అన్వేషించండి

The Kerala Story: కమల్‌ హాసన్‌ కామెంట్స్‌కు ‘ది కేరళ స్టోరీ’ డైరెక్టర్ కౌంటర్

బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘ది కేరళ స్టోరీ’ సినిమాపై కమల్‌ హాసన్‌ చేసిన 'ప్రొపగాండా' కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. దీనిపై దర్శకుడు సుదీప్తో సేన్ స్పందిస్తూ, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

'ది కేరళ స్టోరీ' సినిమా చుట్టూ ఎన్ని వివాదాలు చెలరేగాయో తెలిసిందే. ఎన్నో విమర్శలు, ఆందోళనల మధ్య ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. అయితే ఈ సినిమాపై విశ్వనటుడు, మక్కల నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ విషయంలోనైనా తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టే కమల్.. ఇదొక ప్రొపగాండా సినిమా అని, అలాంటి ప్రచార చిత్రాలకు తాను వ్యతిరేకమని అన్నారు. అయితే ఈ కామెంట్స్ పై డైరెక్టర్ సుదీప్తో సేన్ స్పందించారు. సినిమా చూడని వ్యక్తులు మాత్రమే దీనిని ప్రొపగాండాగా సూచిస్తారని అన్నారు.

మూవీ ప్రమోషన్స్‌ తో బిజీగా గడిపిన సుదీప్తో సేన్.. ప్రస్తుతం డీహైడ్రేషన్, ఇన్‌ఫెక్షన్ సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఇదే క్రమంలో ప్రొపగాండా సినిమా అనే విమర్శల గురించి మాట్లాడుతూ.. భారతదేశంలో 'చాలా స్టుపిడ్ స్టీరియోటైప్స్' ఉన్నాయని పేర్కొన్నాడు. "ఇంతకుముందు నేను వివరించడానికి ప్రయత్నించేవాడిని. కానీ ఇప్పుడు నేను అలా చేయడం లేదు. ఎందుకంటే ఈ సినిమా చూడని వారే ప్రచార(ప్రొపగాండా) చిత్రం అని విమర్శిస్తున్నారు. చూసిన తర్వాత బాగుందని అన్నారు. అదే విధంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ చిత్రం విడుదల చేయలేదు. అక్కడి వాళ్ళు సినిమా చూడలేదు కాబట్టి ఇది ప్రొపగాండా అని వారు భావిస్తున్నారు" అని అన్నారు. 

"మన దేశంలో చాలా తెలివితక్కువ మూసలు ఉన్నాయి... జీవితం నల్లగా లేదా తెలుపుగా ఉండాలి, బూడిద రంగులో జీవితం ఉందని వారికి తెలియదు" అని సుదీప్తో సేన్ వ్యాఖ్యానించారు. బీజేపీకి సినిమా నచ్చితే, అది వారి సినిమా అయినట్లు కాదన్నారు. ఒక్క బీజేపీ మాత్రమే కాదు, ఏ రాజకీయ పార్టీకైనా ఇదే సూత్రం వర్తిస్తుందని.. ‘ది కేరళ స్టోరీ’ చిత్రాన్ని అంతర్జాతీయంగా 37 దేశాల్లో ప్రజలు ఇష్టపడుతున్నారని తెలిపాడు. విమర్శకులు కూడా ఫోన్ చేసి మరీ నాతో వారి అభ్యంతరాల గురించి చర్చిస్తున్నారని, కానీ సినిమా చూడకుండా దీన్ని ప్రచార చిత్రంగా అభివర్ణిస్తే వారిక ఎలా వివరించగలనని దర్శకుడు అన్నారు .

సుదీప్తో సేన్ దర్శకత్వంలోని అదాశర్మ, సిద్ధి ఇధ్నాని తదితరులు ప్రధాన పాత్రల్లో 'ది కేరళ స్టోరీ' సినిమా తెరకెక్కింది. కేరళలోని హిందూ యువతులను ట్రాప్ చేసి ఇస్లాంలోకి మతమార్పిడి చేయడం, వారిని బలవంతంగా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాద సంస్థల్లో చేర్పించడం అనేది ఈ సినిమా కథాంశం. అయితే ట్రైలర్‌ లో కేరళ నుంచి 32,000 మంది మహిళలను ISIS రిక్రూట్ చేసుకున్నట్లు పేర్కొనడంతో వివాదం చెలరేగింది. దీనిపై కేరళ సీఎం సహా పలువురు నాయకులు, రాజకీయ పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కోర్టు సూచనతో ట్రైలర్‌ లో స్టేట్మెంట్ ను మార్చబడినప్పటికీ, ఈ సినిమా ద్వారా 'లవ్ జిహాద్' ఆలోచనను ప్రచారం చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ లో ఈ చిత్రాన్ని బ్యాన్ చేయగా.. మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాలు పన్ను రాయితీ ఇవ్వడం చర్చనీయంగా మారింది. 

ఎన్నో కాంట్రవర్సీల మధ్య వచ్చిన 'ది కేరళ స్టోరీ' విజయవంతమైన నేపథ్యంలో, కమల్ హాసన్ ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ‘‘నేను ఎప్పుడూ ఒకే మాట చెబుతాను. నాకు ప్రచార చిత్రాలు నచ్చవు. అలాంటి వాటికి నేను పూర్తి వ్యతిరేకిని. మీరు టైటిల్‌ కింద ‘నిజమైన కథ’ అని రాసుకుంటే సరిపోదు. అలా రాసినంత మాత్రన అది నిజంగా జరిగిన కథ అయిపోదు’’ అని అన్నారు. 

ఇదిలా ఉంటే 'ది కేరళ స్టోరీ' సినిమా ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని మేకర్స్ ప్రకటించారు. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిన హీరోయిన్ అదాశర్మ ఇన్‌స్టా వేదికగా ఓ నోట్‌ రాసింది. దేశంలోని రెండు రాష్ట్రాలు దీనిపై నిషేధం విధించాయి. మిగిలిన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇది నేను అసలు ఊహించలేదు. నా అంచనాలకు మించి ఈ చిత్రం సక్సెస్ సాధించింది అని ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Actress Kasthuri Arrested: తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
తెలుగు ప్రజలపై అనుచిత వ్యాఖ్యలు - సినీ నటి కస్తూరిని అరెస్ట్ చేసిన తమిళనాడు పోలీసులు
Best Selling Hatchback: అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
అక్టోబర్‌లో బెస్ట్ సెల్లింగ్ హ్యాచ్‌బ్యాక్ ఇదే - మార్కెట్‌ను ఏలుతున్న మారుతి!
Chandrababu Brother Passes Away: సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
సోదరుడు రామ్మూర్తి నాయుడు పార్థీవ దేహానికి సీఎం చంద్రబాబు నివాళి
Lagacharla Case: 'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
'పోలీసులపై అత్యాచార కేసులు పెట్టాలి' - లగచర్ల ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు బీఆర్ఎస్ నేతల బృందం ఫిర్యాదు
Embed widget