By: ABP Desam | Updated at : 29 May 2023 06:24 AM (IST)
అమిత్‌షాతో జగన్ సమావేశం (File Photo)
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను సీఎం జగన్ అభ్యర్థించారు. ఢిల్లీలో ఉన్న జగన్... నిన్న రాత్రి కేంద్రమంత్రి అమిత్‌షాతో సమావేశమయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన పలు సమస్యలను అమిత్‌షా దృష్టికి జగన్ తీసుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలకు త్వరగా ఆమోదం తెలపాలని రిక్వస్ట్ చేశారు. ఏపీ,తెలంగాణ మధ్య పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి చొరవచూపాలన్నారు. విభజన చట్టంలోని 9,10 షెడ్యూల్‌లో పొందపరిచిన ఆస్తుల విభజన, తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను కూడా వచ్చేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
న్యూఢిల్లీలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్‌షాతో సీఎం శ్రీ వైయస్.జగన్ భేటీ.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 28, 2023
హోంమంత్రి నివాసంలో దాదాపు 40 నిమిషాలసేపు జరిగిన భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చ.
సీతారామన్‌తో సమావేశం
నీతి ఆయోగ్ మీటింగ్‌లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా కలిశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఆమెతో సుమారు 40నిమిషాలు సమావేశమయ్యారు. నాడు నేడు పథకం, ఆరగ్యరంగాల్లో చేస్తున్న ఖర్చును క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి సాయం చేయాలని ఆమెను రిక్వస్ట్ చేశారు. ఇదే విషయాన్ని కేంద్ర బడ్జెట్‌లో పెట్టినట్టు ఆమెకు గుర్తు చేశారు. విద్య, వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పులు గురించి ఆమెకు వివరించారు. తొలి దశలో 15వేలకుపైగా స్కూళ్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. వైద్య రంగంలో కూడా నాడు నేడు కింద ఆసుపత్రులు పునర్‌నిర్మస్తున్నామని పేర్కొన్నారు. రెండు రంగాలపై వేల కోట్లు ఖర్చు పెట్టామన్నారు సీఎం జగన్. వాటిని క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంట్‌గా భావించి సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ భేటీ. దాదాపు 40 నిమిషాలసేపు సాగిన సమావేశం. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందించిన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేసిన సీఎం. pic.twitter.com/iQ7dYBzAHR
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 26, 2023
గత ప్రభుత్వం చేసిన తప్పులు కారణంగా ఇప్పుడు రుణ పరిమితి విధించారని వాటిలో సడలింపు ఇవ్వాలని నిర్మలా సీతారామన్‌ను జగన్ కోరారు. విభజన తర్వాత తెలంగాణకు ఏపీ విద్యుత్ సరఫరా చేసిందని దీనికి 6,756.92 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని ఆ బకాయిలు వచ్చేలా చూడాలన్నారు.
జలవనరుల మంత్రితో భేటీ
కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కూడా సీఎం జగన్ కలిశారు. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలు ఆమోదించాలని అభ్యర్థించారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. వీళ్ల భేటీ కూడా సుమారు 30 నిమిషాలు సాగింది.
నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశం తర్వాత కేంద్ర జలశక్తిశాఖ మంత్రి శ్రీ గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్. పోలవరం సహా రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రాజెక్టులపై చర్చించిన ముఖ్యమంత్రి. pic.twitter.com/dAAX0CCU8C
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) May 27, 2023
Ayyanna Patrudu: జగన్ రెడ్డి జైలు పక్షి, ఆయన వచ్చాక రాజకీయాలు దారుణంగా తయారయ్యాయి: అయ్యన్న పాత్రుడు
CM Jagan: సీఎం జగన్ మంచి మనస్సు- ఓ వ్యక్తి ప్రాణాన్ని కాపాడేందుకు హెలికాప్టర్ ఏర్పాటు
AP POLYCET: అక్టోబర్ 3న పాలిసెట్ 'స్పాట్ అడ్మిషన్లు', పరీక్ష రాయకపోయినా అవకాశం
MLC Ashok Babu: ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరగలేదు, రూ.900 కోట్ల ఆదాయం: అశోక్ బాబు
Andhra Pradesh: న్యాయమూర్తులపై దూషణలు: హైకోర్టులో ఏజీ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
Kishan Reddy On Ktr : ప్రధాని పర్యటనపై కేటీఆర్ విమర్శలు - కిషన్ రెడ్డి కౌంటర్ !
Nithya Menen: నిత్యా మీనన్‌పై తమిళ హీరో వేధింపులు - బాధగా ఉందంటూ నటి పోస్ట్
Byjus Layoffs: బైజూస్ లో భారీగా ఉద్యోగాల కోత- దాదాపు 5000 మందికి ఉద్వాసన!
Bigg Boss Season 7 Telugu Day 22 Updates: శోభాశెట్టిపై గౌతమ్ అసభ్యకర సైగలు? పల్లవి ప్రశాంత్ చెప్పింది నిజమేనా? ఆ రోజు ఏం జరిగింది?
/body>