By: ABP Desam | Updated at : 01 Aug 2023 08:44 PM (IST)
అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్, టీజీ విశ్వప్రసాద్
జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన 'బ్రో' రాజకీయ రగడకు కారణమైంది. సినిమాలో శ్యాంబాబు క్యారెక్టర్ ఏపీలోని అధికార పార్టీకి చెందిన నేత, మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)ను ఉద్దేశించి సృష్టించిన పాత్ర అని, శ్యాంబాబును తిట్టడం ద్వారా పరోక్షంగా గతంలో ఓసారి అంబటి చేసిన నృత్యాలపై విమర్శలు చేశారని పలువురు భావిస్తున్నారు.
శ్యాంబాబు అని ఎందుకు? నేరుగా రాంబాబు అని పెట్టుకోవచ్చని 'బ్రో' విడుదలైన రోజున అంబటి రాంబాబు తెలిపారు. తనది ఆనంద తాండవం అని వివరించారు. ఈ రోజు (మంగళవారం) మరోసారి విలేకరుల సమావేశం నిర్వహించిన ఆయన... 'బ్రో' ఫ్లాప్ అని తేల్చేశారు. ఆయన వ్యాఖ్యలను టీజీ విశ్వప్రసాద్ ఖండించారు.
పవన్ తీసుకున్న కోట్ల రూపాయల పారితోషికం కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. అంతే కాదు... నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (రాజకీయ నేత టీజీ వెంకటేష్ కజిన్) తెలుగుదేశం పార్టీకి చెందిన మనిషి అని, 'బ్రో' నిర్మాణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ప్రక్రియ కొనసాగుతోందని, పవన్ కళ్యాణ్ కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ఈ రూపంలో అందించారని ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించిన 'బిగ్ డిబేట్' కార్యక్రమంలో ఆ ఆరోపణలను విశ్వప్రసాద్ తోసిపుచ్చారు.
మనీ రూటింగ్ జరగలేదు...
పవన్ పారితోషికం చెప్పను! - టీజీ విశ్వప్రసాద్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Remuneration)కు ఎన్ని కోట్లు ఇచ్చామనేది తాము బయట పెట్టమని టీజీ విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. గతంలో ఈ సినిమాకు గాను రోజుకు రెండు కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు పవన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అంబటి రాంబాబు చేసిన ఆరోపణల్లో వాస్తవాలు లేవని టీజీ విశ్వప్రసాద్ తెలిపారు. 'బ్రో' సినిమా బ్లాక్ బస్టర్ అని ఆయన ఘంటా పథంగా చెప్పారు. ఓటీటీ రైట్స్ అమ్మడం ద్వారా తమకు మంచి డబ్బు వచ్చిందని వివరించారు. సినిమా వల్ల తమకు లాభాలు వచ్చాయన్నారు. వసూళ్లు బాగా వస్తున్నాయన్నారు. అంబటి ఆరోపించినట్లు 'బ్రో' చిత్ర నిర్మాణంలో మనీ రూటింగ్ ఏదీ జరగలేదన్నారు. సక్రమంగా సినిమా తీశామని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్ వల్ల 'బ్రో' సినిమాకు క్రేజ్ వచ్చిందని చెప్పిన టీజీ విశ్వప్రసాద్... ఈ రాజకీయ విమర్శలను తాము ఊహించలేదని వివరించారు. మంచి లేదా చెడు... సినిమాకు పబ్లిసిటీ అవసరమని, అయితే తాము కోరుకొని పబ్లిసిటీ ఇదని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. 'ప్రస్తుతం టీజీ వెంకటేష్ కుటుంబం తెలుగు దేశం పార్టీలో ఉంది కనుక రాజకీయ విమర్శలు వస్తున్నాయని భావిస్తున్నారా?' అని ప్రశ్నించగా... తనకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉన్నారని సమాధానం ఇచ్చారు.
Also Read : విజయ దశమికి రవితేజ 'టైగర్' వేట - వెనకడుగు వేసేది లేదు
విమర్శలు, వివాదాలు పక్కన పెడితే... విడుదలైన మూడు రోజుల్లో 'బ్రో' సినిమా వసూళ్ళలో వంద కోట్ల మార్క్ చేరుకుంది. సాధారణంగా వీకెండ్ తర్వాత భారీ సినిమాలు అయినా సరే వసూళ్ళలో తగ్గుదల కనబడుతుంది. ఈ సినిమాకు కూడా ఆ విధంగా ఉంది. తెలంగాణ, ఏపీలో వర్షాలు సైతం విడుదల రోజున ఓపెనింగ్స్ మీద ప్రభావం చూపించాయి.
Also Read : ఇదీ మహేష్ బాబు క్రేజ్ - గంటలో హౌస్‌ఫుల్ బోర్డ్స్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
వరుణ్ తేజ్ మూవీకి భారీ డీల్ - 'ఆపరేషన్ వాలెంటైన్' నాన్ థియేట్రికల్ రైట్స్ అన్ని కోట్లా?
Bigg Boss 7 Telugu: దొంగ అనుకుంటారు నన్ను - రెండు నిమిషాలు పట్టదు, ఎత్తిపడేస్తా.. శోభాశెట్టితో శివాజీ గొడవ
BhagavanthKesari: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా బే - బాలయ్య ఊరమాస్ అవతార్, 'భగవంత్ కేసరి' సర్‌ప్రైజ్ అదిరింది
Vijay Deverakonda - Rashmika: డార్లింగ్ అంటూ దేవరకొండ ట్వీట్ - నువ్వు ఎప్పటికీ బెస్ట్ అంటూ రష్మిక రిప్లై!
Siddharth: కర్ణాటకలో హీరో సిద్ధార్థ్‌కు ఘోర అవమానం, తమిళోడివి అంటూ వేదికపై ఉండగానే..
Byreddy Rajasekar Reddy: భువనేశ్వరితో బైరెడ్డి భేటీ - చంద్రబాబు అరెస్టుపై కీలక వ్యాఖ్యలు
Accident Policy: మీరిచ్చే ఒక్క రూపాయితో ఓ పేద కుటుంబానికి రూ.10 లక్షల ఇన్సూరెన్స్ - దానం ఇలా కూడా చేయొచ్చు
Mynampally Hanumantha Rao: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మైనంపల్లి హనుమంతరావు, పార్టీ కండువా కప్పిన ఖర్గే
Telangana BJP : తెలంగాణ ఎన్నికల కోసం 26 మందితో కేంద్ర కమిటీ - ఏపీ సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డికి చోటు !
/body>