News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Top 10 Headlines Today: ఆసక్తికరంగా సిక్కోలు పార్లమెంట్‌ సీట్‌- ఏ కూటమిలో కూడా లేమంటున్న కేసీఆర్

Top 10 Headlines Today: నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ అంతర్జాతీయ వ్యాప్తంగా జరిగిన ముఖ్యమైన వార్తలు మీకోసం

FOLLOW US: 
Share:

Top 10 Headlines Today: 

రామ్మోహన్‌కు ప్రత్యర్థి ఎవరు?

సిక్కోలు పార్లమెంట్‌ సీట్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. గత ఎన్నికల్లో వైసీపీ హవాను తట్టుకొని మూడు ఎంపీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. అందులో సీట్లలో ఒకటి శ్రీకాకుళం. అయితే కింజరాపు కుటుంబానికి కంచుకోటగా మారిన శ్రీకాకుళంలో ఎలాగైనా వైసీపీ జెండా ఎగరేయాలని చూస్తున్నారు సీఎం జగన్. గత రెండు ఎన్నికల్లో ఎదురైన పరాజయంపై ప్రతీకారం తీర్చుకునేలా ప్లాన్ చేస్తున్నారు. సామాజిక సమీకరణాల లెక్కలు తీస్తూ కింజరాపు కుటుంబ హవాకు  చెక్ పెట్టాలని చూస్తున్నారు. అలాంటి నేత కోసం జల్లెడ పడుతున్నారట జగన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

రెండింటివైపు కూడా లేం: కేసీఆర్

ఇండియా లేదా ఎన్‌డీఏలో ఎవరి పక్షాన కూడా భారత్‌ రాష్ట్ర సమితి ఉండబోదని స్పష్టం చేశారు బీఆర్‌ఎస్‌ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌. బీఆర్‌ఎస్‌ ఒక్కటిగా లేదని చాలా పార్టీలు తమతో కలిసి వస్తాయన్నారు.  మహారాష్ట్ర పర్యటనలో మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ చాలా విషయాలపై స్పందించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

తేలికపాటి వర్షాలు

‘‘ఈ రోజు దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణ రాష్ట్రము వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో  తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది’’ అని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (ఆగస్టు 1) ఓ ప్రకటనలో వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

కేటీఆర్‌కు కౌంటర్

తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమైన బిల్లుల విషయంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. గవర్నర్‌ ఆ వ్యాఖ్యలను ఖండించారు. తాను కొన్ని బిల్లులను ఆమోదించానని, అసలు బిల్లులను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో కారణం వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

మూడో వందేభారత్‌ ట్రైన్

తెలంగాణకు మరో వందేభారత్ రైలు రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు నడుస్తుండగా, తాజాగా మూడోది కాచిగూడ నుంచి మొదలు కానుంది. ఈ మేరకు కొత్త వందేభారత్ రైలు చెన్నై ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్) నుంచి నిన్ననే (జూలై 31) కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఎన్జీవో కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం 

ఆగస్టు 21, 22 తేదీలలో ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు తెలిపారు. సీఎం జగన్ తో పాటు రాష్ట్ర మంత్రులను ఆహ్వానించినట్లు ఆయన వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

చెప్పను బ్రో

జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'బ్రో' రాజకీయ రగడకు కారణమైంది. సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేత, మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)ను ఉద్దేశించి సృష్టించిన పాత్ర అని, శ్యాంబాబును తిట్టడం ద్వారా పరోక్షంగా గతంలో ఓసారి అంబటి చేసిన నృత్యాలపై విమర్శలు చేశారని పలువురు భావిస్తున్నారు.  పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వన్డే సిరీస్‌ ఇండియాదే

శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీయగా, ముఖేష్ కుమార్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ రెండు ఔట్‌లతో చెలరేగగా, వెస్టిండీస్‌తో తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగిన మూడో, చివరి వన్డేలో భారత్ 200 పరుగుల తేడాతో విజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అంతకుముందు, శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ ఇచ్చిన ఆరంభాన్ని వాడుకున్న సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన ఆటతీరుతో 351/5 భారీ స్కోరు సాధించారు. గిల్ 85, కిషన్ 77, హార్దిక్ 70 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. శాంసన్ 41 బంతుల్లో 51 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్ రెండు వికెట్లు పడగొట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి 

ఇవాళ (బుధవారం) ఉదయం 8.20 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 53 పాయింట్లు లేదా 0.27 శాతం రెడ్‌ కలర్‌లో 19,750 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

 

వరుణ్ పాన్ ఇండియా మూవీ

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ పాన్ ఇండియా సినిమా నిర్మిస్తోంది. కథానాయకుడిగా ఆయన 13వ చిత్రమిది. అందుకని VT13 Movie వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు వెరైటీ టైటిల్ ఖరారు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి

Published at : 02 Aug 2023 08:47 AM (IST) Tags: Breaking News AP news today Andhra Pradesh News Todays latest news Top 10 headlines today Todays Top news Telugu Top News Website Top 10 Telugu News

ఇవి కూడా చూడండి

Petrol-Diesel Price 29 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

Petrol-Diesel Price 29 September 2023: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

PGCIL: పీజీసీఐఎల్‌లో ఇంజినీర్‌ ట్రైనీ పోస్టులు, ఈ అర్హతలు అవసరం

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్‌ - దానం ఇలా కూడా చేయొచ్చు

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

SSC CHSL 2023 Result: ఎస్‌ఎస్‌సీ సీహెచ్‌ఎస్‌ఎల్‌ 'టైర్‌-1' పరీక్ష ఫలితాలు విడుదల - తర్వాతి దశకు 19,556 మంది ఎంపిక

Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group, ICICI Lombard, Emami

Stocks To Watch 29 September 2023: ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్‌' Adani Group, ICICI Lombard, Emami

టాప్ స్టోరీస్

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు

Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Mynampally Hanumantha Rao:  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం

Adilabad: గణేష్ లడ్డూని కొన్న ముస్లిం యువకుడు - రూ.1.2 లక్షలకు వేలంలో సొంతం