News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

OMG 2 Censor News : ఓ మై గాడ్ - సెన్సార్‌తో అంత వీజీ కాదు, 27 మార్పులతో అక్షయ్ సినిమా!

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో రూపొందిన 'ఓ మై గాడ్ 2' సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చే విషయంలో పలు మార్పులు సూచింది. సినిమాలో కట్స్ లేవు అనేది నిజం కాదు! ఎందుకంటే... 27 మార్పులు చేశారు.

FOLLOW US: 
Share:

అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హిందీ సినిమా 'ఓ మై గాడ్' (Oh My God 2 Movie). ఇందులో యామీ గౌతమ్, పంకజ్ త్రిపాఠి ఇతర ప్రధాన తారాగణం. అప్పట్లో 'ఓ మై గాడ్' సంచలన విజయం సాధించింది. ఆ సినిమాను తెలుగులో 'గోపాల గోపాల' పేరుతో వెంకటేష్, పవన్ కళ్యాణ్ రీమేక్ చేశారు. ఇక్కడ కూడా విజయం సాధించింది. అందుకని, 'ఓ మై గాడ్ 2' మీద ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. కొన్ని రోజులుగా సెన్సార్ విషయం వార్తల్లో నిలుస్తోంది. ఎట్టకేలకు 'ఓ మై గాడ్ 2'  సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ లభించింది. అదీ 27 మార్పులతో!

ఓ మై గాడ్, 27 మార్పులు...
ఆ 14 నిమిషాలు కొత్తగా!
OMG 2 Censor Changes : 'ఓ మై గాడ్ 2'కు సెన్సార్ బోర్డు 25 కట్స్ చెప్పిందని తొలుత వార్తలు వచ్చాయి. సెన్సార్ విషయంలో ఇంకా అనిశ్చితి నెలకొందని, ఈ సినిమాకు 35 కట్స్ చెప్పారని నిన్నటికి నిన్న ఓ వార్త హల్ చల్ చేసింది. ఆఖరికి 'ఏ' సర్టిఫికెట్ లభించింది. కట్స్ ఏవీ విధించలేదని ముంబై మీడియా చెబుతోంది. అయితే... అది నిజం కాదని తెలుస్తోంది.

'ఓ మై గాడ్ 2'కు సెన్సార్ బోర్డు 27 మార్పులు సూచించింది. ముందు తీసిన సినిమా నుంచి 13.51 నిమిషాలు డిలీట్ చేశారు. ఆ సన్నివేశాల స్థానంలో కొత్తగా తీసిన 14.01 నిమిషాలు యాడ్ చేశారు. దీన్ని బట్టి సినిమా రీ షూట్ జరిగిందని అర్థం అవుతోంది.

శివునిగా అక్షయ్ కుమార్!?
ఇప్పటి వరకు విడుదలైన 'ఓ మై గాడ్' ప్రచార చిత్రాలు చూస్తే... అక్షయ్ కుమార్ పరమ శివుని ఆహార్యంలో కనిపించారు. సినిమాలోనూ ఆయన హర హర మహా దేవుని పాత్ర పోషించారు. సెన్సార్ మార్పులు తర్వాత శివునిగా కాకుండా శివ భక్తుడిగా, దైవదూతగా మార్చినట్లు అర్థం అవుతోంది. 

సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో...
'ఓ మై గాడ్ 2'లో నాగ సాధువులు, హస్త ప్రయోగం నేపథ్యంలో సన్నివేశాలు కూడా ఉన్నాయి. సినిమా కథలో సెక్స్ ఎడ్యుకేషన్ ప్రధాన అంశమని సమాచారం. ఆ కట్స్ చూస్తే అది నిజమే అనిపిస్తోంది. ఓ సన్నివేశంలో బిల్ బోర్డులో 'మూడ్ ఎక్స్' కండోమ్ పోస్టర్ తొలగించారు. హస్త ప్రయోగం చేసే సన్నివేశంలో 'హరామ్' డైలాగ్ తొలగించి 'పాప్' అని రాశారు. ఓ సన్నివేశంలో 'సత్యం శివమ్ సుందరం' డైలాగ్ తీసేశారు. 'ఓ మై గాడ్ 2' సెన్సార్ మార్పులను కింద ఫొటోలో చూడవచ్చు.

Also Read : రజనీకాంత్‌ను ఎగతాళి చేస్తావా? నువ్వెందుకు సూపర్ స్టార్ కాలేదురా?

ఆగస్టు 11న 'ఓ మై గాడ్ 2' విడుదల
OMG 2 Runtime : 'ఓ మై గాడ్ 2' సినిమా నిడివి 156 నిమిషాలు! అంటే... సుమారు రెండున్నర గంటలు! ఆగస్టు 11న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. నిన్నటి వరకు సెన్సార్ క్లియరెన్స్ రాకపోవడంతో ముందుగా అనుకున్న తేదీకి విడుదల అవుతుందో? లేదో? అని సందేహాలు నెలకొన్నాయి. అయితే... ఇప్పుడు ఆ సమస్య లేదు. 'ఓ మై గాడ్' సినిమాకు ఉమేష్ శుక్లా దర్శకత్వం వహించగా... 'ఓ మై గాడ్ 2'కు అమిత్ రాయ్ దర్శకత్వం వహించారు. 

Also Read : అనుష్క ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్ - అనుకున్నదే జరిగింది!

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

Published at : 01 Aug 2023 04:18 PM (IST) Tags: akshay kumar OMG 2 censor Oh My God 2 Movie OMG 2 Deleted Scenes OMG 2 Replaced Scenes OMG 2 Censor Certificate OMG 2 Censor News

ఇవి కూడా చూడండి

Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Vijay Devarakonda : రెండు భాగాలుగా విజయ్ దేవరకొండ సినిమా - డైరెక్టర్ ఎవరంటే?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

Tiger Nageswara Rao: హేమలత లవణంగా రేణు దేశాయ్ - రవితేజ సినిమాలో ఆమె ఫస్ట్ లుక్ చూశారా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?

Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్

Shruti Haasan : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న 'ది ఐ', సంతోషంలో శృతి హాసన్

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

Badshah gift: అభిమానికి లక్షన్నర ఖరీదైన స్నీకర్లు బహుమతిగా ఇచ్చిన బాద్‌షా - నెట్టింట్లో వీడియో వైరల్

టాప్ స్టోరీస్

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

బీఆర్ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?

BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా  ?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?

Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?