(Source: ECI/ABP News/ABP Majha)
Top 10 Headlines Today: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ, విమర్శలతో విరుచుకుపడుతున్న వైసీపీ
Top 10 Headlines Today: తెలుగు రాష్ట్రాలు సహా జాతీయ వ్యాప్తంగా చోటు చేసుకున్న తాజా టాప్ 10 న్యూస్ మీకోసం..
Top 10 Headlines Today:
టీడీపీకి అదే పెద్ద టాస్క్
మహానాడు పేరుతో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించింది. తొలి విడత మేనిఫెస్టో విడుదల చేసిన ఆ పార్టీ ప్రజల్లో విస్తృత చర్చకు దారి తీసింది. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న పథకాలు పీకేస్తారని వైఎస్‌ఆర్‌సీపీ చేస్తున్న ప్రచారానికి ఈ మేనిఫెస్టోతో కౌంటర్ ఇచ్చింది. తాము అధికారంలోకి వస్తే ఉన్న పథకాల కంటే మరింత మెరగైనవి ఇస్తామంటూ ప్రచారం మొదలు పెట్టింది. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బాకీలపై అభ్యర్థన
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం జగన్ అభ్యర్థించారు. ఢిల్లీలో ఉన్న జగన్... నిన్న రాత్రి కేంద్రమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఓ పండుగలా రాష్ట్రావతరణ ఉత్సవాలు
ఉద్యమం 14 ఏండ్ల సుదీర్ఘ కాలం గడిచింది. పరిపానలో 10 ఏండ్లు మామూలు విషయం కాదు. ఇది ఒక మరచిపోలేని మైలు రాయి. స్వరాష్ట్రంలో సుపరిపాలన కేసీఆర్ కే ప్రత్యేకం. అసాధ్యమనుకున్న రాష్ట్రాన్ని సాధించి సుసాధ్యం చేసిన సీఎం కేసీఆర్, రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను ఓ పండుగలా... మరచిపోలేని ఓ తీపి జ్ఞాపకంగా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాలను అధికారులు, ప్రజలను విస్తృతంగా భాగస్వాములను చేస్తూ, ఘనంగా నిర్వహించాలి. జూన్ 2వ తేదీ నుండి 23వ తేదీ వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్, హన్మకొండ జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల నిర్వహణపై హన్మకొండ కలెక్టరేట్ లో ఆదివారం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై, ఆయా అంశాలను సమీక్షించారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
భిన్న వాతావరణం
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. తెలంగాణ పరిసర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఉత్తర-దక్షిణ ద్రోణి ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. ఈ రెండు ఫలితాలు తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణం చూడవచ్చు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పొలిటికల్ మ్యాచ్ ఆడతారా?
టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశంలో క్యాష్ రిచ్ లీగ్ అయిన ఐపీఎల్ కు ఆదివారం రిటైర్మెంట్ ప్రకటించారు. గతంలో రిటైర్మెంట్ ప్రకటించి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం రాయుడుకు అలవాటే. దాంతో మరోసారి అలా చేసే ఛాన్స్ లేదని నో యూటర్న్ అని క్యాప్షన్ తో ట్వీట్ చేశాడు. దాంతో రాయుడు నెక్ట్స్ స్టెప్ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే అంబటి రాయుడు రాజకీయ అరంగేట్రం చేయడమే తరువాయి అనిపిస్తోంది. రాయుడు ఏం ప్రకటన చేస్తారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో క్రికెటర్లు అజారుద్దీన్, నవజ్యోత్ సింగ్ సిద్దూ, గౌతమ్ గంభీర్.. రిటైర్మెంట్ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
టీడీపీ మేనిఫెస్టోపై వైసీపీ ఘాటు విమర్శలు
మేనిఫెస్టో అంటే సినిమా కాదంటూ, అందుకే విడతల వారీగా విడుదల చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అని వైసీపీ నేతలు విమర్శించారు. అసలు చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం అని అన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత ప్రవేశాల గడువు పెంపు
ఏపీలో ఉచిత నిర్భంద విద్యాహక్కు చట్టం సెక్షన్12(1) (ఈ) ప్రకారా 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 25 శాతం ప్రవేశాలు 1వ తరగతిలో ఎంపికైన విద్యార్థులు బడిలో చేరేందుకు గడువును మే 30 వరకు పొడిగించినట్లు పాఠశాల విద్య కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ మే 28న ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
బంగారం ధరలు
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు కొనసాగుతుందన్న అంచనాలతో పసిడి ధర పతనం కొనసాగుతోంది. ప్రస్తుతం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,944.30 డాలర్ల వద్ద ఉంది. మన దేశంలో, 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధరలోనూ ఏమార్పు లేదు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
వివాదాల చిత్రంపై కమల్ కామెంట్
'ది కేరళ స్టోరీ' సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు చెలరేగాయో తెలిసిందే. ఎన్నో విమర్శలు, ఆందోళనల మధ్య ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాపై విశ్వనటుడు, మక్కల నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టే కమల్.. ఇదొక ప్రొపగాండా సినిమా అని, అలాంటి ప్రచార చిత్రాలకు తాను వ్యతిరేకమని అన్నారు. అయితే ఈ కామెంట్స్ పై డైరెక్టర్ సుదీప్తో సేన్ స్పందించారు. సినిమా చూడని వ్యక్తులు మాత్రమే దీనిని ప్రొపగాండాగా సూచిస్తారని అన్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవాళ మ్యాచ్ జరగపోతే...
చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగలేదు. వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆటంకం కలిగింది. అయితే ఐపీఎల్ ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంచడం క్రికెట్ అభిమానులకు శుభవార్త. అంటే ఇప్పుడు సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే సోమవారం కూడా అహ్మదాబాద్‌లో వర్షం కురిసి మ్యాచ్ జరగకపోతే ఏమవుతుంది. విజేతను ఎలా ఎంపిక చేస్తారు? మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి