అన్వేషించండి

Tamilisai: బిల్లులు తిప్పి పంపడం నా ఉద్దేశం కాదు: మంత్రి కేటీఆర్ కు గవర్నర్ తమిళి సై కౌంటర్!

Tamilisai gives Counter to KTR Comments: మంత్రి కేటీఆర్ బిల్లుల పెండింగ్ పై చేసిన కామెంట్లపై గవర్నర్ తమిళిసై స్పందించారు. కేటీఆర్ వ్యాఖ్యల్ని ఖండించారు.

Tamilisai gives Counter to KTR Comments: తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ముఖ్యమైన బిల్లుల విషయంపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ స్పందించారు. గవర్నర్‌ ఆ వ్యాఖ్యలను ఖండించారు. తాను కొన్ని బిల్లులను ఆమోదించానని, అసలు బిల్లులను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో కారణం వివరించారు.

తాను తెలంగాణలో ఎవరికీ వ్యతిరేకం కాదని, అసలు బిల్లులను తిరస్కరించి, వెనక్కి పంపాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు గవర్నర్. కావాలనే కొందరు తనమీద ఎందుకు విషం చిమ్ముతున్నారో అర్థం కావడం లేదని తమిళిసై అన్నారు. భారీ వర్షాల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను, బాధలను చూసి చలించిపోయానని చెప్పారు. అతి త్వరలోనే వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తానని గవర్నర్ తెలిపారు. ఇప్పటికీ ప్రజలు పడుతున్న బాధలు తన కళ్ల ముందు కదలాడుతున్నాయని ఆమె వివరించారు. వరద ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం మరింత రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నీట మునిగిన ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలన్నారు.

రాష్ట్రంలో వరద ప్రభావంతో జరిగిన నష్టంపై ప్రభుత్వం నుంచి రిపోర్ట్‌ అడిగానని, అది రాగానే కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తానని తమిళిసై స్పష్టం చేశారు. ప్రజా ప్రతినిధులు ప్రజలకు అండగా ఉండాలని సూచించారు. వర్షాలపై కొన్ని పార్టీలు మెమోరాండం ఇచ్చాయని.. ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని ఆదేశించారు. దీంతో పాటు బిల్లులు ఎందుకు తిరస్కరించానో కారణాలు చెప్పానని గవర్నర్‌ తమిళిసై తెలిపారు.

మరోవైపు వరద బాధిత ప్రాంతాల్లో పునరావస చర్యలపై వేగంగా జరగట్లేదని కాంగ్రెస్‌ నాయకులు గవర్నర్‌కి ఫిర్యాదు చేశారు. రాజ్​భవన్​లో సీఎల్పీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క నేతృత్వంలోని కాంగ్రెస్‌ నేతలు.. గవర్నర్​తో సమావేశమయ్యారు.ప్రభుత్వంతో మాట్లాడి, సహాయక చర్యలు వేగవంతం చేయాలని వారు గవర్నర్‌ని కోరారు. గతంలో గవర్నర్​ పలుమార్లు సామాన్య ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు పర్యటనలు చేపట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget