చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం- వైఎస్‌ఆర్‌సీపీ ఘాటు విమర్శలు
చంద్రబాబు నాయుడుకు మేనిఫెస్టో అంట చిత్తు కాగితంతో సమానం అని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. ముసలి బ్యాచ్ ఒకరినొకరు పలకరించుకోవడానికే మహానాడు పెట్టారని వ్యాఖ్యానించారు.
MLA Kodali Nani: మేనిఫెస్టో అంటే సినిమా కాదంటూ, అందుకే విడతల వారీగా విడుదల చేస్తానని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం అని వైసీపీ నేతలు విమర్శించారు. అసలు చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితంతో సమానం అని అన్నారు. ముసలి బ్యాచ్ ఒకరికొకరు పలకరించుకోవడానికే మహానాడు పెట్టారని ఎద్దేవా చేశారు. మహానాడు క్రమంలో ఆదివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు విడుదల రజిని, మేరుగు నాగార్జున, మాజమంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వేర్వేరు చోట్ల టీడీపీపై విమర్శలు గుప్పించారు. మేనిఫెస్టో గురించి చంద్రబాబు మాట్లాడడం సిగ్గు చేటని మంత్రి విడుదల రజిని అన్నారు. తొలి విడత అంటూ దాన్ని విడుదల చేయడం ఏంటో అంటూ తల పట్టుకున్నారు. తమ నాయకుడు మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్ గా భావిస్తారని చెప్పారు. ఇచ్చిన హామీల్లో 98 శాతానికి పైగా నెరవేర్చి ప్రజల బతుకుల్లో జగనన్న వెలుగులు నింపారన్నారు. కానీ చంద్రబాబు 2014లో 600కు పైగా హామీలు ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదు అన్నారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిట్టడానికే మహానాడు పెట్టుకుంటారంటూ కామెంట్లు చేశారు.
జనసేన కార్యకర్తలంతా సొంత డబ్బు ఖర్చు చేస్తుంటే..!
చంద్రబాబు హైదరాబాద్ లో ఉండి చుట్టం చూపుగా రాష్ట్రానికి వచ్చి తప్పుడు రాజకీయాలు చేస్తున్నాడంటూ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ అన్నారు. పిల్లనిచ్చిన సొంత మామకే వెన్నుపోటు పొడిచాడన్నారు. ప్రజల సంతోషాన్ని నాశనం చేసేందుకు మళ్లీ ఎన్టీఆర్ బొమ్మతో ముందుకు వస్తున్నాడని అన్నారు. ఈయనకు పవన్ తోడవుతున్నాడని తెలిపారు. పవన్ ను నమ్మి గ్రామాల్లో జనసేన కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెడుతుంటే.. పవన్ మాత్రం తన సొంత సామాజిక వర్గాన్ని చంద్రబాబుకు తాకట్టు పెట్టేస్తున్నాడన్నారు. జగన్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఓర్వలేకపోతున్నారంటూ ఫైర్ అయ్యారు.
ప్రజలకు వెన్నుపోటు పొడిసేందుకు మహానాడుతో ముందుకొస్తున్నారు.!
టీడీపీ నేతలంతా కలిసి రాజమండ్రిలో మహానాడు సభ పెట్టారని కొడాలి నాని తెలిపారు. దానివల్ల తెలుగు దేశానికి వచ్చే లాభం ఏమీ లేదని అన్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు మహానాడు కార్యక్రమంతో సిద్ధమవుతున్నాడన్నారు. గతంలో ఎన్టీఆర్ సీఎంగా ఉంటే పార్టీ, రాష్ట్రం నాశనం అవుతుందని చెప్పిన చంద్రబాబు నేడు తిరిగి ఆ మహా నాయకుడి పేరు వాడుకుంటున్నారు. 1999 ఎన్నికల్లో వాజ్ పేయిని అడ్డుపెట్టుకొని గెలిచిన చంద్రబాబు ఆ తర్వాత ఆయన పేరును ఎక్కడా కనబడనివ్వలేదని అన్నారు. తనలాంటి అభిమానులు ఎన్టీఆర్ ఫొటో పెట్టుకుంటే బెదిరించి మరీ తీసేయించారని... ఇప్పుడు రాజకీయ లబ్ధి కొసం మళ్లీ ఎన్టీఆర్ ను చంద్రబాబు వాడుకుంటున్నాడన్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్ కు దమ్ముంటే గుడివాడ, గన్నవరంలో పోటీ చేయాలన్నారు. చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మంత్రి మేరుగు సత్యనారాయణ అన్నారు. ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని ఆయన చేసిన వ్యాఖ్యలు అంబేడ్కర్ ను అగౌరవ పరిచినట్లే అన్నారు. ఆనాడు ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని చంద్రబాబు ఇప్పటికీ అంబేడ్కర్ విగ్రహం పాదాల చెంతకు వచ్చి చెప్పలేదన్నారు. కానీ సీఎం వైఎస్