అన్వేషించండి

Tiger Nageswara Rao Movie : విజయ దశమికి రవితేజ 'టైగర్' వేట - వెనకడుగు వేసేది లేదు

రవితేజ హీరోగా అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న 'టైగర్ నాగేశ్వరరావు' విడుదల వాయిదా పడిందని వచ్చిన వార్తలను నిర్మాణ సంస్థ ఖండించింది.

మాస్ మహారాజా రవితేజ (Raviteja) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Movie). దీనికి వంశీ (Director Vamsee) దర్శకుడు. తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పతాకంపై అభిషేక్ అగర్వాల్ భారీ నిర్మాణ వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ సినిమా విడుదలపై ఓ ప్రచారం జరుగుతోంది. దాన్ని చిత్ర బృందం ఖండించింది.

అక్టోబర్ 20నే విడుదల...
వెనకడుగు వేయడం లేదు
Tiger Nageswara Rao Release Date : విజయ దశమి కానుకగా అక్టోబర్ 20న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే, ఆ తేదీకి సినిమా రావడం లేదని వాయిదా పడుతుందని ప్రచారం జరుగుతోంది. అది అవాస్తమని అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంస్థ తెలిపింది. తాము వెనకడుగు వేయడం లేదని, ముందుగా ప్రకటించిన తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తామని చెప్పింది. 

ఆ పుకార్లు, వదంతులను నమ్మవద్దు
''టైగర్‌ నాగేశ్వరరావు అక్టోబర్ 20న విడుదల కావడం లేదని ఎటువంటి ఆధారాలు లేని ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. కొన్ని శక్తులు ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్నాయి. ఎందుకంటే... మా సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అంతే కాదు... థియేట్రికల్ ఎకో సిస్టమ్‌లోని డిస్ట్రిబ్యూటర్లు, వివిధ స్టేక్ హోల్డర్స్ నుంచి మొదటి ప్రాధాన్యత పొందింది. అందుకని, ఎటువంటి వదంతులను నమ్మవద్దు. అక్టోబరు 20 నుంచి బాక్సాఫీస్ బరిలో టైగర్ వేట పార్రంభం అవుతుంది. ప్రేక్షకులకు గొప్ప అనుభూతి ఇవ్వడానికి మా చిత్ర బృందం కృషి చేస్తోంది" అని ఓ ప్రకటనలో తెలిపారు.

Also Read : ఇదీ మహేష్ బాబు క్రేజ్ - గంటలో హౌస్‌ఫుల్ బోర్డ్స్!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Abhishek Agarwal Arts (@aaartsofficial)

రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌ లాక్ బ్రిడ్జ్ (గోదావరి)పై 'టైగర్ నాగేశ్వర రావు' ఫస్ట్ లుక్ పోస్టర్, కాన్సెప్ట్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. త్వరలో ఈ సినిమా టీజర్‌ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కిషన్ రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తదితరుల సమక్షంలో ఈ ఏడాది ఉగాదికి పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛనంగా ప్రారంభించారు. 

దసరా బరిలో మరో రెండు సినిమాలు
విజయ దశమికి నట సింహం నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'భగవంత్ కేసరి' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా విడుదల అక్టోబర్ 19న. అదే రోజున తమిళ స్టార్ హీరో విజయ్, 'విక్రమ్' దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలయికలో రూపొందుతోన్న 'లియో' సినిమా విడుదల కూడా!

Also Read : ఓ మై గాడ్ - సెన్సార్‌తో అంత వీజీ కాదు, 27 మార్పులతో అక్షయ్ సినిమా!

'టైగర్ నాగేశ్వరరావు' (Tiger Nageswara Rao Biopic)లో రవితేజకు జోడీగా బాలీవుడ్ భామ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ నటించనున్నారు. 1970లలో దక్షిణ భారతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా, స్టువర్టుపురం నాగేశ్వరరావు కథతో రూపొందిస్తున్న చిత్రమిది. ఈ చిత్రానికి కెమెరా: ఆర్. మది, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar), ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా, డైలాగ్ రైటర్: శ్రీకాంత్ విస్సా, సహ నిర్మాత: మయాంక్ సింఘానియా.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mallu Bhatti Vikramarka: తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్ కాదు.. దిక్సూచీ - 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం !
Konaseema ONGC Gas Blowout : ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
ఇరుసుమండలో తగ్గుముఖం పట్టిన నిప్పుల సెగ; ఊపిరి పీల్చుకుంటున్న కోనసీమ, రంగంలోకి ఢిల్లీ నిపుణులు
Telangana districts Reorganization: తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ - అసెంబ్లీలో మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
OTT Releases This Week: ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
ఓటీటీలో దుమ్ము రేపుతున్న ఐదు సినిమాలు... 'థామ' నుండి 'హక్' వరకు!
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Tata tiago On EMI Finance Plan: మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
మీ ప్రాంతంలో ట్రాఫిక్‌కు టియాగో సరైన ఛాయిస్‌; ధరలు, ఈజీ ఈఎంఐ ప్లాన్‌ ఇదే !
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Embed widget