అన్వేషించండి

Varun Tej - VT13 Movie : వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమాకు టైటిల్ ఫిక్స్ - అది ఏమిటో చూశారా?

Operation Valentine Movie, Varun Tej : వరుణ్ తేజ్, మానుషీ చిల్లర్ జంటగా నటిస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. ఆ విషయాన్ని దర్శక నిర్మాతలు అధికారికంగా చెప్పలేదు. కానీ, హీరోయిన్ బయటపెట్టారు.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ ఓ పాన్ ఇండియా సినిమా నిర్మిస్తోంది. కథానాయకుడిగా ఆయన 13వ చిత్రమిది. అందుకని VT13 Movie వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయనున్నారని సమాచారం. ఈ సినిమాకు వెరైటీ టైటిల్ ఖరారు చేశారు. 

ఆపరేషన్ వేలంటైన్!
ఈ సినిమాలో వరుణ్ తేజ్ (Varun Tej) సరసన మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ (Manushi Chhillar) హీరోయిన్. ఆల్రెడీ షూటింగ్ కూడా చేశారు. యాక్షన్ డ్రామా రూపొందుతున్న సినిమా అయినప్పటికీ... కథానాయిక పాత్రకు ప్రాధాన్యం ఉందని ఆమె తెలిపారు. అంతే కాదు... ఈ సినిమాకు 'ఆపరేషన్ వేలంటైన్' (Operation Valentine Movie) టైటిల్ ఖరారు చేసినట్లు చెప్పారు. అదీ సంగతి!

'ఆపరేషన్ వేలంటైన్'కు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకుడు. ఆయన లాయర్. సినిమాపై ప్రేమతో దర్శకుడిగా మారారు. ఇంతకు ముందు కొన్ని యాడ్ ఫిల్మ్స్ తీశారు. ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అవుతున్నారు. ''శక్తి ప్రతాప్ సింగ్ లాయర్ కావడంతో చాలా రీసెర్చ్ చేసి కథ రాశారు. స్క్రిప్ట్ నాకు ఇచ్చారు. అది చదువుతుంటే... తర్వాత ఏం జరుగుతుందో? అనే ఉత్కంఠ నాలో పెరిగింది. నా క్యారెక్టర్ కూడా బాగా రాశారు. నటీనటుల నుంచి తనకు కావాల్సిన నటన తీసుకోవడం ఎలాగో శక్తి ప్రతాప్ సింగ్ గారికి తెలుసు. వరుణ్ తేజ్ తో నటించడం చాలా సంతోషంగా ఉంది'' అని మానుషీ చిల్లర్ తెలిపారు. అక్షయ్ కుమార్ 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమాతో ఆమె కథానాయికగా పరిచయం అయ్యారు. హిందీలోనూ ఆమెకు అది తొలి సినిమా అయితే... ఈ 'ఆపరేషన్ వేలంటైన్' రెండో సినిమా. తెలుగులో మొదటి సినిమా. 

Varun Tej Role In Operation Valentine Movie : వాస్తవ సంఘటనల ప్రేరణతో రూపొందుతున్న యాక్షన్ డ్రామా  చిత్రమిది. భారతీయ వైమానిక దళం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. 'ఆపరేషన్ వేలంటైన్' సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ జెట్ పైలట్ రోల్ చేస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన ఆయన స్టిల్స్, వీడియోలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రేక్షకులలో సినిమాపై క్యూరియాసిటీని పెంచాయి. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసన్స్ పిక్చర్స్ సంస్థలపై సందీప్ ముద్ద భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. దీనికి నంద కుమార్ అబ్బినేని సహ నిర్మాత.

Also Read : పవన్‌కు ఎంత ఇచ్చామనేది చెప్పను, అంబటివి ఆరోపణలు మాత్రమే - 'బ్రో' నిర్మాత విశ్వప్రసాద్

ఆగస్టు 25న 'గాంఢీవధారి అర్జున'
'ఆపరేషన్ వేలంటైన్' సినిమా కంటే ముందు 'గాంఢీవధారి అర్జున'తో వరుణ్ తేజ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఆగస్టు 25న విడుదల కానుంది. ఇది కూడా యాక్షన్ డ్రామా. ఇందులో సాక్షి వైద్య కథానాయిక. తాజాగా ఈ సినిమా నుంచి 'నీ జతై...' సాంగ్ విడుదల చేశారు. సినిమాలు పక్కన పెట్టి వ్యక్తిగత జీవితానికి వస్తే... నవంబర్ నెలలో లావణ్య త్రిపాఠితో ఏడు అడుగులు వేయడానికి వరుణ్ తేజ్ రెడీ అవుతున్నారు.  

Also Read ఇదీ మహేష్ బాబు క్రేజ్ - గంటలో హౌస్‌ఫుల్ బోర్డ్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nikhil on Swayambhu Movie Update | కొంపల్లిలో ఓ రెస్టారెంట్ ను ఓపెన్ చేసిన నిఖిల్ | ABP DesamAR Rahman Wife Saira Rahman | ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చిన సైరా రెహ్మాన్ | ABP DesamNASA Space X Crew 10 Docking Success | సునీతా విలియమ్స్ భూమ్మీదకు వచ్చేందుకు రూట్ క్లియర్ | ABP DesamTDP Activist Loss life in Punganur | పెద్దిరెడ్డి ఇలాకాలో బలైపోయిన మరో టీడీపీ కార్యకర్త | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Cabinet Decisions : చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
చేనేత కార్మికులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం- కేబినెట్ కీలక నిర్ణయాలు 
TTD: తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ - మార్చి 24 నుంచి టీటీడీలో సిఫారసు లేఖలకు అనుమతి
Chandrababu: గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
గతంలో టీడీపీ ఓడిపోయింది నా వల్లే - మరి ఆ తప్పులు దిద్దుకుంటున్నారా?
Telangana Latest News: 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం 
Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
రాజీవ్ యువ వికాసం స్కీమ్, యువతకు రూ.3 లక్షల వరకు సాయం- పూర్తి వివరాలు ఇలా
Tamannaah: 'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
'ఎవరూ అద్భుతాల కోసం ఎదురుచూడొద్దు' - బ్రేకప్ ప్రచారం వేళ మిల్కీ బ్యూటీ తమన్నా ఇంట్రెస్టింగ్ పోస్ట్
Sourav Ganguly: పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
పోలీస్ ఆఫీసర్‌గా సౌరభ్ గంగూలీ - అసలు విషయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Credit Card Loan: క్రెడిట్ కార్డ్ లోన్‌ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి
క్రెడిట్ కార్డ్ లోన్‌ తీసుకోబోతున్నారా? ముందు ఈ పచ్చి నిజాలు తెలుసుకోండి
Embed widget