Stocks To Watch 02 August 2023: ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉండే 'కీ స్టాక్స్' Titan, IndiGo, Hero MotoCorp
మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
Stock Market Today, 02 August 2023: ఇవాళ (బుధవారం) ఉదయం 8.20 గంటల సమయానికి, గిఫ్ట్ నిఫ్టీ (GIFT NIFTY) 53 పాయింట్లు లేదా 0.27 శాతం రెడ్ కలర్‌లో 19,750 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.
ఇవాళ Q1 రిజల్ట్స్ ప్రకటించే కీలక కంపెనీలు: టైటన్, ఇండిగో, అంబుజా, మ్యాన్‌కైండ్ ఫార్మా, అదానీ విల్మార్. ఈ స్టాక్స్ ఇవాళ మార్కెట్ ఫోకస్‌లో ఉంటాయి.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
అదానీ టోటల్ గ్యాస్: 2023-24 తొలి త్రైమాసికంలో అదానీ టోటల్ గ్యాస్ రూ. 150 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) స్వల్పంగా 2 శాతం పెరిగి రూ. 1,135 కోట్లకు చేరుకుంది.
మెట్రో బ్రాండ్స్: Q1 FY24లో మెట్రో బ్రాండ్స్ నికర లాభం 11 శాతం తగ్గి రూ. 93 కోట్లకు పరిమితమైంది. అదే సమయంలో ఈ కంపెనీ ఆదాయం 15 శాతం పెరిగి రూ. 583 కోట్లకు చేరుకున్నాయి.
సులా వైన్‌యార్డ్స్: మహారాష్ట్ర ఎక్సైజ్ శాఖ నుంచి సూల వైన్‌యార్డ్స్‌కు రూ. 115.8 కోట్ల ఎక్సైజ్ డ్యూటీ నోటీసు అందింది. అయితే, ఆ ఆర్డర్ ప్రస్తుత వ్యాపారంపై ప్రభావం చూపదని కంపెనీ ప్రకటించింది.
దాల్మియా భారత్ షుగర్: 2023 ఏప్రిల్ - జూన్ కాలంలో దాల్మియా భారత్ షుగర్ రూ. 61 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. కార్యకలాపాల ద్వారా రూ. 834 కోట్ల ఆదాయం ఈ కంపెనీకి వచ్చింది.
సోమ్ డిస్టిలరీస్: ఈ లిక్కర్ కంపెనీ ఉత్పత్తి చేసే 'ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్' (IMFL) బ్రాండ్‌లను మార్కెట్ చేయడానికి, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సోమ్ డిస్టిలరీస్ అనుమతి లభించింది.
హీరో మోటోకార్ప్: ఈ టూ-వీలర్ లీడర్ మొత్తం సేల్స్ ఈ ఏడాది జులై నెలలో 3,91,310 యూనిట్లకు పడిపోయాయి, గత ఏడాది ఇదే నెలలో 4,45,580 యూనిట్లను హీరో మోటోకార్ప్ అమ్మింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా చాలా రాష్ట్రాల్లో పంట నష్టం వాటిల్లిందని, షోరూమ్‌లకు వచ్చి వెళ్లే కస్టమర్ల సంఖ్య గణనీయంగా తగ్గిందని, అందుకే అమ్మకాలు తగ్గాయని ఈ కంపెనీ చెబుతోంది.
బజాజ్ ఆటో: బైక్స్ సెగ్మెంట్‌లో బజాజ్ ఆటో నిరాశపరిచింది. గత ఏడాది జులై నెలలో 3,54,670 యూనిట్లు అమ్మితే, ఈ ఏడాది జులై నెలలో 3,19,747 యూనిట్లను మాత్రమే సేల్ చేయగలిగింది.
మారుతి సుజుకి: జులై నెలలో మారుతి సుజుకి టోటల్ సేల్స్ 1,81,630 యూనిట్లకు చేరాయి. గత ఏడాది ఇదే నెలలో ఈ వెహికల్ కంపెనీ 1,75,916 వాహనాలను డీలర్లకు సప్లై చేసింది. SUV సెగ్మెంట్‌లో 24.6% మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది.
టాటా మోటార్స్: 2023 జులై నెలలో ఈ కంపెనీ 80,633 యూనిట్లు అమ్మింది, 2022 జులైలో ఈ లెక్క 81,790గా ఉంది.
మహీంద్ర: ఈ కంపెనీ సేల్స్ ఏడాది ప్రాతిపదికన పెరిగాయి. గత ఏడాది జులై నెలలో 28.053 వాహనాలను అమ్మితే, ఈ ఏడాది జులై నెలలో 36,205 యూనిట్లను విక్రయించింది.
హీరో మోటోకార్ప్: కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ పవన్ ముంజాల్ నివాసం, దిల్లీ, గురుగ్రామ్‌లో ఉన్న కంపెనీ ఆఫీసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం సోదాలు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు జరిగాయి.
ఇది కూడా చదవండి: 'పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన' బెనిఫిట్స్ గురించి తెలుసా?, అతి తక్కువ ప్రీమియంతో బీమా కవరేజ్
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial