By: ABP Desam | Updated at : 29 May 2023 01:32 AM (IST)
ట్రోఫీతో పాండ్యా, ధోని ( Image Source : Social Media )
CSK vs GT, IPL Final: చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగలేదు. వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య మ్యాచ్ ఆటంకం కలిగింది. అయితే ఐపీఎల్ ఫైనల్‌కు రిజర్వ్ డే ఉంచడం క్రికెట్ అభిమానులకు శుభవార్త. అంటే ఇప్పుడు సోమవారం చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే సోమవారం కూడా అహ్మదాబాద్‌లో వర్షం కురిసి మ్యాచ్ జరగకపోతే ఏమవుతుంది. విజేతను ఎలా ఎంపిక చేస్తారు?
సోమవారం కూడా వర్షం పడితే?
వాస్తవానికి వర్షం కారణంగా రిజర్వ్ డే అయిన సోమవారం నాడు కూడా ఆట ఆడలేకపోతే లీగ్ దశ తర్వాత పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు విజేతగా నిలుస్తుంది. ఈ విధంగా హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ ప్రయోజనం పొందుతుంది. ఐపీఎల్ 2023 ఛాంపియన్ అవుతుంది. అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ బాధపడవలసి ఉంటుంది. ఎందుకంటే లీగ్ దశ తర్వాత గుజరాత్ టైటాన్స్ టాప్‌లో ఉండగా, చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో నిలిచింది.
లీగ్ దశలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. గుజరాత్ టైటాన్స్ 14 మ్యాచుల్లో 20 పాయింట్లు సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ 14 మ్యాచ్‌ల్లో 17 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. గుజరాత్ టైటాన్స్ 10 లీగ్ మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 4 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది.
అదే సమయంలో చెన్నై సూపర్ కింగ్స్ 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 5 మ్యాచ్‌ల్లో ఓటమి చవి చూడాల్సి వచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు చెరో పాయింట్‌తో సంతృప్తి చెందాల్సి వచ్చింది.
మరోవైపు పైనల్‌కు ముందు చెన్నై స్టార్ బ్యాటర్ అంబటి రాయుడు ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం జరగనున్న ఫైనల్ మ్యాచే తనకు చివరి మ్యాచ్ కానుందని తెలిపాడు.
ఫైనల్ మ్యాచ్ తర్వాత రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నట్లు అంబటి రాయుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండూ మంచి జట్లు అని అంబటి తన ట్వీట్‌లో రాశారు. ‘204 మ్యాచ్‌లు, 14 సీజన్‌లు, 11 ప్లేఆఫ్‌లు, 8 ఫైనల్స్, 5 ట్రోఫీలు. ఈ రాత్రికి ఆరో ట్రోఫీని ఆశిస్తున్నాను. ఇది చాలా సుదీర్ఘ ప్రయాణం. ఈ రాత్రి జరిగే ఫైనల్ ఐపీఎల్‌లో నా చివరి మ్యాచ్ అని నిర్ణయించుకున్నాను. ఈ గొప్ప టోర్నమెంట్‌లో ఆడటం నాకు బాగా నచ్చింది. అందరికి ధన్యవాదాలు. ఇంక తిరిగి వచ్చేది లేదు.’ అని పేర్కొన్నాడు.
అంబటి రాయుడు 2010లో ఆడిన IPL సీజన్‌లో అరంగేట్రం చేశాడు. IPLలో చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు, ముంబై ఇండియన్స్ జట్టులో కూడా రాయుడు ముఖ్యమైన భాగంగా ఉన్నాడు. 2018 సీజన్‌లో అంబటి రాయుడు తొలిసారి చెన్నై జట్టులో భాగమయ్యాడు. ఇప్పటి వరకు రాయుడు 203 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 28.29 సగటుతో మొత్తం 4329 పరుగులు చేశాడు. అంబటి రాయుడు గత సీజన్‌లో కూడా హఠాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తర్వాత దాన్ని వెనక్కి తీసుకున్నాడు.
R Ashwin: 'ఐపీఎల్ వార్‌ఫేర్'పై స్పందించిన యాష్ - NO 4పై చర్చే వద్దన్న లెజెండ్
Gautam Gambhir: లక్నో స్ట్రాటజిక్ కన్సల్టెంట్‌గా ఎమ్మెస్కే! మెంటార్ పదవికి గంభీర్ రిజైన్ చేస్తున్నాడా!
IPL 2024: 2024 ఐపీఎల్ విదేశాల్లో జరుగుతుందా? - లోక్‌సభ ఎన్నికలే కారణమా?
Yuzvendra Chahal: ఆర్సీబీ మీద చాలా కోపమొచ్చింది, నమ్మించి మోసం చేశారు: చాహల్ సంచలన వ్యాఖ్యలు
MS Dhoni: న్యూ లుక్‌లో ధోని - ఐపీఎల్ గెలిచాక తొలిసారి చెన్నైకి తలా - ఆ సినిమా ప్రమోషన్ కోసమేనా?
Chandrababu: రెండో రోజు ప్రారంభమైన చంద్రబాబు విచారణ - స్కిల్ కేసులో సీఐడీ ప్రశ్నలు
BRS Leaders For Chandrababu : చంద్రబాబుకు తెలంగాణ బీఆర్ఎస్ నేతల సపోర్ట్ - జగన్ పై విమర్శలు ! రాజకీయం ఉందా ?
Chandrababu Arrest : విశాఖలో టీడీపీ కొవొత్తుల ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, పలువురి అరెస్ట్ తో ఉద్రిక్తత
Sintex: తెలంగాణలో రూ.350 కోట్లతో సింటెక్స్ తయారీ యూనిట్, 1000 మందికి ఉద్యోగాలు
/body>