అన్వేషించండి

AP University Vacancies: ఏపీలోని యూనివర్సిటీల్లో 3,220 టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల - వివరాలు ఇలా

ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు.

AP University Jobs: ఏపీలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అక్టోబరు 30న నోటిఫికేషన్లు వెలువడ్డాయి. యూనివర్సిటీలవారీగా నోటిఫికేషన్లను విడుదల చేశారు. వీటిద్వారా రాష్ట్రంలోని మొత్తం 18 విశ్వవిద్యాలయాల్లో 3,220 పోస్టులను భర్తీ చేయనున్నారు. బ్యాక్‌లాగ్ పోస్టులతోపాటు రెగ్యులర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. వీటిలో బ్యాక్‌లాగ్ పోస్టులు 278, రెగ్యులర్ పోస్టులు 2942 ఉన్నాయి. వీటిలో ప్రొఫెసర్ 418 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్ 801  పోస్టులు, ట్రిపుల్ ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2,001 ఉన్నాయి.

పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలున్నవారు ఆన్‌లైన్ ద్వారా నవంబరు 20న సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. నవంబరు 27లోపు దరఖాస్తు హార్డ్‌కాపీలను సమర్పించాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా నియామకాలు చేపడతారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం సహాయ ఆచార్యుల స్క్రీనింగ్ పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను 30న వర్సిటీలు ప్రకటిస్తాయి. వీటిపై డిసెంబరు 7 వరకు అభ్యంతరాలను స్వీకరించి, డిసెంబరు 8న తుది జాబితాను ప్రకటిస్తాయి. స్క్రీనింగ్ పరీక్షను ఏపీపీఎస్సీ నిర్వహించనుంది. 

పోస్టుల భర్తీకి 2017, 2018ల్లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను హైకోర్టు రద్దు చేసినందున కొత్త నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వర్సిటీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున కోర్టు తీర్పునకు లోబడి నియామక ప్రక్రియ ఉంటుందని వెల్లడించాయి. వర్సిటీ యూనిట్‌గా కొత్తగా రిజర్వేషన్ రోస్టర్ పాయింట్లతో పోస్టులను ప్రకటించాయి. అసోసియేట్ ఆచార్యులు, ప్రొఫెసర్ పోస్టులకు ఉమ్మడి పరీక్ష ఉండదు. విశ్వవిద్యాలయాల స్థాయిలోనే నియామకాలు చేపడతారు. 

వివరాలు..

ఖాళీల సంఖ్య: 3220 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్: 2001 పోస్టులు

అసోసియేట్ ప్రొఫెసర్: 801 పోస్టులు

ప్రొఫెసర్: 418 పోస్టులు

యూనివర్సిటీలవారీగా ఖాళీల వివరాలు..

క్రమ సంఖ్య యూనివర్సిటీ ఖాళీల సంఖ్య
1. ఆంధ్రయూనివర్సిటీ (AU) 523
2. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)  265
3. ఆచార్య శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ (ANU) 175
4. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ (SKU) 219
5. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ (AKNU)  99
6. యోగివేమన యూనివర్సిటీ (YVU)  118
7. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ (Dr.BRAU)  99
8. విక్రమ సింహపురి యూనివర్సిటీ (VSU)  106
9. కృష్ణా యూనివర్సిటీ (KRU)  86
10. రాయలసీమ యూనివర్సిటీ (RU)  103
11. జేఎన్‌టీయూ కాకినాడ (JNTU K)  98
12. జేఎన్‌టీయూ అనంతపురం (JNTU A)  203
13. జేఎన్‌టీయూ అనంతపురం (JNTU GV)  138
14. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (SPMVV)  103
15. ద్రవీడియన్ యూనివర్సిటీ (DU) 24
16. డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ (Dr.AHUU) 63
17. డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ (Dr.YSRA&F) 138
18. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్-ఏపీ (RGUKT) 660
  మొత్తం ఖాళీలు 3220

అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రితోపాటు, పీహెచ్‌డీ ఉండాలి. లేదా యూజీసీ నెట్/ ఏపీ స్లెట్/ఏపీసెట్ అర్హత ఉండాలి. అకడమిక్/రిసెర్చ్ అనుభవం, పబ్లికేషన్స్ ఉండాలి. లేదా పీహెచ్‌డీతోపాటు GATE / GPAT / CEED అర్హత ఉన్నవారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హులు.

దరఖాస్తు ఫీజు..

➥ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.2500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.2000 చెల్లించాలి. ఓవర్‌సీస్ అభ్యర్థులు 50 అమెరికన్ డాలర్లు లేదా రూ.4200 చెల్లించాల్సి ఉంటుంది. ఒకటికంటే ఎక్కువ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేవారు వేర్వేరుగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

➥ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3000. ఓవర్‌సీస్ అభ్యర్థులు 100 అమెరికన్ డాలర్లు లేదా రూ.8,400 చెల్లించాల్సి ఉంటుంది.

➥ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.3000. ఓవర్‌సీస్ అభ్యర్థులు 150 అమెరికన్ డాలర్లు లేదా రూ.12,600 చెల్లించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా. దరఖాస్తు హార్డ్ కాపీలను సంబంధిత చిరునామాకు నిర్ణీత గడువులోగా చేరేలా పంపాలి.

ఎంపిక విధానం: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

పరీక్ష విధానం..
స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 బహుళైచ్ఛిక ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు, ఒక తప్పునకు ఒక మైనస్ మార్కు ఉంటుంది. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

జీతం..

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.57,700 - రూ.1,82,400;

అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,31,400 - రూ.2,17,100;

ప్రొఫెసర్ పోస్టులకు నెలకు రూ.1,44,200 - రూ.2,18,200 చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు..

➥ నోటిఫికేషన్ల వెల్లడి: 30.10.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 30.10.2023.

➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.11.2023.

➥ దరఖాస్తు హార్డ్ కాపీల సమర్పణకు చివరితేది: 27.11.2023.

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక జాబితా వెల్లడి: 30.11.2023.

➥ ప్రాథమిక జాబితాపై అభ్యంతరాల స్వీకరణకు చివరితేది: 07.12.2023.

➥ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల తుది ఎంపిక జాబితా వెల్లడి: 08.12.2023.

Notifications

Online Application

                     

మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kithampeta Village No Diwali Celebrations |  70ఏళ్లుగా దీపావళి పండుగకు దూరమైన కిత్తంపేట | ABP DesamKTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP DesamEngland Players Not Retained by IPL Franchises | ఇంగ్లండ్ ప్లేయర్లకు ఫ్రాంచైజీలు ఝలక్ | ABP Desamఇజ్రాయేల్‌లో భారీ సైరన్‌ల మోత, వెంటనే పేలుళ్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth To Modi: మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
మోడీగారూ మీరు చెప్పేవన్నీ అబద్దాలే ఇవిగో నిజాలు - తెలంగాణ సీఎం రేవంత్ రిప్లై వైరల్
Andhra Pradesh News: మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
మంచి రోజులు వచ్చాయి- మంచి రోడ్లు వస్తాయి- కానీ ప్రజలు చేయాల్సింది ఒక్కటే: చంద్రబాబు 
Prashant Kishor: నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
నా ఫీజు వంద కోట్లు - ప్రశాంత్ కిషోర్ సంచలన ప్రకటన !
Matka Trailer: వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
వరుణ్ తేజ్ గట్టిగా కొట్టేలా ఉన్నాడే... మట్కా ట్రైలర్ వచ్చిందిరోయ్, చూశారా?
Tirupati News: తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
తిరుపతిలో చాక్లెట్ల ఆశ చూపి చిన్నారిపై అఘాయిత్యం- సీఎం, హోంమంత్రి దిగ్భ్రాంతి- బాధితులకు సాయం ప్రకటన
Saving Ideas: రూల్‌ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్‌ ఛేంజర్‌' ఇది
రూల్‌ 50:30:20 గురించి తెలుసా?, మీ జీవితాన్ని కలర్‌ఫుల్‌గా మార్చే 'గేమ్‌ ఛేంజర్‌' ఇది
Blue Aadhaar Card: బ్లూ కలర్‌ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్‌ చేసుకోండి
బ్లూ కలర్‌ ఆధార్ కార్డ్ కావాలా? - మీకు వస్తుందో, రాదో ఇక్కడ చెక్‌ చేసుకోండి
Pushpa 2 Item Song: శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!
శ్రద్ధా కపూర్, సమంత కాదు... అల్లు అర్జున్ 'పుష్ప 2' ఐటమ్ సాంగ్ చేసేది ఈ అమ్మాయే!
Embed widget