకాశాలు సజీవంగా ఉండగా... లంక ఆశలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ టీజర్‌

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, 'డేంజర్‌ పిల్లా' లిరికల్ సాంగ్‌ కు ఆడియన్స్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మూవీ టీజర్ ను లాంచ్ చేసారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

నిబ్బా నిబ్బి స్టోరీస్ 

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన 'బేబీ'(Baby) సినిమా రీసెంట్ టైమ్స్​లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడు సాయి రాజేష్ నిర్మాత SKN పేర్లు ఇండస్ట్రీలో మార్మోగిపోయాయి. ముఖ్యంగా సాయి రాజేష్ కి దర్శకుడిగా ఈ చిత్రంతో భారీ గుర్తింపు వచ్చింది. బేబీకి ఈ రేంజ్ సక్సెస్ వస్తుందని సాయి రాజేష్ కూడా ఊహించి ఉండడేమో. అంతలా ఈ సినిమాని ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. ఇక ఈ సినిమా సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో దర్శకుడు సాయి రాజేష్ ప్రొడ్యూసర్ SKN కొత్త సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా యంగ్ హీరో సంతోష్ శోభన్​తో ఓ సినిమాను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్రట్రంప్ ఎన్నికతో మస్క్ ఫుల్ హ్యాపీ! మరి కూతురికి భయమెందుకు?ఉడ్‌బీ సీఎం అని  లోకేశ్ ప్రచారం - అంబటి రాంబాబుఅధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
జనం గుండెల్లో తెలుగు తేజం శ్రీ'నివాసం' - ఆ కుటుంబాన్ని కలవనున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
KCR News: ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు - మళ్లీ మనమే అధికారంలోకి: కేసీఆర్
Game Changer Teaser: ‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
‘అయాం అన్‌ప్రిడిక్టబుల్’ - మెగా ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్ ఇచ్చిన శంకర్!
AP Cabinet: ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
ఈ నెల 11న ఏపీ కేబినెట్ ప్రత్యేక భేటీ - బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం
Hyderabad News: భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
భాగ్యనగర వాసులకు అలర్ట్ - ఈ నెల 11న ఈ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా బంద్
Royal Enfield Flying Flea C6: మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
మొదటి ఎలక్ట్రిక్ బైక్‌ను పరిచయం చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ - లాంచ్ ఎప్పుడంటే?
Pawan Kalyan: ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
ఆ కుటుంబాలకు పవన్ కళ్యాణ్ క్షమాపణ, సొంత ట్రస్ట్ నుంచి రూ. 2 లక్షల సాయం
Lucky Car: 1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
1500 మంది అతిథులు, రూ.4 లక్షల ఖర్చు - అదృష్టం తెచ్చిన కారుకు అంత్యక్రియలు
Embed widget