అన్వేషించండి

Extra Ordinary Man Teaser:'బాహుబలి' సినిమాలో నితిన్ ఆ సీన్​లో ఉన్నాడట, ఫన్నీగా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్!

నితిన్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’. డిసెంబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా టీజర్​ను తాజాగా విడుదల చేశారు.

యూత్ స్టార్ నితిన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’. రైటర్ కమ్ డైరెక్టర్ వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. సీనియర్ హీరో యాంగ్రీ మ్యాన్ డా. రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, 'డేంజర్‌ పిల్లా' లిరికల్ సాంగ్‌ కు ఆడియన్స్ ను మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా మూవీ టీజర్ ను లాంచ్ చేసారు. 

'భయ్యా.. ఈ కథ మామూలు కథ కాదు భయ్యా. రియల్ ఇన్సిడెంట్స్ చూసి రాసుకున్న కథ' అనే వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్ ఆద్యంతం ఫన్నీగా సాగింది. కార్ ఛేజింగులు, భారీ యాక్షన్ సీన్స్ తో ఒక పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్నాడని అనుకునే విధంగా నితిన్ ని చూపించారు. అయితే 'అసలు బ్యాగ్రౌండ్ ఏంటా?' అని ఎంక్వైరీ చేస్తే.. అతను సినిమాల్లో బ్యాగ్రౌండ్​లో నిలబడే ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ అనే విషయాన్ని రివీల్ చేసి నవ్వించారు. 

“నువ్వు కొబ్బరిమట్ట సినిమాలో ఉన్నావ్ కదా” అని హీరోయిన్ శ్రీలీల నితిన్ తో అనడం.. ''బాహుబలి చూశావా? వాళ్ళల్లో ఆరో లైన్లో ఏడో వాడు ఎవడో తెలుసా?'' అని సంపత్‍ తో నితిన్ అనడం నవ్వులు పూయింస్తోంది. అప్పుడు 'దండాలయ్య' పాటలో ప్రభాస్ - అనుష్కల ముందు నిలబడి ఉన్న జనాల గుంపులో ఒకడిగా, నితిన్ దండం పెడుతూ కనిపించడం టీజర్ లో హైలైట్ గా నిలిచింది. అలానే ఇందులో నితిన్, అతని తండ్రిగా నటించిన రావు రమేశ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా నవ్విస్తాయి. 

"రేయ్.. నువ్ ఒక జూనియర్ ఆర్టిస్ట్ గాడివి. అంటే ఎక్స్‌ట్రా గాడివి. ఒక ఆర్డినరీ గాడికి ఎందుకురా ఇన్ని ఎక్స్‌ట్రాలు'' అని రావు రమేశ్ వెటకారం చేయగా.. నితిన్ ఫేస్ ప్యాక్ చేసుకుంటూ అలా సింగిల్ సింగిల్ లా కాకుండా, మింగిల్ చేసి చూస్తే ఎక్స్‌ట్రార్డినరీ అవుతుందని చెప్పి టైటిల్ కు జస్టిఫికేషన్ ఇస్తాడు. ''కొడుడు.. చెత్త.. చెత్త నా కొడుకు'' అంటూ రావు రమేశ్ చెత్త బుట్టను తన్నడంతో ఈ 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' టీజర్ ముగిసింది.

ఒక ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ ఎలా ఎక్స్‌ట్రార్డినరీ మ్యాన్ అయ్యాడనేది ఈ సినిమాలో దర్శకుడు వక్కంతం వంశీ తన మార్క్ ఫన్నీ రైటింగ్ తో చూపించబోతున్నాడని తెలుస్తోంది. నితిన్ జూనియర్ ఆర్టిస్ట్ కావడంతో డిఫెరెంట్ గెటప్స్ లో కనిపిస్తాడని అర్థమవుతోంది. శ్రీలీల ఎప్పటిలాగే అందంగా కనిపించింది. తొలిసారిగా కలిసి నటిస్తున్న నితిన్ - శ్రీలీల జోడీ బాగుంది. ఈ టీజర్ లో రాజశేఖర్ ను భాగం చెయ్యలేదు. 

ఓవరాల్ గా ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’ టీజర్ చూస్తుంటే, ఈసారి నితిన్ తనకు హిట్టిచ్చిన 'భీష్మ' తరహా కామెడీ ఎంటర్టైనర్ తో రాబోతున్నాడనిపిస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ హ్యారిస్ జైరాజ్ చాలా గ్యాప్ తర్వాత తెలుగులో సంగీతం సమకూరుస్తున్న సినిమా ఇది. యువరాజ్, ఆర్థర్ విల్సన్, సాయి శ్రీరామ్ వంటి ముగ్గురు సినిమాటోగ్రాఫర్స్ ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనింగ్ చేయగా, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సినిమాలో సుదేవ్ నాయర్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్ర, హైపర్ ఆది, హరి తేజ, రవివర్మ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

ఆదిత్య మూవీస్ సమర్పణలో నితిన్ హోం బ్యానర్‌ శ్రేష్ఠ్‌ మూవీస్‌ పై సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి కలిసి ‘ఎక్స్‌ట్రా - ఆర్డినరీ మ్యాన్’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2023 డిసెంబర్ 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం వక్కంతం వంశీ, నితిన్ ఇద్దరూ ప్లాపుల్లో ఉన్నారు. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో చూడాలి. 

Also Read: ‘బిగ్ బాస్’ బ్యూటీ హీరోయిన్‌గా ‘బేబీ’ మేకర్స్ కొత్త సినిమా - క్లాప్ కొట్టిన నాగచైతన్య

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ustad Zakir Hussain Passed Away: తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
తబలా వాద్యకారుడు జాకీర్‌ హుస్సేన్‌ కన్నుమూత, అమెరికాలో దిగ్గజం అస్తమయం
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ ఫిక్స్ - ఇంతకీ గెలిచింది ఎవరు?
Allu Arjun: శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
శ్రీ తేజ్‌ను కలవలేకపోతున్నాను, కానీ అండగా ఉంటా: అల్లు అర్జున్‌ పోస్టు వైరల్
Best Chess Apps: ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
ఆన్‌లైన్‌లో బెస్ట్ ఫ్రీ చెస్ యాప్స్ ఇవే - టాప్-5 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?
TSPSC Group 2 Exam: సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
సెల్ ఫోన్‌తో గ్రూప్ 2 ఎగ్జామ్ రాస్తూ దొరికిన అభ్యర్థి, ఇన్విజిలేటర్ షాక్!
Manchu Manoj Vs Manchu Vishnu: మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
మంచు ఫ్యామిలీలో పంచదార పంచాయితీ - హత్యకు కుట్ర జరుగుతోందని విష్ణుపై మనోజ్ తీవ్ర విమర్శలు 
YSRCP On One Nation One Election: 2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
2027లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు - వైసీపీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి: విజయసాయిరెడ్డి
Telangana Latest News : తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణలో భూమిలేని పేదలకు గుడ్ న్యూస్- 12 వేలు ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్
Embed widget